May 30, 2023

గేదెల శ్రీనుబాబుకి బిగ్‌ కౌంటర్‌- జనసేనలోకి జేడీ

గేదెల శ్రీనుబాబుకి బిగ్‌ కౌంటర్‌- జనసేనలోకి జేడీ

నిన్న గాక మొన్న వచ్చిన పొలిటికల్‌ జూనియర్స్‌ కూడా పార్టీలు మారిపోతున్నారు. గేదెల శ్రీనుబాబు. అసలు ఈయన ఎవరో కూడా చాలా మందికి తెలీదు. శ్రీకాకుళం లాంటి మారు మూల ప్రాంతం నుంచి వచ్చివైద్య రంగంలో ఏవో రీసెర్చ్‌లు చేసి వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారని, యంగ్‌ అండ్‌ డైనమిక్‌ బిజినెస్‌ మ్యాన్‌ అని అంటుంటారు. జనసేనలోకి వచ్చాకే గేదెల శ్రీనుబాబు అంటే ఎవరో తెలిసింది. అంత మాత్రాన పాలిటిక్స్‌ కూడా బిజినెస్‌ అనుకుంటే ఎలా? చాలా కాలంగా పవన్‌తో రాసుకు పూసుకు తిరిగారు. పుట్టిన జిల్లాకు ఏదో చేస్తారనుకుంటే శ్రీకాకుళం సీటు వద్దని ఆయనే అనుకున్నారు. వైజాగ్‌ సీటు కావాలి అని పట్టు పట్టుకు కూర్చుంటేపవన్‌ ఆ డిమాండ్‌కి కూడా ఓకే అన్నారు. ఫస్ట్‌ లిస్ట్‌లోనే ఆయన కోరుకున్న విశాఖపట్నానికే ఆయన పేరు ప్రకటించారు. ఇంతకన్నా ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది. రాత్రికి రాత్రి ఏమైందో ఏమో వైసీపీ కండువ కప్పేసుకుని దర్శనమిచ్చిన గేదెల శ్రీనుబాబుని చూస్తేషాక్‌. రాజకీయాల్లో ఎల్‌కేజీ కూడా పూర్తి చేయని శ్రీనుబాబుఏదో పొలిటికల్‌ పీజీ చేసిన వాళ్లలా అప్పుడే పార్టీలు మారడం ఛ.... ఏం బాగోలేదు. ఇంతవరకు ఆయన మీద ఏదైనా గుడ్‌ విల్‌ ఉంటే అది పూర్తిగా పోయిందంటున్నారు జనసైనికులు. అయితే ఇలాంటి వాటికి భయపడేవాడు కాదు జనసేనాని. ఆయన పార్టీ మారిన గంటల వ్యవధిలోనే గేదెలకి గట్టి ఝలక్‌ ఇచ్చారు. ఎప్పటి నుంచో వస్తాడు వస్తాడు అని రూమర్స్‌ దశలోనే ఉన్న జేడీ లక్ష్మీనారాయణను పవన్‌ కలిశారు. జేడీ ముందు గేదెల శ్రీనుబాబు కనీసం పోటీ కూడా కాదు. ఎన్నికల్లో ధన బలం కన్నా ప్రజా బలమే డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌. పైగా జేడీకి విశాఖపట్నం సీటు దాదాపుగా ఖరారైంది. విశాఖపట్నం ప్రజలు గతంలో కూడా చాలా భిన్నంగా ఓటేసిహరిబాబు లాంటి క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న వాళ్లని గెలిపించారు. అంటే ఈసారి విశాఖలో జనసేనకి ఎంపీ సీటు గ్యారెంటీ అన్నమాట. అలాగే ఇన్నాళ్లూ జేడీటీడీపీ మనిషి అని వస్తున్న రూమర్స్‌ కూడా ఈ దెబ్బకి కామ్‌ అయిపోతాయి. అయినాజనసేనలో ఉంటే గేదెల శ్రీనుబాబు టాప్‌ 10లో ఒకరిగా ఉంటారు. వైసీపీలో ఉంటే గుంపులో ఆయనో గోవిందం. అంత పెద్ద వ్యాపార వేత్తఇంత లాజిక్‌ ఎలా మిస్సయ్యారో. అంతే ఎంత గొప్పవారైనా రాజకీయాల్లోకి వచ్చేసరికి తూస్సుమంటుంటారు. బ్యాడ్‌ లక్‌ శ్రీనుబాబు గారు.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *