June 7, 2023

అర్జున్‌ రెడ్డి పేరులోనే ఏదో మ్యాజిక్‌ ఉంది…!!!

అర్జున్‌ రెడ్డి పేరులోనే ఏదో మ్యాజిక్‌ ఉంది…!!!

ఎన్ని వివాదాలు, విమర్శలున్నా అర్జున్‌ రెడ్డి సినిమా ఓ సంచలనం. సినిమాలో హీరో లాగే కథ కూడా చాలా ‘రా’. సున్నితమైన ప్రేమ కథకి టిపికల్‌ సైకాలజీని జోడించిన సందీప్‌ వంగా సక్సెస్‌ అయ్యారు. ఆ పాత్రలో జీవించిన విజయ్‌ దేవరకొండ స్టార్‌ అయిపోయాడు. అంతవరకు ఎక్కడో ఉన్న విజయ్‌… ఎంతో మందిని దాటుకుంటూ వచ్చేశాడు. ఏకంగా నేషనల్‌ లెవల్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే సినిమాని బాలీవుడ్‌లో కబీర్‌ సింగ్‌ పేరుతో షాహీద్‌ కపూర్‌ని పెట్టి తీస్తే అక్కడా సూపర్‌ హిట్టే. అక్కడా ఎన్నో వివాదాలు వచ్చాయి. అవన్నీ యూత్‌కి పట్టలేదు. 300 కోట్ల రూపాయల వసూళ్లు ఇచ్చారు. ఈ ఏడాది ఆల్‌టైం హిట్‌ మూవీస్‌లో కబీర్‌ సింగ్‌ ఒకటి. సహజంగానే ఇలాంటి విభిన్నమైన క్యారెక్టర్లను ఇష్టపడే హీరో విక్రమ్‌కి ఈ కథ పిచ్చిగా నచ్చింది. తన కుమారుడిని ఈ సినిమాతో ఇంట్రడ్యూస్‌ చేయాలని అనుకున్నప్పుడే సగం సక్సెస్‌ అయ్యాడు. మొదట బాలాతో షూట్‌ చేయించారు. ఆ తర్వాత విక్రమ్‌ మళ్లీ రీషూట్ చేయించడం ఇలా కోలీవుడ్‌లోనూ ఈ సినిమాలో వివాదాల దారిలోనే నడిచింది.తమిళంలో ఆదిత్య వర్మ పేరుతో వచ్చిన అర్జున్ రెడ్డి సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. విక్రమ్‌ కుమారుడు ధ‌ృవ నటనకు యూత్‌ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. మొత్తానికి అర్జున్‌ రెడ్డిలో ఏదో మ్యాజిక్‌ ఉంది.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *