ఒకప్పుడు సౌత్ ఇండియన్ స్టార్స్ అంటే బాలీవుడ్‌కి చిన్నచూపు. అసలు మన వాళ్లను పట్టించుకునేవారే కాదు. ఆ మాటకు వస్తే మొట్టమొదటి సారి ఇండియన్ సినిమాలో కోటి రూపాయల రెమ్యూనరేషన్ రేంజ్‌కి వెళ్లిన హీరో మన చిరంజీవే. ఆ తర్వాతే అమితాబ్. అప్పట్లో ఆ వార్త మ్యాగ్జైన్స్‌లో సంచలనం. అయినా సరే మనవాళ్లంటే ఆ బాలీవుడ్‌కి చిన్నచూపే. కానీ ఇప్పుడు అదే బాలీవుడ్ సౌత్ సినిమాను చూసి వణుకుతోంది. మన సినిమాలు వస్తున్నాయంటే అక్కడి కింగ్ ఖాన్లు కూడా తప్పుకోవాల్సిందే. బాహుబలి తర్వాత సీన్ మారిపోయింది. కేజీఎఫ్ తర్వాత సౌత్ సినిమా అంటే బాలీవుడ్‌కి వణుకు మొదలైంది. మొత్తంగా ఈ వణుకు పుట్టించిన రియల్ హీరో మాత్రం మన ప్రభాసే. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలతో 1500 కోట్ల పందెం నడుస్తోంది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ తగ్గకుండా జాగ్రత్తపడుతున్నాడు డార్లింగ్. సాహో కూడా ఇక్కడ అటూ ఇటు అయినా బాలీవుడ్‌లో కలెక్షన్స్ కొట్టింది. దీపిక పడుకోన్ లాంటి బాలీవుడ్ టాప్ స్టార్స్ ప్రభాస్ అంటే వెనుకా ముందు చూడకుండా సైన్ చేస్తున్నారు. ప్రభాస్- నాగ్ అశ్విన్ భారీ మూవీ ప్రాజెక్ట్-కె హీరోయిన్ దీపిక. ఆ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన దీపికకు మన సంప్రదాయంలో స్వాగతం పలికారు. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్.. ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అంటున్నారు.
బాలీవుడ్‌లో జెండా పాతాలని మన చిరు, నాగ్, వెంకీ ముగ్గురూ ట్రై చేశారు. బట్ వర్కవుట్ కాలేదు. జెండా పాతడమే కాదు, అక్కడి కింగ్‌ఖాన్‌లకు కూడా వణుకు పుట్టిస్తున్నాడు ప్రభాస్. బాలీవుడ్‌లో ప్రభాస్ సినిమాలపై పెద్ద పందెమే నడుస్తోంది. రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ ఇలా ఎక్కడా డార్లింగ్ తగ్గడం లేదు. పాన్ ఇండియా మూవీ అయితేనే సైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ సినిమాల టర్నోవర్ అంచనాలు 1000-1500 కోట్లుగా అంచనాలు ఉన్నాయి. ఈ నంబర్ దాటేసినా ఆశ్చర్యం లేదు. ప్రభాస్ స్టామినా ఆ రేంజ్‌లో ఉంది. ప్రస్తుతం మన ప్రభాస్‌కి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సాహో అంటోంది. ఆది పురుష్ షూటింగ్ దాదాపు పూర్తయింది. సలార్ షూటింగ్ వేగంగానే జరుగుతోంది. కేజీఎఫ్ లాంటి వండర్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్- మన బాహుబలి ప్రభాస్ కాంబోలో వస్తున్న సలార్ మీద అంచనాలు ఊహించనంత ఎత్తున ఉన్నాయి. ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాపైనా అదే స్థాయి అంచనాలున్నాయి. అన్ని సినిమాలో హిందీ సహా… ఐదు భాషల్లో రిలీజవుతున్నాయి. ఇక కొత్తగా సైన్ చేసిన సినిమాలు ప్రాజెక్ట్-కె, అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా స్పిరిట్. ఇవి కూడా పాన్ ఇండియా మూవీసే. ముఖ్యంగా ప్రాజెక్ట్-కె సైన్స్ ఫిక్షన్ మూవీ. ఈ సినిమా మరీ అంచనాలు పెంచుతోంది.
మొత్తానికి ప్రభాస్…. ఇండియన్ మూవీని శాసించే బాహుబలిగా ఎదిగాడు. బాలీవుడ్ శిఖర సింహాసనం మీద కూర్చున్నాడు.