June 7, 2023

సీఎం ఎవరు? వార్‌ ఒన్‌ సైడ్‌ మాత్రం కాదు.

సీఎం ఎవరు? వార్‌ ఒన్‌ సైడ్‌ మాత్రం కాదు.

ఎలక్షన్ బిగ్‌ ఫైట్‌ మొదలైంది. తిరుపతి వెంకన్నా.. నువ్వే దిక్కు అంటూ చంద్రన్న ప్రచారాన్ని ప్రారంభించారు. నాన్నకు ప్రేమతో అంటూ వైఎస్ నీడలో, పాద యాత్ర సెంటిమెంట్‌తో జగన్‌ మాంచి ఊపు మీదే ఉన్నారు. ఇక ఒక్కో మెట్టు ఎక్కుతూపెద్ద పార్టీలకు కూడా వణుకు పుట్టిస్తోంది జనసేన. ఈ సారి జనసేన ఎలాంటి ఎఫెక్ట్‌ చూపిస్తుందో అర్థం కాక.. టీడీపీ, వైసీపీలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ రాజకీయ చదరంగంలో కింగ్‌ ఎవరో మే 23న తేలిపోతుంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్‌ పాగా వేసి.. పార్లమెంట్‌లో సత్తా చాటాలని దూకుడు మీద ఉన్నారు. ఏపీలో సమ్మర్‌ హీట్ కన్నా పొలిటికల్ హీటే ఎక్కువుంది. వార్‌ ఒన్‌సైడ్‌ మాత్రం కాదు. రిజల్ట్ ఎలా ఉన్నా ఇప్పటికే సర్వేలు టగ్‌ ఆఫ్‌ వార్‌ అని తేల్చేశాయి. రోజుల్లోనే పోలింగ్‌ డేట్‌ వచ్చేస్తోంది. ఎవరి ధీమాలో వాళ్లున్నాలోపల హార్ట్‌ బీట్‌ పెరిగిపోతోంది. విభజన తర్వాత హార్ట్ పొలిటికల్‌ రన్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా పోటీలో పరిగెడుతున్నా వాటిని ఎవరూ లెక్కలోకి తీసుకోవడం లేదు.

టీడీపీలో టెన్షన్‌ టెన్షన్‌

టీడీపీఈ సారి అత్యంత టెన్షన్‌తో ఉన్న పార్టీ. చంద్రబాబుకి ఊపిరి ఆడటం లేదు. ఈ ఐదేళ్లలో అన్నీ సమస్యలేప్రెస్‌ మీట్‌లో ఎంత బాగా కవర్‌ చేసినా, ఎన్ని శ్వేత పత్రాలు విడుదల చేసినాడొల్లతనం కనిపిస్తూనే ఉంది. ప్రత్యేక హోదా విషయంలో ఈ ఐదేళ్లలో వంద మాటలు మార్చిన చంద్రబాబు వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. పోలవరాన్ని బహుబలి సినిమాలా చూపించినా, అమరావతిని మాహిష్మతి గ్రాఫిక్స్‌లో మలిచినాఓటరు వీటిని పాజిటివ్‌గా తీసుకుంటాడా, నెగటివ్‌గా తీసుకుంటాడో చూడాలి. అందుకే సేఫ్‌ గేమ్‌ స్టార్ట్‌ చేశారు. సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. పెన్షన్లు, పసుపు కుంకాల ఎఫెక్ట్‌ బాగానే కనిపిస్తోంది. ఎన్నికల ముందు పోల్‌ మేనేజ్‌మెంట్‌ మ్యాజిక్‌లో బాబు దిట్ట. మరి అలాంటి మ్యాజిక్‌ ఏం చేస్తారో చూడాలి. పాపం.. చంద్రబాబు ఇమేజ్‌ మరింత పెంచేందుకు భారీ బడ్జెట్‌తో తీసిన మహా నాయకుడు సినిమాకు కూడా టికెట్లు తెగలేదు. తెలుగు తమ్ముళ్లే ఆ థియేటర్ల వైపు వెళ్లలేదన్నది టాక్‌. అటు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో ఏం కెలికాడో తెలీదు. ఆ సినిమాలో అయితే విలన్‌ చంద్రబాబే అన్నది ట్రైలర్లలో తెలుస్తోంది. ఇదో టెన్షన్‌. ఈటైంలోనేఐటీగ్రిడ్స్‌ స్కాం. పోల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం హై టెక్నాలజీతో మేకింగ్‌ చేసిన సేవామిత్ర యాప్‌ ద్వారా వ్యతిరేక ఓట్లు అక్రమంగా రద్దు చేస్తున్నారన్న వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైసీపీ వేసి ఓటుకి నోటు పార్ట్‌-2. ఇందులో బాబు పేరుతో బేరసారాల వీడియో ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రజలు టీడీపీకి ఓటేశారు. కానీ విభజన హామీల అమలు విషయంలో చంద్రబాబు రోజుకో సినిమా చూపించారు. కేంద్రంతో ఆయన పెట్టుకున్న కీచులాట కూడా ఏపీకి నష్టం కలిగించాయన్న అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధుల విషయంలోనూ అవినీతి గుసగుసలు వినిపించాయి. విభజన గాయాల నుంచి ఏపీ ప్రజలు కోలుకోలేదన్నది వాస్తవం. విద్య, ఉపాధి రంగాల్లో ఏపీ ఈ ఐదేళ్లలో పెద్దగా సాధించిందేమీ లేదు. ఆర్థిక లోటు ప్రధాన సమస్య. తలసరి ఆదాయం బాగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రజల ఓటు ఎటు అన్నది మిస్టరీగా మారింది. కొత్త తరం నేతల కోసం ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారన్నది గ్రౌండ్‌ లెవల్‌ రిపోర్ట్స్‌లో వినిపిస్తున్న మాట. ఇంతకు ముందు సపోర్ట్‌ చేసిన జనసేనప్రత్యేక హోదా విషయంలో టీడీపీ రాంగ్‌ టర్న్‌తో గుడ్‌బై చెప్పేసింది. మరోవైపు ఎప్పుడూ లేనంతగా తెలుగు తమ్ముళ్లు పార్టీకి గుడ్‌బై చెప్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కీలక నేతలు వైసీపీ గూటికి చేరారు. వైసీపీ గూటికి చేరిన తెలుగు తమ్ముళ్లలో చాలా మంది గెలుపు గుర్రాలే. యెల్లో బాస్‌కి ఇదో పెద్ద టెన్షన్‌. టీడీపీకి ఇప్పుడు వైసీపీతో బిగ్‌ ఫైట్‌ తప్పదు. పెంచారు. పవన్‌ రంగంలోకి దిగాక బీసీ ఓటు బ్యాంకు మొత్తం చీలుతోంది. అయితే ఇంత టెన్షన్‌లోనూ యెల్లోబాస్‌ పొలిటికల్‌ ప్లానింగ్‌ పెర్‌ఫెక్ట్‌గానే ఉంది. అభ్యర్థుల ఖరారులో అన్ని పార్టీల కన్నా ముందున్నారు.

వైసీపీ దూకుడు

ఇక వైసీపీ. ఈ సారి మాంచి ఫామ్‌లో ఉందనే చెప్పాలి. 2019 ఎన్నికల రంగస్థలంలో హాట్ ఫేవరేట్‌. పాదయాత్ర మీదే ఆయన ఆశలన్నీ పెట్టుకున్నారు. యాత్ర సినిమా కూడా కలిసొచ్చింది. అన్ని జిల్లాల్లో 14 నెలలపాటు పాదయాత్ర చేసిన జగన్‌తన తండ్రి వైఎస్‌ ఛరిష్మాని నమ్మకున్నారు. ప్రత్యేక హోదా అంశంతో ప్రజల్లోకి వెళ్తున్న జగన్‌గత మూడేళ్లుగా ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మేనిఫెస్టోలో నవరత్నాలను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రచార వ్యూహాలను సిద్ధం చేశారు. ఎన్నికలు అయ్యాకకేంద్రంలో హోదా ఇచ్చిన వారికే మద్దతిస్తామనిఏపీ ప్రజల్లో సెంటిమెంట్‌ క్రియేట్‌ చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌ స్వయంగా జిల్లాలవారీగా సమర శంఖారావం పేరుతో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జిల్లాల్లో బస్సు యాత్రతో మరోసారి సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. అయితే ప్లస్‌లతో పాటు మైనస్‌లూ ఉన్నాయి. కేసుల విషయంలో జగన్‌పై ప్రజల అభిప్రాయం మారిందో లేదో పోలింగే డిసైడ్‌ చేయాలి. చాలా మంది నేతలు జగన్‌ గూటిలో ఉండి తర్వాత ఆయన వ్యవహార శైలిపై విమర్శలు చేస్తూ బయటకి వచ్చినవారే. కాపు రిజర్వేషన్ల విషయంలోనూ జగన్‌ సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నారు. మరి ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకు జగన్‌కు వెళ్తుందా లేదా అన్నది డౌటే. అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేసిఅసలు ప్రతిపక్షమే లేని అసెంబ్లీని మిగిల్చారు. ఇది కచ్చితంగా వ్యతిరేక అంశమే. మరి ఓటరు మనోగతం ఎలా ఉందో వెయిట్‌ అండ్‌ సీ.

డేరింగ్‌ అండ్ డేషింగ్‌ జనసేన

ఇక జనసేనయంగ్‌ అండ్‌ డైనమిక్‌ పార్టీగా జనాల్లోకి వచ్చింది. గతంలో ప్రజారాజ్యం పార్టీ ఎదురైన పరిస్థితులను గమనించిన అనుభవం పవన్‌కి పనికొచ్చింది. మొదట్లో ప్రభుత్వ వ్యతిరేక వాయిస్‌ లక్షల మది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు పవన్‌. ఒక్కో లీడర్‌తో పార్టీని పటిష్టం చేసుకుంటూ వచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్‌.. ఆ తర్వాతయెల్లోబాస్‌కి కటిఫ్‌ చెప్పారు. 14న జరిగిన ఆవిర్భావ సభ సమయంలో 32 అభ్యర్థులను ప్రకటించి, మేనిఫేస్టో కూడా వినిపించి.. శభాష్‌ అనిపించారు. కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టి తాను ఏపీ పాలిటిక్స్‌కే పరిమితమని వ్యూహాత్మక సూచన చేశారు. ఎక్కువ మంది కొత్తవారికే అవకాశమిస్తానని చెప్పిన పవన్‌ తొలిజాబితా ఎక్కువ మంది కొత్తవారినే ప్రకటించి మాట మీదున్నారు. ఇప్పటి వరకు జిల్లాల్లో పవన్‌ ప్రజాపోరాట యాత్రలో జనం స్పందన అద్భుతంగా ఉంది. ఇవి ఓట్లుగా మలుచుకునేందుకు జనసేన సోషల్‌ మీడియా చాలా యాక్టివ్‌గా ఉంది. జనసేన పొలిటికల్‌గా ట్రెండ్ సెట్టర్‌గా మారింది. అభ్యర్థుల కోసం అప్లికేషన్స్‌ ఆహ్వానించడం, వాటిని స్క్రూటినీ చేసి మంచి అభ్యర్థులను ఎంపిక చేయడం లాంటి న్యూ ట్రెండ్స్‌ ప్రజలను ఆకర్షించాయి. పవన్‌ గ్లామర్‌ జనసేనకు మేజర్ అసర్ట్‌. వీటితో పాటు సీనియర్లు, క్లీన్ ఇమేజ్‌ ఉన్నవారిని మాత్రమే దగ్గర తీసుకుంటున్న పవన్‌. మొదటి నుంచి ప్రత్యేక హోదా మాట మీదే నిలబడ్డారు పవన్‌. చాలా సర్వేల ప్రకారంవచ్చే ఎన్నికలకు జనసేన పార్టీ అత్యంత కీలకంగా కనిపిస్తోంది. ఒక వేళ హంగ్‌ అంటూ వస్తే కింగ్‌మేకర్‌ పవనే. జనసేన పార్టీ బలం సోషల్‌ మీడియా. యూత్‌ ఫాలోయింగ్ జనసేనకు ఉన్నంతగా ఇంకే పార్టీకి లేదు. యూత్‌ ఓటు బ్యాంకు జనసేనకి పడితేనో డౌట్‌.. పవన్‌కి తిరుగులేదు. అందుకే టీడీపీ, వైసీపీలుజనసేన కోసం ఇప్పటికీ పరితపిస్తూనే ఉన్నాయి. మరి జనసేన కొత్త చరిత్ర లిఖిస్తుందా లేదావెయిట్ అండ్‌ సీ

కాంగ్రెస్‌ ఆటలో అరటిపండేనా

ఇక కాంగ్రెస్‌రాష్ట్ర విభజన దెబ్బకి కాంగ్రెస్‌ అడ్రస్‌ లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి లేదు. ఈ సారి నిలబడితే చాలనుకునే పరిస్థితి. పోటీకి అభ్యర్థులే కరవు. సెంట్రల్‌లో ఈ సారి కాంగ్రెస్‌ కాస్తో కూస్తో హవా చూపించింది. ప్రియాంక రాకతో కాంగ్రెస్‌ వర్గాల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. హోదా విషయంలో తప్పు సరిదిద్దుకునే హామీలతో ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఏపీలో నాలుగు సార్లు రాహుల్‌ పర్యటించి దిగాలు పడిన కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం అని, అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం అని భారీ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇదే హామీతో కాంగ్రెస్‌ ప్రజల్లోకి వెళ్తోంది. మరి ఎవరి సత్తా ఏంటో చూడాలంటే జడ్జిమెంట్‌ డే వరకు ఆగాల్సిందే.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *