May 30, 2023

సంపూర్ణ చంద్ర గ్రహణం! ఖగోళ అద్భుతం

సంపూర్ణ చంద్ర గ్రహణం! ఖగోళ అద్భుతం

ఈ శతాబ్దంలోనే అరుదైన, సుదీర్ఘ చంద్ర గ్రహణ అద్భుతాన్ని జూలై 27న చూడబోతున్నాం. జులై 27 రాత్రి నుంచి జులై 28 తెల్లవారుజాము సుమారు 4 గంటల ఈ గ్రహణం కొనసాగనుంది. ఈ చంద్ర గ్రహణం భారత్‌లో తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తుంది. విశేషమేంటంటేఆ మధ్య కనువిందు చేసిన సూపర్‌ మూన్‌ కన్నా పేద్ద చంద్రుడు కనిపిస్తాడు. అది కూడా అరుణ వర్ణంలో. అందుకే ఈ గ్రహణ చంద్రుడిని బ్లడ్‌ మూన్‌ అంటున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల 44 నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో సంపూర్ణ చంద్ర గ్రహణం. శనివారం వేకువ జామున 3.49 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. 4.58 గంటలకు గ్రహణ ప్రభావం పూర్తిగా తొలుగుతుంది. 103 నిమిషాలు అంటే 1 గంట 43 నిమిషాల పాటు ఏర్పడే సుదీర్ఘ చంద్ర గ్రహణం ఇది. ఇదే రోజున అంగారక గ్రహం భూమికి చేరువగా రావడం మరో ఖగోళ విశేషం. ఈ చంద్ర గ్రహణం గురించి ప్రపంచ వ్యాప్తంగా యుగాంతం తరహా నాన్సెన్స్‌ అప్పుడే మొదలైపోయింది. కానీ, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణం విషయంలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో మన పండితులు స్పష్టంగా వివరించారు. సాధారణంగా ఏ గ్రహణం ఏర్పడినప్పుడైనా చిన్న చిన్న రేడియేషన్లు కామన్‌. ఆ రేడియేషన్ల ప్రభావం నుంచి ఎలా తప్పించుకోవాలో మన వాళ్లకి ఖచ్చితంగా తెలుసు. ఇలాంటి ప్రభావాలు గర్భిణులు, కంటి సంబంధ వ్యాధులున్నవారి మీద ప్రభావం ఎక్కువ చూపిస్తాయి కాబట్టి వారు గ్రహణాన్ని చూడకుండా ఉండటమే ఉత్తమం. ఈ గ్రహణాల సమయంలో జీర్ణ శక్తి కూడా కాస్తంత మందగిస్తుంది. కాబట్టి రాత్రి 7.30లోపే భోజనం ముగించడం మంచిదని పండితుల అభిప్రాయం. ఒక వేళ చూసినా పొద్దున్నే విడుపు స్నానం అనే రెమిడీ పురాతన కాలం నుంచి ఉన్నదే. అభ్యంగన స్నానం ఎందుకు చేయమంటారంటేతల స్నానం శరీరాన్ని మళ్లీ యథాస్థితికి తీసుకొస్తుంది.

ఇది ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో వస్తోన్న కేతుగ్రస్త చంద్ర గ్రహణం. అందుకే ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో పాదం, శ్రవణ, ధనిష్ఠ 1,2 పాదాలు, మకర రాశిలో జన్మించిన వారు ఈ గ్రహణాన్ని వీక్షించపోవడమే ఉత్తమమని జ్యోతీష్యులు చెప్తున్నారు. గ్రహణం పట్టు 11 తర్వాత కాబట్టి ఆల్‌మోస్ట్‌ నిద్ర టైం. పెద్ద సమస్య లేదు. నిద్ర లేచే సరికి గ్రహణమే ఉండదు. కాకపోతే ఎప్పుడు కనిపించనంత అద్భుత అరుణ వర్ణ చందమామ కాబట్టి మిగిలిన రాశుల వారు మధ్య రాత్రి దర్శించవచ్చు. మళ్లీ 2123 వరకు ఇలాంటి చంద్ర గ్రహణం లేదట. నమ్మకం ఉన్న వారు పొద్దున్న ఓ విడుపు స్నానం చేసి, శుద్ధి చేసుకుంటే సరి.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *