June 3, 2023

20 పాత్రల్లో విక్రమ్‌…!!!

20 పాత్రల్లో విక్రమ్‌…!!!

అప్పట్లో దశావతారం ఓ సంచలనం. విలక్షణ నటుడు కమల్‌ అందులో ఏకంగా 10 రకాల పాత్రల్లో జీవించారు. ఇప్పుడు ఆ రికార్డుని మరో విలక్షణ నటుడు విక్రమ్‌ బ్రేక్ చేస్తున్నారు. ఆయన నటించబోయే కొత్త సినిమాలో విక్రమ్‌ ఏకంగా 20 పాత్రల్లో కనిపిస్తారు. కథ వివరాలు ఇంకా బయటకు రాలేదు. దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు. వెరైటీ పాత్రల కోసం ఎంతకైనా తెగించే విక్రమ్‌ 20 పాత్రల్లో చాలా ఈజీగా థ్రిల్‌ చేయగలరు. గతంలో మల్లన్న సినిమాలో విక్రమ్‌ రకరకాల పాత్రల్లో కనిపించారు. శంకర్‌ తీసిన అపరిచితుడు సినిమాలో అయితే మూడు పాత్రల్లో జీవించారు. ఇప్పటికీ టీవీల్లో ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌. ఆ తర్వాత శంకరే తీసిన ఐ మూవీలో విక్రమ్‌ పడిన కష్టం అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్‌ అయినా… అందులో క్యారెక్టర్ల కోసం విక్రమ్ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయలేదు. ఈ కొత్త సినిమాలో హీరోయిన్‌గా కేజీఎఫ్‌ ఫేమం శ్రీనిథి శెట్టీ నటిస్తున్నారు. మరి విక్రమ్‌ కొత్త సినిమా మరో అపరిచితుడు అవుతుందా? వెయిట్‌ అండ్‌ సీ.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *