May 30, 2023

కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా నానా కష్టాలు పడింది. అయితే ఓటీటీలకు మాత్రం ఆ టైమ్ బాగా కలిసొచ్చింది. నిజానికి 2022 నాటికి ఓటీటీలు స్పీడ్ అందుకుంటాయని అప్పట్లో సర్వేలు చెప్పాయి. కానీ.. కొవిడ్, లాక్ డౌన్ల దెబ్బకు ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండడం వల్ల అందరూ ఓటీటీల వైపు మళ్లారు. కొత్త సినిమాలు కూడా ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే 2020లో ఓటీటీలకు టైమ్ బాగుంది. ఈ స్పీడ్ లో నెట్ ఫ్లిక్స్ ముందుంది. 2020 అక్టోబర్-డిసెంబర్ మధ్య ప్రపంచ వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్ల సంఖ్య 20 కోట్లు దాటింది. ఒక్క 2020లో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్లైబర్ల సంఖ్య 37 మిలియన్లు అంటే 3 కోట్ల 70 లక్షలు. ఇదొక రికార్డ్ అని నెట్ ఫ్లిక్స్ చెప్తోంది. ఆదాయం విషయంలోనూ నెట్ ఫ్లిక్స్ భారీ లాభాలు సంపాదించింది. గత ఏడాది స్పీడ్ తో నెట్ ఫ్లిక్స్ రెవెన్యూ 6.64 బిలియన్ డాలర్లు అంటే 664 వందల కోట్ల డాలర్లకి చేరింది. ఈ లెక్కలతో ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ప్రపంచంలోనే లార్జెస్ట్ స్ట్రీమింగ్ సర్వీస్. 2017 చివరి నాటికి నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్ల సంఖ్య 10 కోట్లు. 2018, 2019 నాటికి నెట్ ఫ్లిక్స్ కి అర్బన్లో మాత్రమే క్రేజ్ ఉండేది. కానీ 2020లో ప్రపంచమంతా నెట్ ఫ్లిక్స్ క్రేజ్ పెరిగింది. అంతకు ముందు నెలకు 500 నుంచి 700 వరకు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్ వర్షన్ కి 199 ఛార్జ్ తోనే నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఇస్తోంది. ఇది యూత్ ని బాగా అట్రాక్ట్ చేసింది.

About Author

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *