June 7, 2023

జర్నలిస్టులూ ఇక జాగ్రత్త! ఆ జీవో వచ్చింది

జర్నలిస్టులూ ఇక జాగ్రత్త! ఆ జీవో వచ్చింది

ఏపీలో ఇకపై తప్పుడు వార్తలు, ఫేక్‌ న్యూస్‌, సృష్టించిన వార్తలు… ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తే.. ఆ జర్నలిస్టుకే కాదు.. డెస్క్‌లో డెస్క్‌ ఇంఛార్జ్‌ నుంచి ఎడిటర్‌ వరకు ఎవరికైనా వేడి తగలొచ్చు. తెలంగాణలో మీడియా ఎప్పుడో కంట్రోల్‌లోకి వచ్చేసింది కాబట్టి.. గొడవ లేదు. ఏపీలో మాత్రం ఈ విషయంలో సీఎం జగన్‌ మరో అడుగు ముందుకు వేసేశారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలపై 2007లో అప్పటి సీఎం వైఎస్ఆర్‌ దాదాపు ఇలాంటిదే ఓ జీవో తెచ్చారు. ఆప్పట్లో అది వివాదాస్పదమైంది కూడా. ఆ తర్వాత ఆయన కూడా ఆ జీవోని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆయన వారసుడు జగన్‌ మాత్రం.. ఆ జీవోకి పదును పెట్టారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తే… రిపోర్టర్‌ స్థాయి నుంచి ఎడిటర్‌ స్థాయి వరకు ఎవరినైనా టార్గెట్‌ చేసే వీలుండేలా ఆ జీవో కనిపిస్తోంది. సమయానికి తగు మాటలాడు ఈనాడు ఎప్పుడో సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు జగన్‌ అంటేనే విరుచుకుపడిన ఈనాడులో… ఈ మధ్య జగన్ వ్యతిరేక వార్తల సంగతే లేదు. ఎందుకొచ్చిన రిస్క్‌ అని చుప్‌చాప్‌ అయిపోయింది. మరి ఆంధ్రజ్యోతి సంగతి.. ? ఈ మధ్య ఏ న్యూస్‌ ఛానెల్‌లోనూ సీఎం జగన్‌కి వ్యతిరేకంగా ఎక్కడా ఎక్కువగా వార్తలు కనిపించడం లేదు. ఇప్పటికే సర్వైవల్‌ ప్రాబ్లెంలో ఉన్న చాలా ఛానెళ్లకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లే ధైర్యమూ లేదు. అంతకు ముందు చంద్రన్న భజన చేసిన ఛానళ్లు టీడీపీ ఓటమి తర్వాత… దిక్కుతోచని పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఇంకా ఎలాంటి స్టాండు తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయని.. వాళ్లిచ్చే వార్తలు చూస్తుంటేనే అర్థమవుతోంది.

ఇవన్నీ ఓకే.. ఇంతకి తప్పుడు వార్త లేదా ప్రభుత్వ వ్యతిరేక వార్త అంటే డెఫ్‌నిషన్ ఏంటి? ఇది చాలా మందికి వస్తున్న అనుమానం..? ఎలాంటి వార్తలు వెయ్యొచ్చు? ఎలాంటి వార్తలు వెయ్యకూడదు? ఇది కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. దీనిపై కూడా ఓ క్లారిటీ కావాలి. ఫాల్స్‌, బేస్‌లెస్‌, డిఫమేటరీ న్యూస్‌పై యాక్షన్‌ ఉంటుందని జీవో చెప్తుంది. అలాంటప్పుడు పరిశోధనాత్మక కథనాలు వదులుకోవాల్సిందే.

పరిశోధనాత్మక కథనాలు మాక్సిమమ్‌ సోర్స్‌ బేస్డ్‌ ఉంటాయి. ఆ సోర్స్‌ బయటకు రాడు. అంటే ఆ కథనం బేస్‌లెస్‌ అవుతుందా?

ఇక రోజూ ఛానెళ్లో డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. అన్ని పార్టీల వారిని పిలుస్తున్నారు. అందులో అపోనెంట్‌ పార్టీల వారు సహజంగానే విమర్శిస్తారు, ఆరోపిస్తారు.. ఇది ఏ కోవలోకి చెందుతుంది ?

ఇలాంటి చాలా అనుమానాలు ఇప్పుడు ఒక్కోటి వస్తాయి. జర్నలిజంలో ఎలాంటి స్టోరీలు వెయ్యాలి అన్న డిస్కషన్‌ ఇప్పుడు చాలా అవసరం. ఇది ఎప్పటి నుంచో ఉన్న డిస్కషనేకానీ.. ఇప్పుడు అనివార్యం.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *