June 7, 2023

ఆర్టీసీపై కేసీఆర్‌ స్టెప్‌ ఏంటి?

ఆర్టీసీపై కేసీఆర్‌ స్టెప్‌ ఏంటి?

ఎప్పుడూ లేని విధంగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతోంది. కార్మికులు ఒక్క మెట్టు కూడా దిగే ప్రసక్తి లేదు అన్నట్టుగా సమ్మె చేస్తున్నారు. ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. అటు కేసీఆర్‌ కూడా అంతే పట్టు మీద ఉన్నారు. సెల్ఫ్‌ డిస్మిస్‌ అన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారమే లేపాయి. ఈ నెల కార్మికులకు జీతాల చెల్లింపులు కూడా లేవు. ఆ విషయం మీదే హై కోర్టుకి వెళ్తే ఆర్‌టీసీకి ఇవ్వాల్సిన జీతాలు రూ.230 కోట్లున్నాయనియాజమాన్యం దగ్గర ఉన్నది 7.5 కోట్లేనని బదులు వచ్చినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హుజూర్‌నగర్ ఎన్నికల నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్‌ కఠినంగానే వ్యవహరించారు. ఎలాంటి నిర్ణయాలు చెప్పలేదు. ఇప్పుడా ఎన్నికలు అయిపోయాయి. మరి ఇప్పుడు కేసీఆర్‌ ఏం చేయబోతున్నారు. ఆర్టీసీపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఆ నిర్ణయాలు ఏంటి…? ఆర్టీసీ కార్మికులు వర్సెస్‌ యాజమాన్యం కేసుని హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ సమయంలో కేసీఆర్‌ దూకుడు నిర్ణయాలు తీసుకుంటారా? ఎప్పుడూ లేని విధంగా జరుగుతున్న ఈ సమ్మెను కేసీఆర్‌ ఎలా డీల్‌ చేయబోతున్నారు? ఇప్పుడీ న్యూస్‌ చర్చగా మారుతోంది. ఈ నాలుగైదు రోజుల్లో ఏదో ఒకటి తేలుస్తారా? 24న హుజూర్‌నగర్‌ రిజల్ట్‌ వచ్చేవరకు ఇంతేనా? ఆర్టీసీ విషయంలో కేసీఆర్‌ ఎందుకు ఇంత పట్టుదలగా ఉన్నారన్నదీ సస్పెన్సే. ఏది ఏమైనా ప్రగతి రథ చక్రాలు ఆగిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆటోల దోపిడీ అంతా ఇంతా కాదు. ఆటోవాలాలు జేబులు దోచేస్తున్నా కంట్రోల్‌ లేదు. బస్సుల సమ్మె పేరు చెప్పుకుని కూరగాయల ధరలు ఆమాంతం పెంచేశారు. డబుల్‌ రేట్లతో ప్రజలు కూరగాయలు కొనాల్సిన పరిస్థితి. సాధ్యమైనంత తొందరగా ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాల్సి అవసరం ఉంది.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *