June 7, 2023

డాన్‌ గారు గాంధీ పరీక్షలో ఫస్టొచ్చారు…

డాన్‌ గారు గాంధీ పరీక్షలో ఫస్టొచ్చారు…

ఆయన పేరు అరుణ్‌ గౌలి. 1980ల్లో ముంబయ్‌ అండర్‌ వరల్డ్‌లో పేరుమోసిన డాన్‌. అంతకు ముందు అక్కడి కాటన్‌ మిల్లుల్లో పనిచేసేవాడు. అప్పట్ల్లో మిల్లులు తరచూ లాక్‌అవుట్‌ అవుతూ ఉండేవి. ఉద్యోగాలుండేవి కావు. అప్పుడే అరుణ్‌ గౌలీ అండ్‌ గ్యాంగ్‌ ఓ మాఫియా ముఠాలో చేరారు. ఆ ముఠా నాయకుడు ఎన్‌కౌంటర్లో చనిపోయాక అరుణ్‌ డాన్‌ అయ్యాడు. ఇక సెటిల్‌ మెంట్లు, క్రైమ్స్‌తో ఓ దశలో దావూద్‌ ఇబ్రహీంని కూడా ముప్పుతిప్పలు పెట్టారు. ఆ తర్వాత అఖిల భారతీయ సేన అని ఓ పార్టీ కూడా పెట్టాడు. 2004లో ఎమ్మెల్యే కూడా అయ్యాడు. ఆ మధ్య ఓ శివసేన కార్యకర్తని హత్య చేశారు. ఆ కుట్ర వెనుక ఉన్నది ఆరుణ్‌ గ్యాంగేనని నమ్మి 2012లో కోర్టు శిక్ష విధించింది. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఇది క్లుప్తంగా అరుణ్‌ గౌలీ కథ. ఈయన జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో డాడీ అనే సినిమా కూడా తీశారు. అయితే ఇంత వరకూ సినిమా స్టోరీలా బాగానే ఉంది. అసలు కథ జైల్లోనే మొదలైంది. ఈ మధ్య పుణెకి చెందిన సహయోగ్‌ అనే ఎన్జీవో సెంట్రల్‌ జైల్లో ఖైదీల ప్రవర్తనావళిలో భాగంగా ఓ పరీక్ష నిర్వహించింది. గాంధీ ఐడియాలజీ అనే కాన్సెప్ట్‌ మీద ప్రశ్నలు, వాటికి ఆప్షన్లు కూడా ఉంటాయి. 160 మంది ఖైదీలు ఈ పరీక్ష రాస్తేఅరుణ్‌ గౌలీ వాళ్లందరీలో ఫస్ట్‌ వచ్చాడు. ఫస్ట్‌ రావడమే కాదు.. ఏకంగా గాంధీగిరిలో డిస్టింక్షన్‌లో పాసయ్యాడు. 80 మార్కులకు పరీక్ష పెడితే అరుణ్‌ దాదా 74 మార్కులు సాధించాడు. సంజయ్‌ దత్‌ లగేరహో మున్నాభాయ్‌ సినిమా గుర్తుందిగా. అందులో కూడా ఇంతేగాంధీ లైఫ్‌ స్టోరీ చదివి డాన్‌ కాస్తా గాంధీ ఫాలోవర్‌ అయిపోతాడు. ఈ సీన్‌ చూస్తే.. ఆ సినిమా గుర్తొస్తోంది కదా. ఏది ఏమైనా ఈ మార్పు మంచిదేగా. అలాగే తుపాకీ కన్నా పదునైన గాంధీ శాంతి మంత్రాన్ని కూడా పాటిస్తే ఇంకా మంచిది.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *