June 7, 2023

నాలుగు కథలు, నలుగురు దర్శకులు. ఇప్పుడు వెబ్ సిరీస్ లో ఈ ట్రెండ్ నడుస్తోంది. ఇలాంటి కథల అల్లికను అంథాలజీ స్టోరీస్ అంటున్నారు. ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన పావల్ కథై మంచి హిట్ అయింది. పరువు హత్యలు, ప్రేమ వైఫల్యాలు లాంటి కథలతో ఆ సిరీస్ కంట తడిపెట్టించింది. అలాంటి వెట్రి మారన్, గౌతమ్ మీనన్ లాంటి దర్శకులు ఆ కథలను హ్యాండిల్ చేసి సినిమాని మించిన క్వాలిటీ తీసుకొచ్చారు. ఇప్పుడు అదే బాటలో మన తెలుగు దర్శకులు కూడా పిట్ట కథలు అనే సిరీస్ ని రూపొందించారు. ఇది కంప్లీట్ వుమెన్ ఓరియంటెడ్ సీరీస్. నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 19న రిలీజ్ అవుతోంది. పిట్ట కథల ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. నలుగురు వేర్వేరు మహిళల జీవిత కథలను, భావోద్వేగాలు, వారి అభిప్రాయాలను బోల్డ్ గా చూపించే ప్రయత్నంగా కనిపిస్తోంది. నాలుగు కథలకు నాగ్ అశ్విన్, నందినీ రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ లు డైరెక్షన్ చేశారు. శ్రుతిహాసన్, మంచు లక్ష్మి, అమలా పాల్, ఈషా రెబ్బాలు నాలుగు కథల్లో నటించారు. నలుగురూ మంచి నటీమణులు. వీరితో పాటు జగపతి బాబు, సత్య దేవ్ లాంటి యాక్టర్స్ కూడా ఉన్నారు. కేరళలో ఈ తరహా కథలు మనకు కనిపించేవి. మన దగ్గర మాస్ మసాలాతో పాటు ఇలాంటి కథలను ప్రెజెంట్ చేయడం మంచి విషయమే. ప్రస్తుత తరం దర్శకులు కూడా గ్లోబల్ ఆలోచనలతో కథలు అల్లుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.

About Author

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *