June 7, 2023

జనసేన జోష్‌- 32 మందితో ఫస్ట్‌ లిస్ట్‌

జనసేన జోష్‌- 32 మందితో ఫస్ట్‌ లిస్ట్‌

మొత్తానికి జనసేన జోరందుకుంది. ఆవిర్భావ దినోత్సవం నాడే తొలి జాబితా విడుదల చేసి పవర్ చూపించింది. అనుకున్న ప్రకారం క్లీన్‌ ఇమేజ్‌ ఉన్నవారితోనే జాబితా విడుదల చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటాక 32 మంది శాసన సభ అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్ట్‌ ప్రకటించింది. నలుగురు పార్లమెంటు అభ్యర్థుల పేర్లు కూడ ఖరారు చేశారు. ఆవిర్భావ దినోత్సవం నాడు లిస్ట్‌ విడుదల చేయడం జన సైనికుల్లో జోష్‌ నింపింది. రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ, అమలాపురం నుంచి డిఎంఆర్‌ శేఖర్‌ ఎంపీ అభ్యర్థులను పవన్‌ ముందే ప్రకటించారు. విశాఖ సీటు కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న గేదెల శ్రీనుబాబు ఆశ నెరవేరింది. ఇక అనకాపల్లి నుంచి చింతల పార్ధ సారథి ఎంపీ అభ్యర్ధిగా పవన్ ప్రకటించారు. జనసేనను తన అనుభవంతో నడిపిస్తున్న నాదెండ్ల మనోహర్‌ తెనాలి నుంచి, తోట చంద్రశేఖర్‌ గుంటూరు వెస్ట్‌ శాసన సభ స్థానం నుంచి పోటీ చేస్తారు. జనసేన నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు పవన్‌. ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో 8 మంది కొత్త వారు ఈ సారి బరిలో దిగేందుకు అవకాశం లభించింది.. ఇది నిజంగా ట్రెండ్‌ సెట్టింగే.

ఇక జనసేన విడుదల చేసిన ఫస్ట్‌ లిస్ట్‌ ఇదే:

1. య‌ల‌మంచిలిసుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌
2.
పాయ‌క‌రావుపేటన‌క్కా రాజ‌బాబు
3.
పాడేరు ప‌సుపులేటి బాల‌రాజు
4.
రాజాండాక్టర్‌ ముచ్చా శ్రీనివాస‌రావు
5.
శ్రీకాకుళంకోరాడ స‌ర్వేశ్వర రావు
6.
ప‌లాస‌కోత పూర్ణ చంద్రరావు
7.
ఎచ్చెర్ల‌బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధన్‌ (జ‌నా)
8.
నెల్లిమ‌ర్ల‌లోకం నాగ‌మాధ‌వి
9.
తునిరాజా అశోక్‌బాబు
10.
రాజ‌మండ్రి సిటీకందుల దుర్గేష్‌
11.
రాజోలురాపాక వ‌ర‌ ప్రసాద్‌
12.
పి.గ‌న్నవరంపాముల రాజేశ్వరి
13.
కాకినాడ సిటీముత్తా శ‌శిధ‌ర్
14.
అన‌ప‌ర్తిరేలంగి నాగేశ్వరరావు
15.
ముమ్మిడివ‌రంపితాని బాల‌కృష్ణ
16.
మండ‌పేట‌వేగుళ్ల లీలాకృష్ణ
17.
తాడేప‌ల్లిగూడెంబొలిశెట్టి శ్రీనివాస్
18.
ఉంగుటూరున‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌
19.
ఏలూరురెడ్డి అప్పల‌నాయుడు
20.
తెనాలినాదెండ్ల మ‌నోహ‌ర్‌
21.
గుంటూరు వెస్ట్‌ తోట చంద్ర శేఖ‌ర్‌
22.
ప‌త్తిపాడురావెల కిషోర్‌బాబు
23.
వేమూరుడాక్టర్‌ ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌
24.
న‌ర‌స‌రావుపేట‌స‌య్యద్‌ జిలానీ
25.
కావ‌లిప‌సుపులేటి సుధాక‌ర్‌
26.
నెల్లూరు రూర‌ల్‌చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి
27.
ఆదోనిమ‌ల్లిఖార్జున‌రావు (మ‌ల్లప్ప‌)
28.
ధ‌ర్మవ‌రంమ‌ధుసూద‌న్‌ రెడ్డి
29.
రాజంపేట‌ప‌త్తిపాటి కుసుమ‌ కుమారి
30.
రైల్వే కోడూరుడాక్టర్‌ బోనాసి వెంక‌ట‌సుబ్బయ్య
31.
పుంగ‌నూరుబోడే రామ‌చంద్ర యాద‌వ్
32.
మ‌చిలీప‌ట్నంబండి రామ‌కృష్ణ

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *