మళయాళం సినిమాలు చాలా స్పెషల్‌గా ఉంటాయి. చిన్న లైన్ తీసుకుని ఆ లైన్ చుట్టు మంచి కథ అల్లడంలో వాళ్లు చాలా సిద్ధ హస్తులు. అక్కడ నటులు కూడా అంతే టాలెంటెడ్. పాత తరం నుంచి మోహన్ లాల్, మమ్మూటీ, సురేష్ గోపీ.. ఈ జనరేషన్‌లో దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్.. ఇంకా చాలా మంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఫహాద్ ఫాజిల్ గురించి. నాగార్జున కిల్లర్ సినిమా గుర్తుందా. ప్రియా ప్రియతమా రాగాలు పాట బాగా ఫేమస్. ఆ సినిమా దర్శకుడు ఫాజిల్. అప్పటికే ఆయన మళయాళంలో స్టార్ డైరెక్టర్. మోహన్‌లాల్‌ని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. అత్తారింటికి దారేది నదియ ఫస్ట్ సినిమా కూడా ఫాజిల్ డైరెక్షన్‌లోనే. బేబీ షాలినీ, నగ్మా, ఖుష్బూ.. ఇలా చాలా మందికి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ ఫాజిల్. చంద్రముఖి ఎంత పెట్ట హిట్టో తెలుసుకదా. ఆ సినిమా ఒరిజినల్ మణిచిత్ర తాజు దర్శకుడు ఫాజిలే. ఆ ఫాజిల్ కొడుకే ఈ ఫయాద్ ఫాజిల్. మళయాళంలో ఇప్పటి జెనరేషన్ అద్భుత నటుల్లో ఆయన ఒకరు. ఫాజిల్ నటించిన స్టన్నింగ్ మూవీ ట్రాన్స్. ఇప్పటి వరకు 40 సినిమాలు చేశారు. అందులో చాలా వరకు డిఫరెంట్ మూవీసే. ఫాజిల్.. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు కూడా తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మళయాళంలో వచ్చిన సన్సేషనల్ మూవీ ట్రాన్స్. ఇది ఒక మూవీ మాత్రమే కాదు. దేవుడి ముసుగులో జరిగే చీకటి వ్యాపారాలపై తీసిన డేరింగ్ అండ్ డేషింగ్ మూవీ. అలాగే మనిషి మతం మత్తులో చిత్తైతే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇలాంటి సినిమా కేరళలో రావడం నిజంగా సన్సేషనే. కథలోకి క్లుప్తంగా వెళ్తే… మతం అన్నిటికంటే పెద్ద డ్రగ్ అనే కాన్సెప్ట్‌తో వెళ్తుంది ఈ సినిమా. విజూ ప్రసాద్ అనే వ్యక్తి మోటివేషనల్ స్పీకర్. నిరు పేద. అనుకోకుండా అతనికి ఓ బిజినెస్ డీల్ వస్తుంది. ఆ తర్వాత విజూ.. జోష్వాగా మారాల్సి వస్తుంది. జోష్వాగా.. విజూ ఏ చేశాడన్నదే ఈ సినిమా. ఆ తర్వాత ఏం జరిగిందనేది ప్రతీ క్షణం మనల్ని ట్రాన్స్‌లోకి తీసుకెళ్లే స్క్రీన్‌పై చూస్తేనే బాగుంటుంది. మళయాళం సినిమా అమెజాన్‌లో ఉంది. ఈ సినిమాని ఆహా ఓటీటీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసింది. ఈ సినిమాలో డైరెక్టర్ గౌతమ్ మీనన్ నెగెటివ్ క్యారెక్టర్లో సూపర్బ్ పెరఫార్మెన్స్ చేశారు. ఆర్య నటించిన రాజారాణి సినిమా చూసినవారు నజ్రియాని మర్చిపోలేరు. నజ్రియా.. ఫాజిల్ భార్య. ఈ సినిమాలో నజ్రియా కూడా కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా ఫాజిల్ నటన అద్భుతం. ఈ మధ్యే తెలుగులో సత్యదేవ్‌తో తీసిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా ఒరిజినల్ మహేషింటే ప్రతీగారమ్. ఆ సినిమా హీరో కూడా ఫాజిలే. 2016లో వచ్చిన ఆ సినిమాకు ప్రాంతీయ చిత్రాల విభాగంలో నేషనల్ అవార్డ్ వచ్చింది. ట్రాన్స్ సినిమాలో అంతకన్నా సూపర్‌గా ఉంటుంది ఫాజిల్ నటన.
Recent Posts
- ‘నాన్పకల్ నెరత్తు మయ్యక్కమ్’. మమ్మూట్టీ ఒన్ మ్యాన్ షో
- BBC: చెప్పేవి శ్రీ రంగ నీతులు… మరి చేసేవి? అసలు BBC ఎలా పుట్టిందంటే?
- ‘ఫ్రీ’ హిట్లో ముఖేష్ అంబాని భారీ ‘సిక్స్’ ! ఈ బిజినెస్ గేమ్ ముందు IPL ఎంత?
-
‘We stand up for BBC’
మన సార్వభౌమత్వాన్నే అవమానిస్తున్న బ్రిటన్ - ఇంతకీ MH 370 విమానం ఏమైంది? నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో ఏముంది?