September 21, 2023

వాట్సాప్‌ పేమెంట్‌ సర్వీస్‌… సురక్షితమేనా ?

వాట్సాప్‌ పేమెంట్‌ సర్వీస్‌… సురక్షితమేనా ?

ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్‌ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం వరకైనా వెళ్లాల్సి వచ్చేది. ఆన్‌లైన్‌ సేవలతో విప్లవాత్మక మార్పులొచ్చాయి. జస్ట్‌ సింగిల్‌ క్లిక్‌తో కావల్సిన వారికి ఏంత డబ్బైనా పంపొచ్చు. ఈ ఆన్‌లైన్‌ లావాదేవీల ప్రపంచంలోకి ప్రైవేట్‌ సంస్థలు వచ్చాకఆర్థిక వ్యవహారాలు చిటికేసినంత ఈజీ అయిపోయాయి. ఇప్పుడు ఒక్క మొబైల్‌ ఉంటే చాలు బ్యాంకులన్నీ గుప్పెట్లో ఉన్నట్టే. RBI ప్రవేశ పెట్టిన UPI (యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్ఫేస్‌) మాధ్యమంగానే అన్ని డిజిటల్‌ పేమెంట్స్‌ ఆపరేట్‌ అవుతాయి. అన్ని రకాల బ్యాంక్‌ అకౌంట్లకు సింగిల్‌ మొబైల్‌ అప్లికేషన్‌ మీదకు తీసుకొచ్చింది UPI. డిజిటల్‌ వాలెట్స్‌ వచ్చాక చాలా పనులకు అసలు క్యాష్‌తో అవసరమే లేకుండా పోయింది. పేటీఎం, ఫ్లిప్‌కార్ట్‌, గూగుల్‌ సంస్థలు ఇప్పటికే కోట్ల మందికి పేమెంట్‌ సర్వీస్‌ అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి వాట్సాప్‌ కూడా అడుగుపెట్టింది. ఇప్పటి వరకు pay TM ఈ సర్వీసెస్‌లో ముందుంది. pay TM ద్వారా ప్రతి నెల 6 కోట్లకు పైగా UPI లావాదేవీలు జరుగుతున్నాయి. ఫ్లిప్‌కార్డ్‌ ఫోన్‌ పే నుంచి 4 కోట్ల మంది, గూగుల్‌ పేమెంట్‌ సర్వీస్‌ యాప్‌ తేజ్‌ని సుమారు 1.5 కోట్ల మంది వినియోగిస్తున్నారు. వాట్సాప్‌లో మెసేజ్‌ పంపినంత సులువుగా డబ్బు ట్రాన్ఫర్‌ చేయొచ్చని ఆ సంస్థ చెప్తోంది. అయితే ప్రస్తుతం మనీ ట్రాన్ఫర్‌ వరకే అప్షన్‌ ఇచ్చింది. వాట్సాప్‌కి ఒక్క భారత్‌లోనే 20 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. మరి.. పే సర్వీస్‌లోకి వస్తే.. pay Tmకి గట్టి పోటీదారే. గత ఫిబ్రవరిలో whats app pay పైలట్‌ని నిర్వహించారు. అయితే.. డిజిటల్‌ పే సర్వీసుల నిర్వహణపై భయాందోళనలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. వాట్సాప్‌ యజమాని ఫేస్‌బుక్‌. ఈ మధ్యే డాటా దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంది ఫేస్‌బుక్‌. డబ్బుతో వ్యవహారం కాబట్టిపే సర్వీస్‌ విషయంలో అనుమానాలు రావడం సహజం. డెబిట్‌ లేదా క్రెడిట్‌ వివరాలు దుర్వినియోగం అయితే అంతే సంగతులు. పిన్, సీవీవీ, వివరాల భద్రతే కీలకం. ఎలాంటి పే సర్వీస్‌ అయినా తగిన జాగ్రత్తలు తీసుకుని, పూర్తి అవగాహనతో లావాదేవీలు జరపడమే మంచింది. అయితేవాట్సాప్‌ తమ ప్రైవసీ పాలసీలో మార్పు చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. వినియోగదారుల లావాదేవీల గోప్యతను మరింత కఠినం చేస్తామంటోంది. ఇప్పటికే వాట్సాప్‌తో UPI, బ్యాంకుల అనుసంధానానికి అనుమతులు పూర్తయ్యాయి. మరిసోషల్‌ మీడియాలోకి సునామీలా వచ్చి వాట్సాప్‌.. డిజిటల్‌ పే సర్వీస్‌ విషయంలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తుందో లేదో చూడాలి.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *