వరల్డ్ కప్‌లో అత్యంత పటిష్టంగా ఉన్న భారత్ జట్టుకి నాలుగో గండం గట్టెక్కడం లేదు. రాహుల్ జస్ట్ ఓకే, రోహిత్ కుమ్ముతున్నా, విరాట్ చితక్కొడుతున్నా.. వారి శ్రమంతా నాలుగులో పోసిన పన్నీరవుతోంది. ఇంగ్లండ్‌లో రోహిత్ సెంచరీ, విరాట్ హాఫ్‌సెంచరీతో మంచి పునాది వేశారు. ఆ పునాదిపై ఇటుకలు పేర్చే మంచి మిడిల్ ఆర్డర్ కరవయ్యాడు. అదే ఇంగ్లండ్‌లో ఓటమికి కారణం. ఓపెనర్ శిఖర్ లేకపోడం చాలా పెద్ద డ్యామేజ్ అని తెలుస్తోంది. ఆ ప్లేస్‌ని ఫిల్ చేసేంత టాలెంట్ రాహుల్‌లో కనిపించడం లేదు. విరాట్, రోహిత్ వరకు సజావుగా సాగిపోతున్న బ్యాటింగ్ లైనప్ ఫోర్త్ ప్లేస్‌కి వచ్చాక మొత్తం కొలాప్స్ అవుతోంది. బ్యాటింగ్‌లో మిడిల్ ఆర్డర్ వెన్నెముక. ఒకప్పుడు ఆ ప్లేస్‌లో రాహుల్ ద్రవిడ్, అజర్ లాంటి దిగ్గజాలు ఉండేవారు. ఆ తర్వాత యువరాజ్, ధోని దుమ్ములేపేవారు. 2011 వరల్డ్‌కప్ ఛేజింగ్‌లో యూవీ, ధోనీల పాత్రే కీలకం అన్న విషయం మర్చిపోకూడదు. మిడిల్ ఆర్డర్ బలంగా ఉంటేనే గెలుపు ఈజీ. ఇప్పుడెందుకో నాలుగు తడబడుతోంది. విజయ్ శంకర్ ఆశ నిరాశ చేశాడు. రిషబ్ పంత్ బ్యాటింగ్ వరకు ఓకే గానీ… మిడిల్ ఆర్డర్‌ని గాడిలో పెట్టెంత ట్యాలెంట్ కనిపించడం లేదు. మిడిల్ ఆర్డర్‌లో మంచి స్కోరు ఇస్తేనే… హార్దిక్ పాండ్యా లాంటి డాషింగ్ బ్యాట్స్‌మెన్‌కి ఫినిషింగ్ ఈజీ అవుతుంది. అందుకు నాలుగులో చాలా నిలకడ అవసరం. ఆ నిలకడ గతంలో ధోనీ చూపించాడు. కానీ ఇప్పుడు ఏమైందో గానీ… ధోనీ దూకుడు తగ్గింది. మునుపటి వేగం లేదు. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పాక్‌తో విధ్వంసం సృష్టించిన టీం ఇండియా మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో స్లో అవుతోంది. నిజానికి 330 స్కోరుని ఇప్పుడున్న టీం ఈజీగా ఛేజ్ చేయగలదు. కానీ, ఫోర్త్ ప్లేస్ తడబాటు మొత్తం నాశనం చేస్తోంది. అదిరిపోయే హిట్టింగ్ చేసే దినేశ్ కార్తీక్‌ని ఎందుకు దూరం పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి. చివరి బంతికి కూడా సిక్స్ కొట్టి గెలిపించే సత్తా దినేశ్‌కి ఉంది. షమీని కూడా ముందు అలానే అనుకున్నారు. కానీ ఇప్పుడు… షమీ బౌలింగ్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. ఆలస్యంగా వచ్చినా… భారత్ టాప్ బౌలింగ్ ప్రదర్శన అతనిదే. ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ విషయంలో సెలెక్టర్లు రిస్క్ తీసుకుంటున్నారు. విజయ్ శంకర్ విషయంలో ఫెయిల్, రిషబ్ పంత్ కూడా ఫోర్త్‌కి సరిపోడేమో అనిపిస్తోంది. అక్కడ అనుభవజ్ఞుడు ఉండాలి. ఆ అనుభవం దినేశ్ కార్తిక్‌కి ఉంది. ఇంగ్లండ్ మ్యాచ్‌లో బ్యాటింగ్ పిచ్‌ని ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బాగా ఉపయోగించుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ కాస్త మందగించినా… దాదాపు 300 వరకు భారత్ వెళ్లగలిగింది. అంటే మిడిల్ ఆర్డర్ కాస్త గట్టిగా ఉంటే… ఛేజింగ్ ఈజీనే. బంగ్లాతో మ్యాచ్ ఇంతకు ముందులా కాదు. వాళ్లు కూడా 300 స్కోరుని ఈజీగా ఛేదిస్తున్నారు. అక్కడ తడబడితే టీఇండియా చిక్కుల్లో పడుతుంది. సెమిస్ బెర్త్‌ని ఆల్‌మోస్ట్ ఖాయం చేసుకున్నా టీం ఇండియా… వెన్నెముకలాంటి మిడిల్ ఆర్డర్‌లో ముఖ్యంగా నాలుగో ప్లేస్‌లో అనుభవజ్ఞుడిని ఎంపిక చేస్తే బెటర్ అన్న మాటే వినిపిస్తోంది.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018