June 7, 2023

మన సంసృతిలో శంఖానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. విష్ణుమూర్తి అలంకారాల్లో శంఖం ప్రధానమైనది. క్షీరసాగర మధనంలో ఎన్నో విలువైన వస్తువులు వచ్చాయి. వాటిలో 14 రత్నాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి శంఖం. అందుకే అతి పవిత్రమైన ఆధ్యాత్మిక వస్తువుల్లో ఒకటి శంఖం. క్షీరసాగర మధనంలో ధన దేవత లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించారు. కనుక… లక్ష్మీ దేవికి శంఖం సోదరుడు అవుతాడు. ఈ వివరణ మనకు విష్ణు పురాణంలో కనిపిస్తుంది. చాలా పురాణ కథల్లో దుష్ట శక్తుల అంతానికి విష్ణుమూర్తి శంఖాన్ని ఉపయోగించాడు. అందుకే విష్ణుమూర్తి ఆయుధాలైన శంఖు, చక్ర, గదల్లో… శంఖువే ప్రధమంగా నిలిచింది. విష్ణువు… శ్రీ కృష్ణుని అవతారంలో ఉన్నప్పుడు శంఖం పేరు పాంచజన్యం. శంఖం ద్వార సృష్టించే శబ్దం కూడా ఒక ఆయుధంలా పనిచేస్తుంది.
అందుకే భారతంలో పాండవులు కూడా శంఖాలను ధరించారు. అర్జునుడి శంఖం దేవదత్తం, భీముని శంఖం పౌండ్రకం, ధర్మరాజు శంఖం అనంత విజయం, నకులుని శంఖం సుఘోష, సహదేవుని శంఖం మణిపుష్పం. యుద్ధం మొదలు పెట్టేముందు శంఖారావం చేయడం ఒక నియమం. విజయానికి సంకేతంగా కూడా శంఖాన్ని పూరిస్తారు. ఆధ్యాత్మిక భావనలో శంఖంలో దేవతలు కొలువై ఉంటారని నమ్మిక. శంఖం పీఠ భాగంలో వరుణుడు, సూర్యుడు, చంద్ర అంశలుంటాయి. శంఖం ఉపరితలం మీద ప్రజాపతి, శంఖం ముందు భాగంలో గంగా సరస్వతులు ఉంటారట. అందుకే పూజలు, యజ్ఞాల్లో శంఖాన్ని తప్పనిసరిగా వినియోగిస్తారు. శంఖ ధ్వనిని విజయానికి, కీర్తికి, లక్ష్మీ ఆగమనానికి సూచిక. సిరిసంపదలు లభించాలంటే పూజామందిరంలో దక్షిణావర్త శంఖం ఉండాలని అంటారు. దక్షిణావర్తమంటే మనం చూసినప్పుడు శంఖం కుడివైపు తెరుచుకుని ఉండాలి. అలాంటి శంఖాన్ని దక్షిణావర్తం అంటారు. దక్షిణావర్త శంఖం లక్ష్మీ నివాసమంటారు. అందువల్ల ఇలాంటి శంఖాన్ని పూజగదిలో ఉంచి రోజూ పూజిస్తే లక్ష్మీ ప్రదమని శాస్త్రాలు చెప్తున్నాయి. శంఖంలో ఉండే జలానికి ఆరోగ్య శక్తి ఉంది. అందుకే శంఖు తీర్థం రోగనివారిణిగా కూడా చెప్తారు. అందుకే శంఖులో పోస్తేగాని తీర్థం కాదు అనే సామెత వచ్చింది. శంఖాల్లో చాలా రకాలున్నాయి. శంఖాన్ని ఊదడం అంత సులువు కాదు. పొత్తి కడుపు నుంచి గాలిని తెచ్చి ఊదితే తప్ప శంఖం నుంచి శబ్దం రాదు. అందువల్ల శంఖం నిత్యం ఉదగలిగే వారికి శ్వాస కోస వ్యాధులు వచ్చే అవకాశమే లేదు. శంఖం ఊదడం శ్వాసకు సంబంధించిన అత్యుత్తమ వ్యాయామం. శంఖం ఊదితే ప్రాణాయామం చేసినట్టే. నిత్యం శంఖం ఊదితే ఊపిరితిత్తుల వ్యాధులు, హృద్రోగాలు రావు. అంతేకాదు శంఖం నుంచి వచ్చే శబ్దానికి అపరిమిత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దాని వల్ల ఆ శబ్దానికి దుష్ట శక్తులుగా చెప్పే బ్యాక్టీరియాలు, వైరస్ లు చాలావరకు నశిస్తాయి. శంఖం శబ్దం వినడం వల్ల అంత మంచి జరుగుతుంది కాబట్టే… శంఖ ధ్వని వింటే పురాణం విన్నంత ఫలితం అని మన పెద్దలు చెప్పారు. ఆ కారణంతోనైనా శంఖ శబ్దం వింటారన్న ఉద్దేశం. అందుకే ఇంట్లో శంఖం ఉంటే వల్య ఆరోగ్యం, ఐశ్వర్యం.

About Author

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *