లాక్ డౌన్ సమయంలో భారత బిలియనీర్ల ఆస్తి 35 శాతం పెరిగింది. అదే టైమ్ లో 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 100 మంది భారత బిలియనీర్ల సంపద ఎంత పెరిగిందంటే సుమారు 14 కోట్ల మంది పేదలకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు ఇవ్వొచ్చట. 2020 మార్చ్ నుంచి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో భారత్ లో ఉన్న టాప్ 100 బిలియనీర్ల ఆస్తి 12,97,822 కోట్లు పెరిగింది.
కరోనా నామ సంవత్సరంలో ఆ బిలియనీర్లు సంపాదించిన సంపాదన ఆ రేంజ్ లో ఉంది. ఆక్స్ ఫామ్ సంస్థ ఈ సర్వే చేసింది. ఫేమస్ ఇంగ్లండ్ యూనివర్సిటీ ఆక్స్ ఫర్డ్ స్థాపించిన సంస్థ ఆక్స్ ఫామ్. ఈ సంస్థ హెడ్ క్వార్టర్ కెన్యాలో ఉంది. 1942లో ఈ ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఈ సంస్థ కోసం 20 స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రపంచంలో పేదరికం నివారణ ఈ అంశాలపై దాదాపు 50 ఏళ్లుగా ఆక్స్ ఫామ్ వివిధ సర్వేలు చేస్తూ లెక్కలు చెప్తుంటుంది. అలా ఆక్స్ ఫామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే జెన్యూన్. ఇప్పుడు అసలు స్టోరీలోకి వద్దాం. కరోనా సమయంలో చేసిన ఈ సర్వేపై ఆక్స్ ఫామ్ ఘాటైన వ్యాఖ్యలే చేసింది. ఇది కరోనా వైరస్ కాదని “ది ఇనీక్వాలిటీ వైరస్” అని ఘాటుగా స్పందించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సభలో ఆక్స్ ఫామ్ ఈ నివేదకను రిలీజ్ చేసింది. కరోనా సమయంలో ఈ ప్రపంచం వందేళ్లలో ఎప్పుడూ చూడని ఆరోగ్య సంక్షోభానన్నిఎదుర్కొందని, 1930ల నాటి ఆర్థిక సంక్షోభంతో ఈ కాలాన్ని పోల్చవచ్చని ఆక్స్ ఫామ్ రిపోర్ట్ చెప్తోంది.