June 7, 2023

ఏపీలో కాంగ్రెస్‌ జెండా పీకేసినట్టేనా…?

ఏపీలో కాంగ్రెస్‌ జెండా పీకేసినట్టేనా…?

ఏపీలో కాంగ్రెస్‌ జెండా పీకేసినట్టేనా…? ఒకవైపు వైసీపీ సునామీకి తెలుగు దేశం పార్టీనే తట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఏపీలో టీడీపీ పార్టీ మనుగడే అర్థం కాని పరిస్థితి. ఆ పార్టీలో నేతలు ఒక్కొక్కరూ బీజేపీలోకి వెళ్తున్నారు. రాజకీయ కారణాలు ఏవైనా ఈ చేరికలు టీడీపీ ప్రతిష్టను దెబ్బతీసేవే. మరోవైపు ఏపీలో జెండా పాతేందుకు బీజేపీ సరైన సమయం కోసం ఎదురు చూస్తోంది. ఆకర్ష.. ఆకర్ష అంటూ కమల దళం పిలుస్తోంది. ఏపీలో సారధ్యం కోసం ఓ ఛరిష్మా ఉన్న నాయకుడి కోసం ఎదురు చూస్తోంది బీజేపీ. అసలే కేంద్రంలో చాలా పవర్‌ఫుల్‌గా ఉన్న బీజేపీకి ఎదురు నిలిచే శక్తి ఇప్పుడు దేశంలో ఏ పార్టీకీ లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. సెంట్రల్‌లో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పార్టీ రాష్ట్రాల్లో మరీ ఘోరంగా తయారైంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కాస్త నయం. అక్కడ కాంగ్రెస్‌ ఎంపీగా గెలిచిన రేవంత్‌ రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన తీసుకునే పొలిటికల్‌ స్టెప్స్‌ మీద సోషల్‌ మీడియాలో కొత్త కొత్త వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఏపీలోనూ కాంగ్రెస్‌ చాప చుట్టేసింది. ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి రాజీనామా చేశారు. ఇంకా హై కమాండ్‌ రాజీనామాను అంగీకరించలేదు. బట్‌ ఏపీలో ఎటు చూసినా కాంగ్రెస్‌కి ఆక్సిజన్‌ అందే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర విభజనతోనే ప్రజలు కాంగ్రెస్‌ని మర్చిపోయారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ లెక్కల ముందు కాంగ్రెస్‌ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమే. దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన జాతీయ పార్టీ కాంగ్రెస్‌ పతనం ఇంత ఘోరంగా ఉంటుందని ఎవరూ ఉహించరు.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *