June 3, 2023

ప్రకటన కాస్త వివాదంగా మారింది…!!!

ప్రకటన కాస్త వివాదంగా మారింది…!!!

ఈ మధ్య కళ్యాణ్‌ జ్యుయెలరీస్‌కి సంబంధించిన ఓ యాడ్‌ వివాదాస్పదమైంది. ఆ యాడ్‌లో అమితాబ్‌ నటించారు. తెలుగులో అదే యాడ్‌కి నాగార్జున నటించారు.ఆ యాడ్‌లో బ్యాంకు సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్టు, వినియోగదారులను చిన్నచూపు చూసినట్టు, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినట్టు చూపించారు. ఆ యాడ్‌ఆలిండియా బ్యాంకు యూనియన్లకు ఆగ్రహం తెప్పించింది. బ్యాంకింగ్‌ సిస్టమ్‌ పట్ల ప్రజలు నమ్మకం కోల్పోయేటట్టు ఉందని వారు కంప్లైంట్‌ చేశారు. ఇది క్రియేటివ్‌, ఫిక్షన్‌కి సంబంధించిన చిత్రీకరణ అని కళ్యాణ్‌ జ్యూయలరీ యాజమాన్యం వాదించింది. కానీవారి బంగారు ఆభరణాల వ్యాపార లబ్ది కోసం కోట్ల మంది డబ్బుకి భరోసానిచ్చే బ్యాంకింగ్‌ వ్యవస్థపై అపనమ్మకం కలిగించే విధంగా ఆ ప్రకటన రూపొందించడం సబబు కాదని యూనియన్లు గట్టి పట్టు బిగించాయి. విషయం సీరియస్‌ అవడంతో వెంటనే ఆ యాడ్‌ ప్రసారం కాకుండా ఆపు చేస్తామని కళ్యాణ్‌ జ్యుయెలరీ యాజమాన్యం ప్రకటించింది. నిజానిక ఆ యాడ్‌లో చూపించినంత ఘోరంగా అయితే బ్యాంకు సిబ్బంది ఉండరు. నిజంగా అలా ఉంటే వినియోగదారులు మాత్రం ఊరుకుంటారా..? ఎంతో క్రిస్ప్‌గా ఉండాల్సిన ప్రకటనలు కూడా డైలీ సీరియల్‌ మేకింగ్‌లా చిరాగ్గా ఉంటే ఎలా…?

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *