ధోనీ ఇక భారత్‌కి వరల్డ్ కప్ రాదేమో అనుకుంటున్న టైంలో టీంలోకి వచ్చాడు.వడివడిగా ఎదిగి కెప్టెన్ అయ్యాడు. టీ 20 వరల్డ్‌కప్‌ని ఇండియాకి అందించాడు.1983 తర్వాత మళ్లీ 2011లో వరల్డ్‌కప్‌ని తెచ్చిన సమర్ధుడు. ఇంతవరకు ఏ ఇండియన్ కెప్టెన్ చేయలేని అద్భుతాలెన్నో చేశాడు. తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చాడు. అదే ఫార్ములాను తనకు తానే అప్లై చేసుకున్ననిస్వార్ధపరుడు. కోహ్లీ వచ్చాక కెప్టెన్సీ నుంచి తప్పుకుని అతనికి పగ్గాలు అప్పగించాడు. అలాంటి సూపర్ హీరోపై విమర్శలా? సిగ్గు చేటు. ధోనీ ఫెయిల్ అయ్యాడని ఎవరన్నారు? క్రికెట్‌పై అవగాహనలేని వాళ్లు చేస్తున్న నాన్సెస్ ఇది. సాక్షాత్తు కోహ్లీ… ధోనీకి మద్దతుగా నిల్చున్నాడు. ఆయన అనుభవమే టీంకి కొండంత అండ అని ఓపెన్‌గా చెప్పి రియల్ కెప్టెన్ అనిపించుకున్నాడు. శెభాష్ కోహ్లీ. మ్యాచ్ క్రిటికల్‌గా మారిన ప్రతీ పరిస్థితిలోనూ కోహ్లీ ధోనీ దగ్గరకు వెళ్లాడు. ధోనీ సలహాలతోనే నెగ్గిన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. అంతెందుకు ఓటమి అంచుల వరకు వెళ్ళిన ఆఫ్గాన్ మ్యాచ్‌లో విన్నింగ్ సీక్రెట్ ధోనీ. అనుభవం ముందు ఆట చిన్నది. ఇంగ్లండ్ మ్యాచ్‌లో ధోనీ నెమ్మదిగా ఆడాడు అన్నది విమర్శ. మిడిల్ ఆర్డర్‌లో బలం లేనప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు.ఇక్కడ దారుణంగా ఫెయిలైంది బీసీసీఐ సెలక్టర్లు. మిడిల్ ఆర్డర్‌లో ఎవరిని పెట్టాలో తెలియని అసమర్ధత సెలక్టర్లలో కనిపిస్తోంది. ఒక టీంకి బలం మిడిల్ ఆర్డర్. ఎందుకని టాలెంట్ హంట్ చేయలేకపోయారు? విజయ్ శంకర్ సెలక్షన్ ఫెయిల్. ఆ మాటకి వస్తే రిషబ్ పంత్ సెలక్షన్ కూడా ఫెయిలే. అద్భుతమైన టాలెంట్ ఉన్న రాయుడిని ఎందుకు సెలెక్ట్ చెయ్యరు? ఇగో ప్రోబ్లమా? విజయ్ శంకర్, రిషబ్ పంత్ కన్నా వందరెట్లు రాయుడు టాలెంటెడ్. అతన్ని ఎందుకుఎంపికచేయడం లేదు? బీసీసీఐ అంతర్గత వ్యవహారాలు దేశ క్రీడా ప్రతిష్టకి చేటు తేకూడదు. కేవలం మిడిల్ ఆర్డర్ వైఫల్యం వల్లే ఆ తర్వాత వచ్చే హార్దిక్ పాండ్యా, ధోనీల మీద ప్రెజర్ పడుతోంది. ఒకప్పుడు అద్భుతంగా మ్యాచ్ ఫినిష్ చేశాడు ధోనీ. ఇప్పటికీ ధోనీ గ్రేట్ ఫినిషరే. ఆనాడు మిడిల్ ఆర్డర్‌లో యూవీ లాంటి డాషింగ్ బ్యాట్స్‌మేన్ ఉండేవారు. ఇప్పుడెక్కడ? ప్లోబ్లెమ్ సెలక్టర్లది. ఇప్పుడు కొత్తగా మయాంక్ అగర్వాల్‌ని తీసుకుంటున్నారు. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం మంచిదే కానీ.. వరల్డ్ కప్‌లో ఛాన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఎనలిస్ట్‌లు చెప్తున్నారు. మయాంక్ అగర్వాల్ ఎలా ఆడతాడో ఎవరికీ తెలీదు. ఒకవేళ ఫెయిలయితే ఆ పాపం సెలక్టర్లదే. టోర్నీ మొదటి నుంచి ఫోర్త్ ప్లేస్ చాలా పేలవంగా ఉందని అందరూ అంటున్నారు. సగటు క్రికెట్ అభిమానికే ఈ విషయం తెలిసినప్పుడు సెలక్టర్లకు తెలియకపోవడం హాస్యాస్పదం. ఒకప్పుడు ఇండియాలో మిడిల్ ఆర్డర్ అంటే బౌలర్లు వణికేవారు. పాత రోజుల్లో కపిల్, ఆ తర్వాత సచిన్, అజర్, కాంబ్లీ, ద్రవిడ్, ఆ తర్వాత యూవీ, ధోని లాంటి దిగ్గజాలు మిడిల్ ఆర్డర్‌లో ఉండేవి. ఇప్పుడు చెప్పుకోదగ్గ పేరే లేదు. భారత్‌లో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. ఎంపికలోనే లోపముంది. ఇవన్నీ వదిలేసి… వ్యూహకర్త, ది బెస్ట్ కెప్టెన్ ధోనీని అనడం సరికాదు.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018