May 30, 2023

దేశంలో ఇంకా ఆకలి మరణాలా… భరతమాతా క్షమించు…!!!

దేశంలో ఇంకా ఆకలి మరణాలా… భరతమాతా క్షమించు…!!!

ఎంత అభివృద్ధి చూసినా ఏమున్నది గర్వకారణంపట్టెడన్నం దొరక్క ఆకలి కేకలతో ప్రాణం ఆవిరవుతున్నప్పుడునా దేశ భవిష్యత్తు నడి రోడ్డు మీద నాలుగు మెతుకుల కోసం బిచ్చమెత్తుతున్నప్పుడుఏమున్నది గర్వకారణం. ఢిల్లీలో జరిగిన ఓ దారుణం ఇప్పుడు దేశం మొత్తాన్ని కదిలించింది. ఢిల్లీదేశ రాజధాని. మన దేశాభివృద్ధిని తెలుసుకోవాలంటే ప్రపంచం మొత్తం ముందు చూసేది ఢిల్లీనే. కానీ, దేశం మొత్తం సిగ్గుపడాల్సిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో వారం రోజులుగా తిండి లేక కేవలం నీళ్లు తాగుతూఇక తాళలేకపట్టెడన్నం దొరక్క…. చిక్కి శల్యమైఆకలితో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. ఢిల్లీ నడిబొడ్డున శవాలుగా మారారు. ఆకలి బలి తీసుకున్న ఆ ముగ్గురు ఆడపిల్లలే. వారి పేర్లు మాన్సి, పరో, సుఖోవీరిలో మాన్సి వయసు 8 ఏళ్లు, పరో వయసు 4 ఏళ్లు, సుఖో వయసు కేవలం రెండేళ్లు. కడుపు తరుక్కుపోయే ఈ ఆకలి చావులకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. ఎంత జీడీపీలు సాధించినా, వ్యాపార వాణిజ్యాల్లో ప్రపంచంతో పోటీ పడుతున్నాఏం లాభం. ఆకలి చావులు ఉన్నన్నాళ్లూ దేశం శతాబ్దాలు వెనక్కు వెళ్లినట్టే. ఈ చి‌ట్టి తల్లుల తండ్రి మంగళ్‌ఓ రిక్షావాలా. రోజు సంపాదన 100 లోపే. అందులోనే నెట్టుకొస్తుంటే.. ఆ ఉన్న రిక్షాను ఎవరో కాజేశారు. పూటకు గతి లేని ఆ తండ్రి కూలి కోసం ఎటో వెళ్లిపోయాడు. అతని భార్య బీనాకి మతి స్థిమితం లేదు. వారం రోజులుగా తండ్రి రాలేదు. ముద్ద పెట్టే దిక్కు లేదు. ఆకలితో మలమల మాడుతున్న ఆ చిన్నారులు.. బిచ్చగాళ్లయ్యారు. రోడ్ల మీద అడుక్కున్నారు. అయినా ముద్ద పుట్టలేదు. మంచినీళ్లే ఆహారమయ్యాయి. ఒట్టి నీళ్లతో వారం రోజులు నిలబడిన ఆ ముగ్గురి ప్రాణాలు.. ఎనిమిదో రోజు శాశ్వతంగా గాలిలో కలిసిపోయాయి. స్థానికులు చిన్నారుల శవాలను ఆస్పత్రికి తరలించారు. కేవలం ఆకలి కారణంగానే వారి ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారు. వారి శరీరాల్లో ఎక్కడా ఒక్క శాతం కూడా కొవ్వు అనేదే లేదని, పోషకాహారం జాడలే లేవని వైద్యులు షాకయ్యారు. ఈ చిట్టి తల్లులే కాదు దేశంలో 50 శాతం ఒక్క పూట తిండితో బతుకులీడుస్తున్న పేదలే. ఈ పదేళ్లలో భారత ఆహార సంస్థ.. FCI గోడౌన్లలో పాడై పోయిన ఆహార పదార్ధాలు దాదాపు 2 లక్షల టన్నులు. అహారాన్ని పారబోసే ఈ దౌర్భాగ్యం ఇంకా ఎన్నాళ్లు..? మన దేశం ‌అన్నపూర్ణఆ పక్కనే ఆకలి బాధ. పాడైన ఈ ఆహార పదార్థాలతో కోట్ల మంది చిన్నారులకు మూడు పూటల పోషకాహారం అందించవచ్చు. ఇప్పటికీ పోషకాహారం అందించే విషయంలో గ్రౌండ్‌ లెవెల్లో అడుగడుగునా అవినీతి, నోటి దాక చేరని తిండి.. ప్రతీ రాష్ట్రంలో కనిపించే సన్నివేశాలు. ఈ సంఘటనపై విచారణకు కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ఆదేశాలిచ్చారు. ఒక్కో నేత స్పందిస్తున్నారు. అంతా జరిగాక విచారించి లాభమేముంది. ఇప్పటికీ రోడ్‌ సైడ్‌ పిల్లల భవితేంటోవాళ్ల కథేంటో.. వారి ఆకలి వ్యథేంటో ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఇప్పటికీ ట్రాఫిక్‌ జామ్స్‌లో, సిగ్నల్‌ లైట్స్‌ దగ్గర.. ఆకలీ అంటూ చెయ్యి చాచే చిన్నారులెవురు? వారికి గుర్తింపు ఉందా? వారు దేశ భవిత కాదా? కాకపోతే మరేంటి? వారు బిచ్చమెత్తుకోవాల్సిందేనా? లేదంటే ఆకలితో మాడి చావాల్సిందేనా? నాలుగు ముద్దలు దొరక్కఅడుక్కున్నా తిండి దొరక్కచనిపోయిన ఆ చిన్నారుల ఆకలి మరణాలు చూసినా భరత మాత సిగ్గుతో తలదించుకుంటోంది..?

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *