దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి బయోగ్రఫీతో వస్తున్న చిత్రం యాత్ర. ఇప్పుడంతా బయోపిక్ డేస్. ఇటు మహానటి, అటు సంజూ రెండూ సూపర్ హిట్లు. ఇవి బయోపిక్ సినిమాలపై అంచనాలు పెంచేశాయి. ఎన్టీఆర్ మూవీపై కూడా భారీ అంచనాలున్నాయి..
అయితే మమ్ముట్టి, జగపతి బాబు, రావు రమేష్, సుహాసిని లాంటి నటులతో మహి.వి.రాఘవ్ తీస్తున్న యాత్ర సినిమాకు బజ‌్ వచ్చింది. ఈ సినిమాలో కథ, కథనం రెండూ ఆసక్తికరమే. ఎన్నో మలుపులతో కూడిన వైఎస్ జీవితాన్ని ఎలా చూపించారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ఈ మూవీ టీజర్ రిలీజ్ పై మొత్తానికి యూనిట్ స్పందించింది. జూలై 8 వైఎస్ 69వ జయంతి. ఆ రోజున యాత్ర మూవీ టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం చెప్తోంది.