June 7, 2023

విస్తరణ కాంక్ష… చైనా అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఇదే ధోరణి. సిగ్గు మాలిన పనులు చేయడానికి ఏ మాత్రం సిగ్గు పడని దేశం. చైనాకు ప్రపంచాధిపత్యం మీద తగని మోజు. తాజాగా మరోసారి సిక్కిం సరిహద్దు చైనా తన తోడేలు బుద్ధి మరో సారి చూపించింది. మన భూభాగంలోకి చొరబడాలని చూస్తే మన వీర జవాన్లు తగిన బుద్ధి చెప్పారు. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు చర్చలతో లొంగేవి కావు. వారి నోరు ఒకటి చెప్తుంది, చేత మరొకటి ఉంటుంది. గత ప్రభుత్వాలు బోర్డర్ సెక్యూరిటీపై సరైన శ్రద్ధ పెట్టలేదన్నది వాస్తవం. వాటి ఫలితాలే ఇప్పుడు ఈ చొరబాట్లు. 1950లో మన గణతంత్రం మొదలైన నాటి నుంచి మన దేశం విదేశీ సంబంధాలను శాంతిపూర్వకంగా నిర్వహిస్తూ వచ్చింది. కానీ చైనాలో ఆ పద్ధతి ఏనాడూ లేదు. ఆధిపత్యం, ఆక్రమణ ఇవే ఆ దేశం సిద్ధాంతాలు. చైనా దేశంలోనే చాలా వర్గాలకు ఇప్పుడున్న ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. నెహ్రూ కాలం నుంచి చైనాది ఆక్రమణ ధోరణే. చైనా ఎప్పటికీ నమ్మదగిన పొరుగు దేశం కాదని ఈ సంఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య గాల్వాన్ లోయ దగ్గ ఘర్షణ, ఆరుణాచల్ ప్రదేశ్ వివాదాలు, ఇప్పుడు సిక్కిం హద్దుల్లో చొరబాట్లు..ఇవన్నీ చైనా తోడేలు బుద్ధికి నిదర్శనాలు. మనం రూల్స్ ప్రకారమే వెళ్తాం, ఎదుటి వాడు రూల్స్ పాటించకపోతే ప్రమాదం మనకే. ఇక్కడ చైనా ఎప్పుడూ రూల్స్ పాటించని బ్యాడ్ బోయ్. మన దేశానికి 1947లో స్వతంత్రం వచ్చింది. చైనాకు 1949 అక్టోబర్ 1న స్వతంత్రం వచ్చింది. భారత్-చైనా ఆధునిక సంబంధాలు అప్పుడే మొదలయ్యాయి. 1950లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను భారత్ గుర్తించి అడగకపోయినా ఎన్నో సాయాలు చేసింది. అదే పెద్ద తప్పైంది. భారత్, చైనాలు పురాతన చారిత్రక సంస్కృతిని కలిగి ఉన్న దేశాలు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. సిల్క్ రూట్ అందుకు సాక్ష్యం. అంతవరకు బాగుంది. ఎప్పుడైతై చైనా కమ్యూనిస్టు ఇనుప గోడలు నిర్మించుకుందో అప్పటి నుంచే సమస్యలు ప్రారంభమయ్యాయి. నిజానికి కమ్యూనిజం అందరికి సమాన హక్కులు కావాలని కోరుకుంటుంది. అదేంటో చైనా మాత్రం విస్తరణ కాంక్షతో రగిలిపోతూ ఉంటుంది. విస్తరణే చైనా విదేశాంగ విధానంగా మారిపోయింది. ఇది భారత్ లాంటి దేశాలకు చాలా ప్రమాదం. ఆ ప్రమాదం ఇప్పుడు కళ్లముందు కనిపిస్తోంది కూడా. ఇప్పుడు కాదు నెహ్రూ కాలంలోనే ఈ ప్రమాదం మొదలైంది. టిబెట్ మన ఉత్తర సరిహద్దు. స్వేచ్ఛను కోరుకునే దేశం. భారత్-టిబెట్ మధ్య ఏనాడు శతృత్వం లేదు. 1950లో రిపబ్లిక్ చైనాను భారత్ గుర్తించిన సంవత్సరం. అదే ఏడాది భారత్ మిత్ర దేశం, ఆయుధాలే లేని శాంతి దేశం టిబెట్ ను చైనా ఆక్రమించింది. దేశాల మధ్య గొడవలు జరుగుతుంటే ఆనందించే బ్రిటిష్ సామ్రాజ్యం ఇంగ్లండ్ ఆ రోజు చైనాకు సపోర్ట్ చేసింది. భారత ప్రతిష్టను గంగంపాలు చేసిన ఈ ఘటనపై నెహ్రూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దలైలామాకు మన దేశం ఆశ్రయం ఇవ్వడం కూడా చైనాకు నచ్చలేదు. అప్పటి నుంచి కవ్విస్తూనే ఉంది. 1949 కాలం వేరు ఇప్పుడు వేరు. అయినా గానీ చైనావ రాతియుగం నాటి ఆలోచనా ధోరణితోనే ప్రవర్తిస్తోంది. అంతెందుకు చైనాలో పౌరులు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు. ఒకవేళ మాట్లాడితే ఎలాంటి గతి పడుతుందో ఆలీబాబా జాక్-మా విషయంలో ప్రపంచమంతా చూసింది. ఒకప్పుడు సోవియట్ యూనియన్- భారత్ సంబంధాలు బలంగా ఉండడం చైనాకు నచ్చలేదు, ఆ తర్వాత భారత్-అమెరికా సంబంధాలూ చైనాకు నచ్చలేదు. ఏదో ఒక కొర్రీ పెడుతూనే వచ్చింది. ఇప్పుడు కరోనా విషయంలో చైనా.. ప్రపంచం దృష్టిలో బ్యాడ్ అయింది. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ డ్రామాలన్నీ. ఒకే మనస్తత్వం ఉన్నవారే కాబట్టి చైనా, పాకిస్థాన్ కి స్నేహం కుదిరింది. అది కూడా భారత్ కి ఇబ్బంది కలిగించేందుకే. 1962 నాటి చైనా యుద్ధం, 1967 నాటి చో లా ఘటన, 1987నాటి సరిహద్దు ఘర్షణలు, ఇప్పటి పరిణామాలు.. ఇవన్నీ చూస్తుంటే చైనా అనే దేశాన్ని ఎందుకు క్షమించాలి. భారత్-చైనాల మధ్య 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇదంతా వివాదాస్పదమే. కాదు… చైనా పనిగట్టుకుని సృష్టించిన వివాదం. డోక్లాం, అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్ తాజాగా సిక్కిం బోర్డర్ ఇలా ఒకటి కాదు… సరిహద్దులో ప్రతీ చోటా చైనా గుంటనక్కలు కాసుకు కూర్చుంటారు. ఎక్కడ గొడవ పెడదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇదే వారి పని, ఆ దేశ సిద్ధాంతం. చైనా పుట్టక ముందు నుంచి ఈశాన్యంలో అరుణాచల్ భారత్ భూభాగం. కానీ అది తమదే అంటుంది సిగ్గు లేని చైనా. దాదాపు 90 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం మీద కన్నేసింది. అక్సాయ్ చిన్ వద్ద 38 వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా ఆక్రమించిందని భారత్ ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇందుంలో లద్దాఖ్ లో కొంత భూభాగం కూడా ఉంది. మోదీ ప్రధానిగా వచ్చాకే చైనాకు ఎదురుదెబ్బలు గట్టిగా తగులుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్, నేపాల్ తో కలిసి భారత్ ను ఇబ్బంది పెట్టే పని తప్ప… చైనాకు వేరే పనే లేదు. భారత్ చుట్టు పక్కల ఉన్ దేశాలకు గాలం వేయడం, వాటిని భారత్ మీద ఉసిగొల్పడం.. ఇదీ భారత్ మీద చైనా విదేశాంగ విధానం.

About Author

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *