June 7, 2023

అతనంటే భయమా? అభద్రతా భావమా?

అతనంటే భయమా? అభద్రతా భావమా?

ఇంకా ఎన్నికల బరిలో పవన్‌ జనసేన పూర్తిగా కనిపించడం లేదు. పవన్‌ పార్టీలో ఇంకా పెద్ద నాయకులెవరూ లేరు. అలాంటప్పుడు ఏ పార్టీ అయినా పవన్‌ని టార్గెట్‌ చేయడమెందుకు..? ఎందుకంటే ఆయనకు అదిరిపోయే ఫాలోయింగ్‌ ఉంది. విపరీతంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. సినిమాల్లో ఆయన ఒక మేనియా. ఇవన్నీ ఓట్లుగా మారుతాయా లేదా అన్నది సెకండ్‌ ఇష్యూ. ఇక్కడో సైకలాజికల్‌ పాయింట్‌ ఉంది. గొడవ పడాలి అనుకున్నప్పుడుఎదుటి వారిలో ఏ లోపాలు కనిపించకపోతేవ్యక్తిగత దూషణలకు దిగుతుంటారు. ఇది కామన్‌. పవన్‌ ఇంకా రాజకీయ పార్టీ దశలో ఉన్నారు. రాజకీయ ప్రలోభాలు లేదా అవినీతిని ఎత్తి చూపేందుకు అక్కడేమీ లేదు. కానీజనసేన పార్టీ హిట్టా, ఫ్లాపా..? ఆ పార్టీ ఏ రకంగా రాజకీయ సమీకరణాలను మారుస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చిక్కడం లేదు. ఆయన వెనుక బీజేపీ ఉందా…? మరి కమ్యునిస్టులతో స్నేహం ఎందుకు..? వైరం ఉన్న టీడీపీతోనే జనసేన కలుస్తుందా? ఇలాంటివెన్నో సమాధానం దొరకని ప్రశ్నలు పవన్‌ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ విశ్లేషణలన్నీ గాలిలో బాణాలే. అందులో ఏది తగులుతుందో.. మరి కొన్నాళ్లు ఆగితేనే తెలీదు. అంతకు ముందు పవన్‌ మాట్లాడే విషయాల్లో క్లారిటీ మిస్సయ్యేది. ఇప్పుడుసూటిగా లోపాలు ఎండగడుతున్నాడు. అదీ రాజకీయ పరమైన ప్రశ్నలే.. వ్యక్తిగత దూషణల్లేవు. ఇందులో తప్పేముంది? విమర్శకు ప్రతివిమర్శ సమాధానం. హోదా విషయంలో పాలక, విపక్షాలు పూర్తిగా నీరు గారిపోయాయి. అందరూ మోడీ వ్యూహాల ముందు తేలిపోయారు. 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వొద్దని చెప్పిందని కేంద్రం అదే పట్టుకుని కూర్చుంది. అలా నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఎంపీ సీఎం రమేష్ రాజ్యసభలో చెప్పారు. 14వ ఆర్థిక సంఘంలో లొసుగులున్నాయని క్లారిటీగా తెలిసిప్పుడు వాటి మీదే పోరాడొచ్చు కదా. ఇలాంటి విషయాలే అనుమానాలు తెప్పిస్తాయి. అంటే ఆర్థిక సంఘంలో హోదా ఇవ్వొద్దు అన్న లైన్‌ లేదా? ఒక వేళ ఉంటే ఎలా ఇవ్వాలో ఉందా? మొత్తానికైతే ఏదో కిరికిరి కనిపిస్తోందన్న అనుమానాలైతే ప్రజల్లో ఉన్నాయి. విపక్షానికి ఇంతకన్నా అవకాశమేముంది ? ఆ లొసుగులను ప్రజలకు చూపించి… ‘ఇదిగో హోదా వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వమే ప్రయత్నించడం లేదని..’ ప్రజలకు చెప్పొచ్చు కదా. ఇదంతా వదిలేసి జనసేన పార్టీని నిందిస్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు పవన్‌ గురించి వ్యక్తిగత ఆరోపణలు చేయడంహుందాతనం కాదన్నది వైసీపీ వర్గాల నుంచే వస్తున్న అభిప్రాయం. వ్యక్తిగత జీవితాన్ని తవ్వితే డిఫెన్స్‌లో పడిపోతారన్న సిద్ధాంతం అందరికీ వర్తించదు. ఆల్రెడీ మనం డిఫెన్స్‌లో పడ్డాకే వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేస్తుంటాం. తెలుగు దేశం శ్రేణుల పరిస్థితీ ఇదే. పవన్‌ని విమర్శించేందుకు సమయాన్ని బాగానే కేటాయిస్తున్నారు. బీజేపీ గొడుగు కింద పార్టీ అంటారు. వైసీపీతో దోస్తీ ఉందంటారు. ఒకప్పుడు తెలుగు దేశం కోసం తిరిగినప్పుడు, మద్దతిచ్చినప్పుడుఆ పలకరింతలు, పులకరింతలు.. ఇవేవీ గుర్తు లేవు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది కాబట్టిజనసేన వైరి పక్షం అయిపోయింది. రాజకీయాల్లో పవన్‌ వ్యూహాలేమైనా రచిస్తే వాటికి ప్రతి వ్యూహాలతో ముందుకెళ్లాలి. ఏమైనా అంటే హోదా గురించి పోరాటం చేస్తే ఆయనెక్కడున్నారు అంటారు. పొలిటికల్‌ పవర్‌ వల్లే కానిది పవర్‌ స్టార్‌ వల్ల ఏమవుతుంది..? పవన్‌ ఆరు నెలలకు ఓ సారి వచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టినప్పుడో, ట్వీటినప్పుడో ఏ పార్టీకీ కంగారు లేదు. ఇప్పుడు తరచుగా కనిపిస్తుండేసరికి ఎందుకీ కంగారు? ఓట్లు భారీగా చీల్తాయి అనే భయమా? లేకా జనసేన సునామీగా ఎక్కడ మారుతుందో అన్న అభద్రతా? మొత్తానికి అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముట్టి పవన్‌ మైలేజ్‌ బాగానే పెరుగుతోంది. ఇది ఆయనకు ఓ రకంగా ప్లస్సే.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *