June 3, 2023

‘జాను’ ఆ మాయ చేస్తుందా?

‘జాను’ ఆ మాయ చేస్తుందా?

కొన్నేళ్లుగా పూర్వ విద్యార్థి సమ్మేళనాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ ట్రెండ్‌ ఓ ఏడాదిగా సాగుతోంది. 2018 అక్టోబరులో వచ్చిన ’96’ అనే తమిళ సినిమా వీటికి ఓ కారణం అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. తమిళంలో వరుస హిట్ల హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఆ సినిమా తమిళనాడులో ట్రెండ్ సెట్టర్‌. 1996 టెన్త్‌ క్లాస్‌ బ్యాచ్‌ 2018లో ఓ చోట కలుసుకుని పాత రోజులు గుర్తు చేసుకుంటారు. అందులో విజయ్‌, త్రిషల అందమైన ప్రేమకథ, అనుకోని పరిస్థితుల్లో వారు విడిపోయిన క్రమంలో పండించిన అద్భుతమైన ఎమోషన్స్‌ కుర్రకారు హార్ట్‌ టచ్‌ చేశాయి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అంటేఈ మూవీ రిలీజ్‌ అయిన తర్వాత తమిళనాడులో పూర్వ విద్యార్థి సమ్మేళనాలు వేల సంఖ్యలో జరిగాయి. ఆ తర్వాత అది మన రాష్ట్రాలకు వచ్చింది. ఈ మధ్య టెన్త్‌ క్లాస్‌ మిత్రులంతా కలుసుకోవడం పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం వీటిన్నిటికీ ఆ సినిమానే ప్రారంభం అనుకోవచ్చు. ఆ తర్వాత ఈ సినిమాని కన్నడలో రీమేక్‌ చేశారు. అయితే విజయ్‌ సేతుపతి మేజిక్‌ చేయలేకపోయారు. ఇప్పుడు శర్వానంద్‌ హీరోగా తెలుగులో ఈ సినిమా రీమేక్‌ అయింది. జాను అని టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఇలాంటి కథలను ఈజీగా హ్యాండిల్‌ చేసే శర్వా, ఎలాంటి పాత్రలోనైనా జీవించే సమంత కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా తెలుగు వారి గుండెలను తడుతుందో లేదో చూడాలి.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *