సైరా టీజర్ దుమ్ము రేపుతోంది. మెగాస్టార్ స్టామినాకి తిరుగులేదనిపిస్తోంది. రెండు రోజుల్లో కోటి వ్యూస్. అయితే.. సైరా ఆలోచన ఇప్పటిది కాదు. చిరు సూపర్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత సైరా ప్లాన్ చేశారు. 2006లో మూవీ షూట్ ప్లాన్ చేశారు కూడా. పరుచూరి బ్రదర్స్ ఆనాడే కథ తయారు చేశారు. ఎందుకో అప్పుడు వర్కవుట్ కాలేదు. దశాబ్దం తర్వాత ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరు కత్తి దూస్తుంటే అభిమానులకు పండగే మరి. 1857లో సిపాయి తిరుగుబాటు జరిగింది. స్వాతంత్ర్యం కోసం జరిగిన తొలి చారిత్ర పోరాటం అదే. కానీ, అంతకు పదేళ్ల ముందే 1846లో రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వాళ్లతో పోరాడి వాళ్లను మూడు చెరువుల నీళ్లు తాగించాడు. చివరికి వీర మరణం పొందినా.. ఆయనే తొలి పోరాట స్వాతంత్రయ యోధుడు. ఈ విషయంలో ఉయ్యాలవాడ చరిత్ర మనకు ఎక్కడా కనిపించదు. ఇలాంటి ఎన్నో విషయాలను రీసెర్చ్ చేసి కథ తయారు చేశామని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పారు. అప్పటి వస్త్రధారణ, ఆనాటి పరిస్థితులను తెరపై చూపించేందుకు చాలా శ్రమించారని టీజర్ చూస్తేనే తెలుస్తోంది.అంతేకాదు ఈ చిత్రంలో వస్త్రాల కోసం కేవలం ఖాదీని మాత్రమే వినియోగించారు. ఈ సినిమా కోసం అందరూ టాప్ టక్నిషియన్స్ పనిచేస్తున్నారు. సెట్ డిజైనర్ రాజీవ్ 1800 సమయంలో అప్పటి పరిస్థితులను అద్భుతంగా సృష్టించారని యూనిట్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో కష్టమైన టాస్క్ డైలాగ్స్. అప్పటి రాయలసీమ భాషా శైలిల డైలాగులుండాలి. ఈ విషయంలో సాయి మాధవ్ బుర్రా ఎలాంటి డైలాగ్స్ పలికించారో స్క్రీన్ మీద చూడాలి. ఇక మెగాస్టార్ నట విశ్వరూపం టీజర్ చూస్తేనే అర్థమైపోతోంది. మరి సైరా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018