June 3, 2023

‘విశ్వ’ రూపమే నారాయణ సూక్తం – వేదం జీవన నాదం-4

‘విశ్వ’ రూపమే నారాయణ సూక్తం – వేదం జీవన నాదం-4

ఓంకార బిందు సంయుక్తం,
నిత్యం ధ్యాయంతి యోగినః,
కామదం మోక్షదం తస్మా,
ఓంకారరాయ నమోనమః

పెద్దలు, విజ్ఞుల ప్రవచనాలను అందరూ వినేవింటారు. ఓంకారమే సర్వస్వం అని వారు ఏదో సందర్భంలో చెప్పడం మనకు తెసులు. ఆ సర్వస్వం ఏంటో చాలా మంది అర్థంకాని విషయం. మన ధర్మం మీద అందరికీ ఆసక్తి కలగాలంటే ముందు ఆ ధర్మాన్ని లాజికల్‌గా విశ్లేషణ చేసి, అర్థాన్ని చెప్పగలగాలి. చిన్నపిల్లలు అడుగుతారు. దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? అని అడిగితే మనవాళ్లు చెప్పే సమాధానం.. “కళ్లుపోతాయి“. అదేం సమాధానమో ఇప్పటికీ అర్థంకాదు. కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌ కాదు. మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు. పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, వ్యాయామం. మనసుతో చేసే వ్యాయామం. మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే వర్క్‌ అవుట్‌ అది. దీప ప్రజ్వలనం.. త్రాటకం అనే యోగ ప్రక్రియ. రోజూ ఓ మూడు నిమిషాలు దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులను ఫస్ట్‌లోనే ఆపేయొచ్చు. ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు. అది నాలికకు ఎక్సర్‌సైజ్‌. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి పిల్లలకు వస్తుంది. భాష మీద పట్టు పెరిగితే స్టేజ్‌ ఫియర్‌ పోతుంది. ఇది చెప్పండి పిల్లలకి. పూజ అంటే మంత్రాలు కావు, చాదస్తం కాదు. మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని కూర్చోబెట్టుకుని చెప్పండి. మర్నాడు.. మీరు చెప్పకుండానే పిల్లలు దేవుడి గది దగ్గరకు వెళ్తారు. అంతే తప్ప కళ్లుపోతాయి, కాళ్లు పోతాయి.. అని చెప్తే చిన్నవయసులోనే మన ఆధ్యాత్మికత మీద మనసు విరిగిపోతుంది. ఇప్పుడు నా ప్రయత్నం మన వైదిక ధర్మం గురించి చిన్న వయసులోనే పిల్లలు తెలుసుకోవాలని. ఇప్పుడు ఓంకారం గురించి మన ఋషులు ఏం చెప్పారో చూద్దాం.

ప్రణవోహి పరబ్రహ్మా ప్రణవః పరమం పదం
ప్రణవం సర్వవేదాద్యం సర్వదేవ మయం విదుః
అర్థం: ప్రణవమే పరబ్రహ్మం. ప్రణవమే ముక్తి. ప్రణవమే వేదాలకు మూలం. ప్రణవమే సకల దేవతలకూ ఆద్యం.

అనయా సదృశీ విద్యాఅనయా సదృశీ జపః
అనయా సదృశం పుణ్యం న భూతో న భవిష్యతిః|”
అర్థం: ఓంకారాన్ని మించిన విద్య లేదు. ఓంకారాన్ని మించిన జపం లేదు. ఓంకారాన్ని మించిన పుణ్యం లేదు.

యద్వా ప్రణౌతి ప్రస్తూయతే అనయా బ్రహ్మేతి ప్రణవః
ప్రాణాన్ సర్వాన్ పరమాత్మని ప్రణానయతీ త్యేతస్మాత్ ప్రణవః”
అర్థం: ఈ ప్రణవం దైవం సృష్టించిన బ్రహ్మం లేదా బ్రహ్మాండానికి చెందినది.
జీవమంతటినీ పరమాత్మలో లగ్నం చేసేదీ ప్రణవమే.

పై మంత్రాల అర్థాలను, ఆధునిక పరిశోధనల సారాన్ని పోల్చి చూడండి. “బ్రహ్మాండం నుంచి ఓంకారం అనే శబ్దం వచ్చింది, ఆ శబ్దం విశ్వంలో ఉన్న ప్రతీ ప్రాణిని ఆవహించిపరమాత్మను కనెక్ట్‌ చేస్తోంది. దైవిక శబ్దం కాబట్టి ఓంకారాన్ని మించినది లేదు.”. మన ప్రాచీన ఋషులు జ్ఞానశక్తితో కనుగొన్న ఓంకార శబ్దానికి, సాంకేతికతతో ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొని చెప్పిందీ ఒక్కటే. సృష్టికి మూలం కాబట్టే ఓంకారాన్ని ఆదిశక్తిగా పూజిస్తున్నాం. “ఓంకార పంజర శుకీం….” అని అమ్మవారిని కీర్తిస్తాం. అంటే ఓంకారమనే పంజరంలోనే శక్తులన్నీ ఉన్నాయి. ఆ శక్తులను ఆవాహన చేయాలంటే పాస్‌వర్డ్‌ఓంకారం. ఇదే అన్ని మంత్రాల సారం. సృష్టి రహస్యం గురించి ఉపనిషత్తులు చాలా చక్కటి వివరణనిచ్చాయి. ఛాందోగ్యోపనిషత్‌లో కాస్మో ఫిజిక్స్‌ గురించి అద్భుత రీసెర్చ్‌ జరిగింది. ఆ ఉపనిషత్‌లో ఉన్న వివరణ క్లుప్తంగా…” సృష్టికి ముందు ఒకే ఒక మహా బిందువు ఉండేది. ఆ బిందువుని సత్‌ అని నిర్వచించారు. ‍ఇదే బ్రహ్మపదార్థం. (సత్‌.. అంటే ఉండడం అని అర్థం. అది ఫిజికల్‌ స్టేట్‌ఆ భౌతిక పదార్థమే మ్యాటర్‌“). మొదటి సత్‌ పదార్థం మహా శక్తి వల్ల, సంకల్పం వల్ల అనేక పదార్థాలుగా విడిపోయింది. ఆ మహాశక్తి క్షేత్ర రూపంలో (ఈక్వేషన్‌) బ్రహ్మ పదార్థాన్ని విభజించింది. ( క్షేత్ర రూపం అంటే GEOMETRIC FIGURE‌) ఆ గ్రాఫికల్‌ రూపాన్నే ప్రస్తుతం మనం శ్రీచక్రంగా పూజిస్తున్నాం). ఇప్పుడు చెప్పండిబిగ్‌బ్యాంగ్‌కి పూర్వం మాటరే లేదని సైన్స్‌ చెప్తోంది. ఛాందోగ్యోపనిషత్‌ కూడా సృష్టికి ముందు ఏమీ లేదని, ఓ మహా బిందువు బద్దలై సృష్టి ఏర్పడిందని చెప్తోంది. ఇప్పటి బిగ్‌బ్యాంగ్‌కి, నాడు మన వేదంలో ఉన్న కాస్మోఫిజిక్స్‌కి తేడా ఏంటో చెప్పండి? ఆధునిక పరిజ్ఞానంతో మనం కనిపెట్టింది .. జ్ఞాన దృష్టితో వేల ఏళ్ల క్రితమే కనుగొన్నారు మన ఋషి శాస్త్రవేత్తలు. ఇక అసలైన కథలోకి వెళ్దాం.

సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్ర పాత్
స భూం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం
ఇంట్లో మనం పూజ, హోమం, వ్రతం ఏది చేసినా కచ్చితంగా పఠించే పురుష సూక్తమిది. ఋగ్వేదంలో 10వ మండలంలో సాక్ష్యాత్తూ నారాయణుడే ఈ విశ్వానికి అందించిన మంత్ర సూక్తమిది. అందుకే ఈ ఋక్కులను నారాయణ సూక్తమని కూడా అంటారు. ఈ పురుష సూక్తం అర్థమిప్పుడు తెలుసుకుందాం.
పురుష సూక్తం సంక్షిప్త అర్థం: ఒక మహా బిందువు నుంచి పుట్టిన మొదటి వృత్తం లక్షణాన్ని వివరిస్తోంది పురుష సూక్తం. పురుష సూక్తం అంతా mathematics.
మన ఎక్కడి నుంచి వచ్చామో, మన మూలమేంటో గుర్తు చేసుకునే సూక్తమది.
సహస్రశీర్షా పురుషః …” మంత్రం ఒక మహా బిందువు నుండి పుట్టిన మొదటి 
వృత్త లక్షాణాన్ని వర్ణిస్తుంది. శీర్షము అంటే శిరస్థానీయ బిందువు (“vertex”).
వృత్తం మీద ప్రతి బిందువూ శీర్షమే. అలాంటి ఎన్నో బిందువుల కలయికే సహస్ర శీర్షం “. సహస్రం అంటే వెయ్యి మాత్రమే కాదు అనంతం (Infinite) అనే పర్యాయ అర్థం కూడా ఉంది. ఇక సహస్రాక్షం…” అక్షం అంటే Axis of symmetry. తెలుగులో సౌష్టవ రేఖ అని చదువుకున్నాం. ఇంకా సులభ అర్థంలో వృత్తం చుట్టుకొలతను ఒక రేఖగా గీయడమే సౌష్టవ రేఖ (the line of diameter). ఒక వృత్తంలో అక్షాలు కూడా అనంతమే. ఇదే సహస్రాక్షం. సహస్ర పాత్‌ అంటే అనంతమైన భుజాలు ఉన్నది అని అర్థం. పాత్‌ అంటే భుజం. ఒక వృత్తం అనంత బహుభుజి. Polygon of infinite sides. ఇప్పుడు చూడండి.. సహస్ర శీర్ష, సహస్ర భుజ, సహస్ర అక్ష.. అన్నీ mathematics of a Circle. వృత్త గణితమే. ఇప్పుడు సృష్టి రహస్యాన్ని పురుష సూక్తం ఎలా వర్ణించిందో చూద్దాం.
ఒక మహా బిందువు చుట్టూ ఓ వృత్తం ఏర్పడింది.
ఆ వృత్తం అనంతమైన శీర్షాలు, భుజాలతో.. అనంతంగా వ్యాపించడం మొదలు పెట్టింది.

సజాతో అత్యరిత్యత | పశ్చాద్ద్భూమిమధోపురః” 
సజాతో అంటే మొదటి వృత్తం నుంచి మరిన్ని వృత్తాలు పుట్టాయి. ఆ వృత్తాలు కూడా ఒకే వ్యాసం, ఒకే పరిమాణం కలిగి ఉన్నాయి. అలా ఒకే గుణం ఉన్న మరో నాలుగు వృత్తాలు, నాలుగు వైపులా మొదటి బిందువు నుంచి పుట్టాయి.

సప్తాస్యాన్ సప్త పరిధయః| త్రిసప్త సమిధః కృతాః|”
మొదట ఒక వృత్తం, ఆ వృత్తాన్ని బేస్‌ చేసుకుని మరో నాలుగు. అంటే మొత్తం ఐదు వృత్తాలు. ఈ ఐదు వృత్తాల మీదుగా 7 పరుధులు (సప్త పరిథయ),
21
బిందువులతొ (త్రిసప్త= 3×7=21) ఒక క్షేత్రం రూపొందింది. (ఆ క్షేత్ర యంత్రమే శ్రీచక్రం. పురుష సూక్తంలో శ్రీ చక్ర ఆవిర్భావాన్ని చెప్పే మంత్రమిది). mathematicsలో ప్రకారం unions, intersections గుర్తున్నాయా…? ఈ థియరీ ప్రకారంమొదటి వృత్తం అంచుల మీద నాలుగు దిక్కులలో నాలుగు సజాతి వృత్తాలు వేశారనుకోండి. ఆ నాలుగు వృత్తాలను చుడుతూ బయట మరొక బాహ్యవృత్తం. ఈ నాలుగు వృత్తాలను లోపల చుడుచూ మరో అంతర్‌ వృత్తం గీస్తే మొత్తం ఇవి 7 వృత్తాలవుతాయి. ఈ ఏడు వృత్తాలు కలిసే చోట పాయింట్స్‌ పెడితే.. అవి 21 అవుతాయి. ఇదే శ్రీచక్రం ప్రాథమిక రూపం.

పురుషసూక్తంలో శ్రీచక్ర వివరణ ఇలా ఉంటుంది. కింద ఈ వృత్తాల ఇమేజ్‌ని కూడా అప్‌లోడ్‌ చేశాను చూడండి. అంటే మొదట వ్యాప్తి చెందిన బిందువుతో ఇదంతా తయారైంది. అక్కడి నుంచి ఈ విశ్వం ఆగకుండా విస్తరిస్తూనే ఉందని పురుషసూక్తం చెప్తోంది. ఇదే విశ్వ రూపం. ఆ విశ్వరూపానికి బ్లూప్రింట్‌ శ్రీచక్రం. ఆ విశ్వశక్తిని తనలో దాచుకున్న రూపం శ్రీక్రం. అందుకే ఇంట్లో శ్రీచక్రం ఉంటే దేనికి లోటుండదని అంటారు. మన శాస్త్రవేత్తలు బిగ్‌బ్యాంగ్‌ థియరీలో చెప్పింది కూడా ఇదే. బిగ్‌బ్యాంగ్‌ థియరీ కన్నా పురుష సూక్తంలో ఉన్న విశ్వరూప వర్ణనే అద్భుతంగా ఉంటుంది. మిగిలిన పురుష సూక్త మంత్రాల్లో విశ్వం ఇలా ఆవిర్భవించిన తర్వాత ఏం జరిగింది? జీవం ఎలా ఆవిర్భవించింది? ప్రాకృతిక శక్తులు ఎలా పుట్టాయి? అన్న వివరణ ఉంటుంది. ఇప్పుడో కంక్లూజన్‌కి వద్దాం. విశ్వంలో తొట్టతొలిగా ఒక బ్రహ్మాండం (బ్రహ్మ+అండం) తయారయ్యింది. ఆ బ్రహ్మాండాన్ని సూక్ష్మ బిందువుగా నిర్వచించింది పురుష సూక్తం. ఈ బ్రహ్మాండన్ని ఎవరు తయారు చేసారు అన్న ప్రశ్నకి ఆధ్యాత్మికంగా చూస్తే దాని సమాధానం భగవంతుడే. ఎందుకంటే నారాయణుడి నాభి నుంచి ఉద్భవించినవాడు బ్రహ్మ. అంటే పేగు బంధం అనే కదా అర్థం. అలా ఓ అతీత శక్తి నుంచి బ్రహ్మాండం పుట్టింది. ఆ వివరాన్ని డీకోడ్‌ చేసే చిత్రమే నారాయణుడు, అతని నాభి నుంచి పుట్టిన బ్రహ్మ. ఇంకా విచిత్రంగా బ్రహ్మకు నాలుగు తలలు. ఒకప్పుడు ఐదు ఉండేవట. అంటే మనం పైన చెప్పుకున్న పురుష సూక్తంలో ఒక బిందువు, దాన్నుంచి వృత్తం, ఆ వృత్తం నుంచి మరో నాలుగు వృత్తాలు. మొత్తం ఐదు వృత్తాల లెక్కకి. బ్రహ్మ తలలకు లెక్క సరిపోతోంది. సృష్టి ఆవిర్భావ వివరణ with mathematics and cosmic theory మన వేదంలో ఇంత క్లియర్‌గా ఉంటేసృష్టి ఆవిర్భావానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నకు ఇంకా సైన్స్‌ దగ్గర సమాధానం లేదు. బిగ్‌బ్యాంగ్‌ కూడా ఒక ఊహే. బ్రహ్మాండం తయారై.. లోపల మహా ప్రోటాన్లు, మహా న్యూట్రాన్ల తాడనం వల్ల, విచ్ఛిత్తి జరిగిఅనంత గురుత్వాకర్షణ ఏర్పడిఆ బ్లాక్‌హోల్‌ (బ్రహ్మాండం) పేలితే.. అక్కడ నుంచి ఈ గ్రహాలు నక్షత్రాలు ఏర్పడ్డాయన్నది ఋగ్వేదం థియరీ. విశ్వంలో కాలం ముగిశాక పేలిపోయే నక్షత్రాలు కూడా బ్లాక్‌హోల్స్‌లోనే పడిపోతాయని స్టీఫెన్‌ హాకింగ్స్‌, అంతకు ముందు ఐన్‌స్టీన్‌ కూడా చెప్పిన సిద్ధాంతమే. దీన్నే మన ఆధ్యాత్మికంలో లయం అంటున్నాం. ఈ లయానికే మరో అర్థం శివం. శివం అంటే ఐక్యమైపోవడం. లయకారుడు శివుడయ్యాడు. విశ్వం విస్తరిస్తూ ఉంటుంది. విస్తరణ అనే పదానికి మూలం విష్ణుం. విష్ణుం అంటే expanding. స్థితి కారకుడు విష్ణువయ్యాడు.
సృష్టి కారణం బ్రహ్మాండం. ఆ బ్రహ్మ గురించి ముందే చెప్పుకున్నాం. ఇది మన బ్రహ్మ, విష్ణు, శివుల.. సైంటిఫిక్‌ కథ. ఈ మూడు శక్తులకు మూల శక్తినే ఆదిశక్తిగా, అమ్మగా పూజిస్తున్నాం. ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని మనం పూజిస్తున్నాం. రోజూ సైన్స్‌ని మనం పూజిస్తున్నాం.బ్రహ్మాండం బద్దలవ్వడానికి ముందు అంతా అతి భయంకరమైన నిశ్శబ్దం. బ్రహ్మాండం బద్దలయ్యి ఆ శబ్దంతోనే విశ్వం ప్రారంభం అయింది. ఆ పేలుడు వల్లే విశ్వంలో ఉన్న ప్రతీ అణువుకి, నక్షత్రానికి, గ్రహానికి ఓ నిర్ణీత వేగం, కక్ష్య ఏర్పడాయి. ఆ కదలిక వల విశ్వంలో ప్రతీ పదార్థానికి ధ్వని వచ్చింది. ఆ ధ్వనే ఓంకారమమని వేదం చెప్తోంది. విశ్వంలో ప్రతీ పదార్థం తాను పుట్టిన చోటుకి వెళ్లాలనే తాపత్రయపడుతుంటాయి. కానీ, మూలబిందువు ఆ తాపత్రయానికి అడ్డుపడుతుంటుంది. అదే గురుత్వాకర్షణ శక్తి. ఆకర్షణ, వికర్షణ సిద్ధాంతం. ఈ సిద్ధాంతమే మన భూమిని నడిపిస్తోంది. మనల్ని నడిపిస్తోంది. ఆది శబ్దం ఓంకారం నుంచి అన్ని శబ్దాలు పుట్టాయి. ఆ శబ్దమే రూపాంతరం చెంది మాటైంది, ఆ తర్వాత భాషైంది. బీజాక్షరాలు, మంత్రాలకు ఆది.. ప్రణవనాదమైంది.
మరి విశ్వం ఏర్పడినప్పుడు వచ్చిన ఓంకారం అనే శబ్దం అవిచ్ఛిన్నం కదా. అవును.. ఓమ్‌కారం అఖండితం. ఓంకారాన్ని పఠిస్తే నూనె ధారలాగా అవిచ్ఛిన్నంగా.. సుదీర్ఘంగా పలకాలట. అంతే గానీ.. ఓమ్‌, ఓమ్‌, ఓమ్‌ అని మంత్ర ముగింపు చేయకూడదట. ఎందుకంటే ఇంకా విశ్వం నుంచి ప్రణవనాదం వస్తోంది. ఆ నాదం ముగిసిపోదే సృష్టి ఉత్పత్తి ముగిసిపోయినట్టే. టెశ్లా రికార్డ్‌ చేసిన కాస్మిక్‌ సౌండ్‌ కూడా అవిచ్ఛినంగా, ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నాయని చెప్పుకున్నాం. ఓంకార పఠనానికి కూడా ఓ పద్ధతి ఉంది. ఓంకారాన్ని మూడు మాత్రలుగా పలకాలి. అని ఎత్తుకుని.. సాధ్యమైనంత ఎక్కువసేపు అనే శబ్దాన్నే కట్‌ చేయకుండా పఠించి.. తర్వాత మ్‌అనాలి. అంతేగాని శబ్దాన్ని తక్కువగా మ్‌శబ్దాన్ని ఎక్కువగా పఠించకూడదని వేద కోవిదులు చెప్పారు. లాజికల్‌గా కూడా ఇది నిజం. “ఓ” అనే స్వరం అవిచ్ఛిన్న విశ్వరూపానికి సంకేతం. “మ్‌అనేది విశ్వానికి ఆఖరి క్షణం. ఈ ఓంకారమే గ్రహాల మధ్య ప్రధాన వాహకం అనుకోవచ్చు. గ్రహాల మధ్య ప్రయాణాలకు ఈ ఓంకారం అనే శబ్ద మాధ్యమాన్ని మన ఋషులు ఉపయోగించారేమో…!!! ఎందుకంటే ఐన్‌స్టీన్‌ టైమ్‌ ట్రావెల్‌ సిద్ధాంతం కాస్త అటు ఇటుగా ఇలాంటి వాహకాలనే చెప్తుంది.”ప్రణవంహీశ్వరం వింద్యాత్‌ సర్వస్య హృది సంస్థితం…” అంటే.. అన్ని జీవుల హృదయాల్లో ప్రాణంగా ఉన్నది ఈ ఓంకారమే. అంతే మరిసృష్టి ఆవిర్భావానికి కారణమైన శక్తే మనలోనూ ఉంటుంది. అమ్మ పేగు బంధంలా. మరి.. మన చుట్టూనే ఉన్న ఆ ఓంకార విశ్వ శక్తిని మనం దర్శించాలంటే కనీసం ఫీల్‌ అవ్వాలంటే దానికి ఒక్కటే మార్గం యోగం. ఓంకారం అంటే శక్తిమంతమైన రేడియో తరంగాలని గతంలో చెప్పుకున్నాం. రేడియోలో పాటలు వినాలంటే ట్యూన్‌ చేస్తాం. అలాగే మన ప్రాణాలకు ఆధారమైన విశ్వ తరంగ గీతాన్ని వినాలంటే మన మెదడులో ఉన్న యాంటినాలను సరి చేసుకోవాలి. అదే ఉపాసన. ఈ పనే మన ఋషులు చేశారు. దాన్నే తపస్సు అన్నారు. మనిషి తన ఉఛ్వాస నిశ్వాసలను నియంత్రణ చేయగలిగితే వెయ్యేళ్లు కూడా బతకవచ్చు. ఇది ప్రాణాయామం ద్వారా సాధ్యమే. అలా వందల ఏళ్లు తపస్సు చేసి ఓంకార స్పర్శ ను అనుభవించడమే మోక్షంగా భావించారు. విశ్వాన్ని సృష్టించిన శక్తి విశ్వరూపమేగా దైవదర్శనం. అలా ఆ దైవదర్శనం నుంచి ఋషులకు ట్రాన్స్‌మిట్‌ అయిన జ్ఞానమే వేదం. ఒక్క సూర్యకిరణం విడిపోతే ఏడు రంగులయ్యాయి. అలాగే.. ఓంకారంశబ్దంగా, బీజాక్షరంగా, మంత్రంగా, వేదంగావిశ్వమంతా సుస్వర శబ్దంగా మన చుట్టూనే తిరుగుతోంది. ప్రాణ నాడికి జీవం పోస్తోంది. ఇదీ వేదం పుట్టిన నాటి అసలు చరిత్ర. ఈ ఓంకారాన్ని కనిపెట్టింది మన భారతీయులని గర్విద్దాం. రోజు కనీసం కొద్ది సేపైనా ఓంకార ఉపాసన చేసి విశ్వంతో మాట్లాడదాం.

సతీష్‌ కొత్తూరి

About Author

admin

2 Comments

    Wow… చాలా ఆనందం గా ఉంది సతీష్ సర్..మొత్తానికి మీ కల నెరవేరింది..భవిష్యత్తు వైభవం గా ఉండాలని ఆశిస్తూ…
    మీ శ్రీ హర్ష

      thanq very much harsha garu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *