అవతార్. 2009లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అద్భుతం. వరల్డ్ సినిమా హిస్టరీలో అవతార్ ఓ క్లాసిక్. జేమ్స్ కేమరూన్ ఊహాశక్తి, మనుషుల స్వార్థం ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తుందో చెప్పే సందేశం కలిపి అవతార్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాయి. ఆ సినిమాలో పండోరా అనే కొత్త గ్రహాన్ని సృష్టించిన దర్శకుడి విజువల్ మాయాజాలం ఇప్పటికీ కళ్ల ముందు కదుల్తూనే ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు కూడా అవతార్ పేరు మీదే ఉంది. అవతార్ సినిమా ఏకంగా ఐదు భాగాల సినిమా. అందులో రెండో భాగం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సీక్వెల్‌లో పండోరా గ్రహం కనిపించదు. మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించాం అని చిత్ర బృందం ఫోటోలను ట్వీట్ చేసింది. ముందు ఊహించినట్టుగానే ఈ సారి అవతార్ కథ సముద్రం నేపథ్యంలో ఉంటుందని ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. 2021 డిసెంబర్ 18న వచ్చే ఈ సినిమా ప్రమోషన్ ఇప్పటి నుంచి ప్రారంభమైపోయింది. ఇప్పటికే రెండు, మూడు భాగాల పనులు పారలల్‌గా సాగుతున్నాయి.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018