June 7, 2023

2016లో కొరియాలో వచ్చిన సూపర్ హిట్ మూవీ లక్-కీ. లీ గాబ్యోక్‌ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్‌ కామెడీ అప్పట్లో సన్సేషన్. ఈ సినిమా కూడా స్ట్రైట్‌ మూవీ కాదు. 2012లో వచ్చిన జపాన్ సూపర్‌ హిట్‌ మూవీ ‘కీ ఆఫ్‌ లైఫ్‌’ కి రీమేక్‌. ఇప్పుడు ఈ సినిమా హక్కులను మన సురేష్‌ ప్రొడక్షన్‌ తీసుకుంది. అంటే రీమేక్‌ రీమేక్‌కి ఇప్పుడు మరో రీమేక్ అన్నమాట. కరడుగట్టిన ఒక ప్రొఫెషనల్‌ కిల్లర్‌ గతాన్ని మరిచిపోతాడు. తను గతంలో ఒక యాక్టర్ అనుకుంటాడు. అక్కడి నుంచి కథ ఎలాంటి టర్న్‌ తీసుకుందన్నదే స్టోరీ. జపాన్‌ మూవీలో అక్కడి స్టార్‌ హీరో మసాటో, ఇక్కడ కొరియాలో యూ-హోజన్లు యాక్షన్‌ అదరగొట్టారు. అన్ని మాస్‌ అంశాలు పుష్కలంగా ఉన్న ఇలాంటి స్టోరీని పాన్‌ ఇండియా రేంజ్‌లో డీల్‌ చేయాలంటే అలాంటి యాక్టర్స్‌ కావాలి. పవన్‌ కళ్యాణ్‌, రవితేజ లాంటి స్టార్స్‌ అయితే ఈ స్టోరీని బాగా డీల్‌ చేయగలరు. మరి సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.

About Author

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *