June 3, 2023

క్రియేటివ్ ఫ్రీడమ్.. ఈ ఒక్క మాటను వాడుకుని ఓటీటీల్లో వస్తున్న వెబ్ సిరీస్ లు ఇప్పుడు కాంట్రవర్సీలు సృష్టిస్తున్నాయి. ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీసుల్లో అతి ఎక్కువే ఉంటోంది. అక్కడక్కడా ఒకటి రెండు మినహా బిగ్ స్క్రీన్ మీద వచ్చే సినిమాలు భాష, మిగిలిన విషయాల్లో ఇప్పటికీ హద్దుల్లోనే ఉంటున్నాయి. కారణం సెన్సార్. కానీ ఓటీటీ జోరు మొదలయ్యాక… మొబైల్ యూజర్లను, ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకునేందుకు తీస్తున్న వెబ్ సిరీసులు మాత్రం హద్దు దాటుతున్నాయి. వాటికి సెన్సార్ లేకపోవడం ప్రధాన కారణం. ప్రైమ్ వీడియోలో రీసెంట్ గా రిలీజైన తాండవ్ తో మళ్లీ కాంట్రవర్సీలు మొదలయ్యాయి. తాండవ్ లో కొన్ని సీన్లు హిందూ దేవతలను అవమానించేలా ఉన్నాయని, మరి కొన్ని సీన్లు కొన్ని కులాలు, మతాలను కించపరిచే విధంగా ఉన్నాయని కేసులు నమోదయ్యాయి. నిజానికి తాండవ్ లో అతి ఎక్కువే ఉంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఆ డైలాగులు ఎవరికి నేరుగా తగులుతాయో ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఈ వెబ్ సిరీస్ పై నెగెటివ్ టాక్ వచ్చింది. ఆ దెబ్బకి తాండవ్ టీమ్ అనకండీషనల్ అపాలజీ చెప్పినా ఇంకా వేడి తగ్గలేదు. తాండవ్ సిరీస్ ని మొత్తానికే బ్యాన్ చేయాలని ఇప్పుడు డిమాండ్.

తాండవ్ కి ముందు ఇలాంటి కాంట్రవర్సీలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ ల్లో హిందు దేవుళ్లు, హిందూ సెంటిమెంట్లపై వ్యంగ్యాస్త్రాలు ఉంటున్నాయి. ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ లో ఏ సూటబుల్ బాయ్ అని ఒక సిరీస్ వచ్చింది. విక్రమ్ సేథ్ రాసిన ఆ నవలా సిరీస్ లో హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి మధ్య.. గుళ్లో రొమాంటిక్ సీన్లు చూపించారు. ఆ సీరీస్ అంతా రెండు మతాల మధ్య వైరుధ్యాలు చూపిస్తూ సాగుతాయి. అసలు మతాలను బేస్ చేసుకుని కథలు రాయడం క్రియేటివిటీ ఏంటో. అదొక సొంత పైత్యం. ఆ రైటర్ తన సొంత అభిప్రాయాలను జనం మీద రుద్దుతాడు. ఏ సూటబూల్ బాయ్ పై కూడా ఆ మధ్య కాంట్రవర్సీలు వచ్చాయి. అంతకన్నా ముందు ప్రైమ్ వీడియోలో వచ్చిన హిట్ సిరీస్ పాతాళ్ లోక్ కూడా కులాల మధ్య కథే. దాదాపుగా ఈ మధ్య వచ్చిన వెబ్ సిరీస్ ల్లో మతాలు, కులాల ప్రస్థావన మాత్రం శృతి మించుతోంది.

తాండవ్ కాంట్రవర్సీ హీట్ మీద ఉంది. ఆ రూట్ లోనే ఇప్పుడు మీర్జాపూర్ కూడా ఇబ్బందుల్లో పడింది. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు, అక్కడ ఉన్న పరిస్థితులు, డాన్లు ఈ అంశాల మీద వచ్చిన ఊర మాస్ వెబ్ సెరిస్ మీర్జాపూర్. తమ సంప్రదాయాలను కించపరిచారని కొందరు మీర్జాపూర్ టీమ్ పై కేసు పెట్టారు. ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదైంది. మీర్జాపూర్ రెండు సిరీస్ లు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ఉన్నాయి. మొత్తానికి ఓటీటీల్లో వచ్చే ఈ వెబ్ సిరీస్ లు ఈ మధ్య హాట్ టాపిక్ గా మారాయి. మరి ఇది ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.

About Author

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *