డైరెక్టర్ శంకర్… ఆయన సినిమా తీస్తున్నారంటే సంచలనం. ఇండియన్ సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్ ముందుంటారు. ఆయన త్వరలో తీయబోయే సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజంగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే రికార్డులు బద్దలవడం ఖాయం. కాంబో అలాంటిది మరి. రామ్ చరణ్ ప్లస్ పవన్ కళ్యాణ్ ప్లస్ శంకర్. అసలీ కాంబినేషనే సన్సేషన్. ఇప్పటికే స్క్రిప్ట్ వినిపించారని ఓ టాక్ ఉంది. అయితే ఇప్పటి వరకు అపీషియర్ న్యూస్ ఏమీ లేదు. ఇండియన్ సనిమాకి హాలివుడ్ స్థాయి గ్రాఫిక్స్ ని పరిచయం చేసి… రోబో లాంటి వండర్ చేశారు. అలాగే ఒక సోషల్ ఇష్యూని తీసుకుని కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఎలా తియ్యాలో శంకర్ కి బాగా తెలుసు. ఆయనకు బాగా పట్టున్న ఈ కాన్సెప్ట్ లోనే మళ్లీ చెర్రీ-పవన్ తో సినిమా తీస్తారనే ప్రచారం జరుగుతోంది. పవన్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు, RRR పూర్తయితే తప్ప చెర్రీ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదు. మరి ఈ సన్సేషనల్ కాంబో మూవీ ఎప్పుడో ఏమిటో… చూడాలి.
Recent Posts
- ‘నాన్పకల్ నెరత్తు మయ్యక్కమ్’. మమ్మూట్టీ ఒన్ మ్యాన్ షో
- BBC: చెప్పేవి శ్రీ రంగ నీతులు… మరి చేసేవి? అసలు BBC ఎలా పుట్టిందంటే?
- ‘ఫ్రీ’ హిట్లో ముఖేష్ అంబాని భారీ ‘సిక్స్’ ! ఈ బిజినెస్ గేమ్ ముందు IPL ఎంత?
-
‘We stand up for BBC’
మన సార్వభౌమత్వాన్నే అవమానిస్తున్న బ్రిటన్ - ఇంతకీ MH 370 విమానం ఏమైంది? నెట్ఫ్లిక్స్ సిరీస్లో ఏముంది?