September 21, 2023

ఆగస్ట్‌ 27లోగా రాకపోతే… విజయ్‌ మాల్యా ఆర్థిక నేరస్తుడే

ఆగస్ట్‌ 27లోగా రాకపోతే… విజయ్‌ మాల్యా ఆర్థిక నేరస్తుడే

ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్‌ మాల్యా వేరే దేశం చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. ఇది నిజం. ఈ మధ్యే ఈడీ అధికారులు ఫ్యూజిటివ్‌ ఎకనమిక్‌ అఫెండర్స్‌ (పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులు)ను ప్రయోగించారు. ఆ తర్వాతే మాల్యాలో చలనం వచ్చిందన్నది వాస్తవం. తాను చాలా నిజాయతీపరుడునని సుదీర్ఘ ప్రకటన చేసిన మాల్యాకి ఇన్నాళ్లు స్వదేశం గుర్తుకే రాలేదు. భారత దేశాన్ని ఆయన మర్చిపోయి పరాయి దేశంలో విలాసాల్లో ఉన్నారు. ఇప్పుడిక రానంటే కుదరదుఆగస్ట్‌ 27లోగా న్యాయస్థానంలో మాల్యా హాజరుకావాలి. ఒకవేళ రాకపోతే అతడిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటిస్తామని, మాల్యాకు చెందిన 12,500 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేస్తుందని న్యాయస్థానం స్పష్టంగా వివరించింది. ఈ మధ్యే వచ్చిన ఫ్యూజిటివ్‌ ఎకనమిక్‌ అఫెండర్స్‌ ఆర్డినెన్స్‌ ప్రకారం ఆర్థిక నేరాలు చేసి పారిపోయిన వ్యక్తుల ఆస్తులను జప్తుచేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *