June 3, 2023

ఉరే సరి – నిర్భయ కేసులో సుప్రీం కీలక తీర్పు

ఉరే సరి – నిర్భయ కేసులో సుప్రీం కీలక తీర్పు

2012 దిల్లీ నిర్భయ అత్యాచార, హత్య ఘటన దేశం ఎప్పటికీ మర్చిపోలేని పీడకల. ఈ కేసులో దోషులకు హత్య తగ్గించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిది. మరణ శిక్ష పడిన ముద్దాయిలు పెట్టుకున్న రివ్యూ పిటీషన్‌ని సుప్రీం తోసిపుచ్చింది. 2012 డిసెంబర్‌ 16 అర్థరాత్రి దేశం ఉలిక్కిపడింది. తోటి విద్యార్థితో కలిసివెళ్తున్న ఓ పారామెడికల్‌ విద్యార్థిపై ఆరుగురు వ్యక్తులు పైశాచికంగా అత్యాచారం, హత్య చేసి.. నిర్దాక్షిణ్యంగా యువతిని రోడ్డు మీద విసిరేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు డిసెంబర్‌ 29న తుదిశ్వాస విడిచింది. ఈ విషయంలో దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు ఎగిశాయి. ఆరుగురిలో ఒకరు మైనర్‌. మిగిలిన ఐదుగురిలో రాంసింగ్‌ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురుని దోషులుగా తేల్చిన కోర్టు 2017 మే 5న ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పిచ్చింది. ఈ శిక్షను సవాల్‌ చేస్తూ.. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని పవన్‌, వినయ్‌, ముఖేష్‌లు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ని పరిశీలించిన సుప్రీం.. వారికి ఉరి శిక్షే సరైనదని తీర్చునిచ్చారు.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *