September 21, 2023

IPL ఉచిత ప్రసారాలు. ఈ మాట అభిమానులకు యాహూ అనిపించేదే కానీ అక్కడే ఉంది అసలు కిటుకు. రిలయెన్స్‌ అంటేనే వ్యాపారం. అందులోనూ ముఖేష్‌ అంబాని 5 పైసలు కూడా వదులుకోడు. పక్కా బిజినెస్‌ మ్యాన్‌ కదా.ముందు ఇలాగే వందకి, రెండొందలకీ జియోని అలవాటు చేశారు. ఇప్పుడు పెంచినా కడుతున్నారు. రిలయెన్స్‌ అంటే నమ్మకం. మన నమ్మకమే వారికి వ్యాపారం. ఇప్పుడు IPL విషయంలోనూ ఇదే ఫార్ములా. బట్‌ ఇది వ్యాపారం.. ఇదే కొనేవాడికి, అమ్మేవాడికి మధ్య డీల్‌ అంతే. ఇక్కడ ఎవరినీ తప్పు పట్టలేం. ఎవరి గేమ్‌ వారిదే. ఖర్చు ఎంత పెట్టాలి అనేది వినియోగదారుడి ఇష్టం.

IPL ప్రసారాలను ఉచితంగా అందిస్తాం అని ముఖేష్ అంబాని చెప్తున్నాడు కదా. IPL బ్రాడ్‌క్యాస్టింగ్ రైట్స్‌ ధర ఎంతో తెలుసా? 2.7 బిలియన్‌ డాలర్లు. అంటే 270 కోట్ల డాలర్లు. ఇంత డబ్బు పెట్టి మనకు ఫ్రీగా ఎందుకిస్తారు? ఒక పెద్ద ఆఫర్‌ని పేద్ద.. పేద్ద అక్షరాల్లో రాసి… కింద భూతద్దంలో చూసినా సరిగ్గా కనిపించని చిన్న అక్షరాల్లో ‘కండీషన్స్‌ అప్లై’ అని రాస్తారు. ఇదీ అలాంటిదే. మార్కెట్‌లో ప్రతీదీ డబ్బులిచ్చే కొనుక్కోవాలి. ఫ్రీగా ఎవరూ ఇవ్వరు. కార్పొరేట్‌లో ‘ఫ్రీ’ అనే మాట కూడా బిజినెస్‌ స్ట్రాటజీనే. మరి జియో ఉచిత ప్రసారాల్లో ముఖేష్‌కి వచ్చే లాభమేంటి అంటారా? ఇది IPLని మించిన ఆట. జియో సినిమాలో IPL ఫ్రీ అంటున్నారు కాబట్టి.. ఫస్ట్‌ అందరూ జియో ‘నెట్‌’ వర్క్‌లోకి వస్తారు. ఇప్పటికే మిగిలిన నెట్‌వర్క్‌లు జియో ధాటికి అల్లాడుతున్నాయి. ఈ దెబ్బకి క్లీన్‌బౌల్డే. టెలికాంలో జియో నంబర్‌ వన్‌ అయితే.. ఇక జియో ఆడిందే ఆట కదా. పైగా జియో ఇచ్చే ఇంటర్‌నెట్‌ మీద జనం పాజిటివ్‌గానే ఉన్నారు. జియో సిమ్‌ లేని ఫోన్లు ఎక్కడున్నాయి చెప్పండి? IPLకి విపరీతమై ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది. కోట్లలో వీక్షకులు. ఎక్కువ మంది మొబైళ్లలో చూసేవారే. వారిలో మాక్సిమమ్‌ జియోకి వస్తారు. ఒక్క రూపాయి మార్కెటింగ్‌కి ఖర్చు పెట్టకుండా కోట్లమంది సబ్‌స్క్రైబర్స్‌ అంటే ఎంత పెద్ద గేమ్‌ ఇది. దటీజ్‌ ముఖేష్‌ అంబానీ. ఇంకేం IPL మధ్యలో వచ్చే యాడ్స్‌ రేట్లు భారీగా పెంచుతారు. సబ్‌స్క్రైబర్స్‌ ప్లస్‌ యాడ్స్‌ ఇన్‌కమ్‌ వీటి ముందు జియో పెట్టిన పెట్టుబడి జస్ట్‌ ఒక నంబర్‌ అంతే. ఇక్కడితో ఆగలేదు IPL మ్యాచెస్‌ని హై క్వాలిటీలో ఇస్తాం అని జియో సినిమా ప్రకటించింది. SD, HD, 4K క్వాలిటీలో మ్యాచ్‌ చూడొచ్చని పబ్లిసిటీ చేస్తోంది. ఇప్పటికే చాలా మంది వ్యూయర్స్‌ HD కి అలవాటు పడిపోయారు. 4Kకి షిఫ్ట్ అవుతున్న వారి సంఖ్యా ఎక్కువే. ఇందులో HD అయితే ఒక మ్యాచ్‌కి 10.6 GB, అలాగే 4K అయితే పర్ మ్యాచ్‌ 26.6 GB ఖర్చు అవుతుందని జియో సినిమానే లెక్కలు వేసి చెప్పింది. ఈవెన్‌ SD లో చూసినా 3.6 GB అవుతుందని అంచనా. ప్రస్తుతం ఉన్న జియో రెగ్యులర్ ప్యాకేజ్‌ రోజుకి 1 నుంచి 2 GB డాటా వస్తోంది. మరి మ్యాచ్‌ని మినిమమ్‌ HD లో చూడాలన్నా కూడా 10.6 GB కావాలి. అంటే ప్లాన్‌ మారాలి. లేదంటే ఆ రోజు మ్యాచ్‌కి డాటా ప్లాన్‌ కొనుక్కోవాలి.

అప్పుడే IPL స్పెషల్‌ డాటా ప్యాకేజ్‌ల యాడ్స్‌ కూడా కనిపిస్తున్నాయి. ఇది స్టేడియంలో కొనే టికెట్‌ రేట్‌ రేంజ్‌లోనే ఎలాగూ ఉంటుంది. ఇక్కడే కొన్ని వందల కోట్ల బిజినెస్‌ జరిగిపోయింది. ఇన్ని వందల కోట్ల బిజినెస్‌ జరగాలంటే జనాలు జియోలోకి రావాలి కదా. రావాలంటే గేట్లు తెరిచేసి ఫ్రీగా రమ్మంటేనే వస్తారు కదా. ఆ గేటు తర్వాత మరో మూడు గేట్లు ఉన్నాయి. అందులో చాలా బాగా చూడాలంటే ఇంత, బాగా చూడాలంటే ఇదిగో ఇంత, నార్మల్‌గా చూడాలంటే ఇంత అని మనతోనే కొనిపిస్తారన్నమాట. దీని కన్నా IPL సీజన్‌కి ఒక రేటు పెట్టేస్తేనే తక్కువ ఖర్చవుతుంది. బట్‌ అది కస్టమర్‌కి లాభం… వ్యాపారికి కాదు. ఈ బిజినెస్‌ ఆట ముందు IPL ఎంత?

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *