September 21, 2023

‘దర్బార్‌’ పండగ వచ్చేసింది

‘దర్బార్‌’ పండగ వచ్చేసింది

రజనీ సందడి మొదలైంది. ఈ మధ్య కాలంలో రజనీ స్థాయి హిట్‌ లేదనే చెప్పాలి.ఆ మధ్య వచ్చిన పేట జస్ట్‌ హిట్‌ అంతే. కానీ దర్బార్‌ లుక్స్‌ చూస్తుంటే మళ్లీ రజనీ ఈజ్‌ బ్యాక్‌ అనిపిస్తోంది. వయసు మీద పడుతున్నా స్టైల్స్‌లో ఇప్పటికీ రజనీని కొట్టేవాడు లేడు. అందులోనూ సోషల్‌ మెసేజ్‌ కథలకు కమర్షియల్‌ టచ్‌ ఇచ్చే మురుగదాస్‌ డైరెక్షన్‌. వరుస హిట్స్‌తో లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న నయనతార హీరోయిన్‌. ఇంకేముంది అంచనాలు పెరిగిపోయాయి. ఇక ట్రైలర్‌తోనే దుమ్ము దులిపేసిన దర్బార్‌స్క్రీన్‌ మీద ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. రజనీ సినిమా అంటే కామన్‌ గానే తమిళనాడులో పండగే. అందుకే దర్బార్‌ రిలీజ్‌ రోజు తమిళనాడులో కొన్ని కంపెనీలు హాలిడే ఇచ్చేశాయి. రజనీ సినిమా అంటే రిజల్ట్‌తో సంబంధం లేదు. ఓ సారి చూసేద్దాం అనుకునేవారే ఎక్కువ. అందుకే సౌత్‌ ఇండియా అంతా పండగ సందడి దర్బార్‌తో మొదలైపోయింది.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *