June 7, 2023

వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే సమస్యలు తప్పవా? వాట్సాప్‌ వదులుకోవాల్సిందేనా? ఎన్నో అనుమానాలున్న ఈ ప్రైవసీ పాలసీపై వాట్సాప్‌ వెనక్కు వెళ్లడం లేదు. కొన్ని న్యూస్‌ ఆర్టికల్స్‌లో వచ్చిన సమాచారం ప్రకారం నోటిఫికేషన్‌ వచ్చిన కొన్ని వారాల్లో ప్రైవసీ పాలసిని అంగీకరించకపోతే మెసేజ్ రీడింగ్‌, మెసేజ్‌ సెండింగ్‌ చేయడం కుదరకపోవచ్చని తెలుస్తోంది. అలాగే 120 రోజుల తర్వాత అకౌంట్‌ కూడా డీయాక్టివ్‌ అవుతుందన్న వార్తలూ వినిపిస్తున్నాయి. కొత్త ప్రైవసీ పాలసీ వల్ల వినియోగదారులకు నష్టం ఉండదని, ప్రతీ పర్సనల్‌ మెసేజ్‌ ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ అని వాట్సాప్‌ చెప్తోంది. వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ మీద ప్రజలకు అనుమానాలున్నాయని, వాటిని క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ‘మీ కంపెనీ 3 ట్రిలియన్‌ డాలర్ల విలువ చేసినా… ప్రజలకు వాళ్ల ప్రైవసీ అంతకన్నా ఎక్కువ విలువైనది. ప్రజల ప్రైవసీని ఖచ్చితంగా కాపాడాల్సిందే ‘ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ కంపెనీలకు నోటీసులు కూడా జారీ చేసింది. దాదాపు ప్రతీ ఫోన్‌లోనూ వాట్సాప్‌ కనిపిస్తుంది. పెద్ద పెద్ద కార్పోరేట్‌ కంపెనీలు తమ ప్రొఫెషనల్‌ సమాచారాన్ని వాట్సాప్‌ గ్రూప్స్‌లో నే షేర్‌ చేసుకుంటున్నాయి. ఇదో పెద్ద అలవాటుగా మారిపోయింది. ఇలాంటి సమయం ప్రైవసీ పాలసీపై అందరికీ అనుమానాలున్నాయి. మరి వాట్సాప్‌ ఏం చేస్తుందో చూడాలి.

About Author

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *