May 30, 2023

జేమ్స్ బాండ్ సినిమాలకు ఉండే క్రేజ్ తెలిసిందే. 25వ బాండ్ సినిమా నో టైమ్ టూ డైకి మొదటి నుంచి కష్టాలే. 2020 ఏప్రిల్ లోనే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా దెబ్బకి ఆగిపోయింది. ఆ తర్వాత నవంబర్ అనుకున్నారు. అప్పటికీ థియేటర్లు ఓపెన్ కాలేదు. ఈ ఏప్రిల్ 2న బాండ్ సందడి చేస్తాడని యూనిట్ ఆ మధ్య ప్రకటన చేసింది. కానీ మళ్లీ ఏమనుకున్నారో ఏకంగా విడుదలను ఏకంగా అక్టోబరు 8కి వాయిదా వేశారు. ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలున్నాయి. బాండ్ సిరీస్ వరల్డ్ సినిమా హిస్టరీలోనే లాంగెస్ట్ ఫ్రాంచైజీ. ఏకంగా 25 సినిమాలు బాండ్ సిరీస్ లో వచ్చాయి. షాన్ కానరీ, రోజర్ మూర్ తర్వాత అత్యథిక బాండ్ సినిమాలు చేసిన రికార్డ్ డానియల్ క్రెగ్ పేరు మీదే ఉంది. ఫస్ట్ బాండ్ షాన్ కానరీ 6, రోజర్ మూర్ 7 సినిమాలు చేస్తే వీరి తర్వాత 5 బాండ్ మూవీలు చేశారు డానియల్ క్రెగ్ చేశారు. అంతేకాదు బాండ్ గా డానియల్ క్రెగ్ కి ఇది లాస్ట్ మూవీ. అందుకే 25వ బాండ్ మూవీకోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

About Author

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *