స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్ ఖాతాల్లో ఉన్నదంతా నల్లధనం అనే చెప్పలేం కానీ.. అధిక మొత్తం బ్లాక్ మనీ అన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఆశ్చర్యం ఏంటంటే… డీమానిటైజేషన్ తర్వాత స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల సంపద పెరగడం. విదేశాల్లో నల్లధనాన్ని తిరిగి తెచ్చి ఆ ఫలాన్ని భారతీయులకు అందిస్తామని బిజేపీ వాగ్దానం చేసింది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకురాలేకపోయిందన్న విమర్శలనూ ఎదుర్కొంటోంది. అసలు స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకురావడం సాధ్యమేనా కాదా అన్న ప్రశ్నకు నైజీరియా ప్రభుత్వం సమాధానమిస్తోంది. అవును.. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో తమ మాజీ సైన్యాధ్యక్షుడు దాచిన నల్లధనాన్ని నైజీరియా ప్రభుత్వం తెచ్చి దేశంలో ఉన్న పేదలకు పంచబోతోంది. వివరాల్లోకి వెళ్తే… నైజీరియా మాజీ సైన్యాధ్యక్షుడు సానీ అబాచా. 1993 నుంచి 1998 మధ్య కాలంలో సైన్యాధిపతి పదవిలో ఉన్న ఉన్న అబాచా ప్రజాధనాన్ని కొల్లగొట్టి సుమారు రూ. 2000 కోట్ల (మన కరెన్సీలో) ధనాన్ని స్విస్ బ్యాంకుల్లో దాచాడు. ఆ డబ్బుని వెనక్కు రప్పిస్తామని 2015 ఎన్నికల సమయంలో ప్రస్తు నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారీ హామీ ఇచ్చారు. ఇప్పుడా ధనాన్ని స్విట్జర్లాండ్ అధికారులు నైజీరియా ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నారు. ఆ డబ్బును ప్రపంచ బ్యాంకు పర్వవేక్షణలో… పక్కా ఆడిటింగ్ మధ్య… ఈ జూలై నుంచి పేదలకు పంచేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నైజీరియా రాష్ట్రాలు 19. ఎంపిక చేసిన 3 లక్షల పేద కుటుంబాలకు నెలకు 14 డాలర్లు అంటే 950 రూపాయల చొప్పున ఆరేళ్ల పాటు నగదు బదిలీ చేస్తారు. అంటే ఒక్కో కుటుంబానికి ఆరేళ్లలో కలిగే లబ్ది 72 వేల రూపాయలు. రాజకీయ ప్రయోజనం కోసం ప్రస్తుత ప్రభుత్వం ఇదంతా చేస్తోందని అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా… స్విస్ బ్యాంకుల నుంచి డబ్బు వెనక్కు తెచ్చే అంశం ఆసక్తికరంగా మారింది. 19 కోట్ల మంది జనాభా ఉన్న నైజీరియా ఆర్థిక వృద్ధి రేటు విషయంలో ఏటేటా దూసుకెళ్తున్నా… రాజకీయ అనిశ్చితి, జాతి సంఘర్షణ, ఆర్థిక అసమానతల వల్ల 33 శాతం పేదరికంతో కొట్టుమిట్టాడుతోంది. అలాంటి దేశమే స్విస్ బ్యాంకు నుంచి తమ దేశం నల్లధనాన్ని వెనక్కు తెచ్చుకోగలిగింది. 2 వేల కోట్ల రూపాయలు వెనక్కొస్తే 3 లక్షల కుటుంబాలకు ఆర్థిక బాసట దొరికింది. మన భారతీయుల నల్లధనం కొన్ని లక్షల కోట్లు స్విస్ బ్యాంకుల్లో మూలుగుతోంది. ఆ డబ్బు వెనక్కొస్తే… దేశంలో పేదరికాన్ని తరిమేయొచ్చని నైజీరియా లెక్కలే చెప్తున్నాయి. సమర్థ ప్రణాళికతో ముందుకెళ్తే.. నల్ల డబ్బు వెనక్కొస్తుందన్న విషయం నైజీరియాలో జరుగుతున్న పరిణామాలు ఋజువు చేస్తున్నాయి. అంతే కాదు… స్విస్ బ్యాంకుల్లో కుప్పగా పడున్న నల్లధనాన్ని తెచ్చుకోవడం సాధ్యమేనని కూడా నైజీరియా నిరూపించింది. మరి మన ప్రభుత్వం విల్‌పవర్ చూపించేదెప్పుడు ?
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018
రూ.499కే 4G రూటర్… జియో బంపర్ ఆఫర్
టెలికాం రంగంలో మరో సంచలనం. జియో నుంచి మరో బంపర్ ఆఫర్. కేవలం 499
July 3, 2018