June 3, 2023

జనసేనాని పవర్‌ స్ట్రోక్‌

జనసేనాని పవర్‌ స్ట్రోక్‌

జనసేన పార్టీ ఇప్పుడో ప్రభంజనం. పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు.. పక్కా ప్లానింగ్‌లో జనంలో చొచ్చుకుపోయింది. ఆవిర్భావ సభతో జనసేన పవరేంటో చూపించింది. అభ్యర్థుల ప్రకటన నుంచి మేనిఫెస్టో వరకు అన్నిటా ట్రెండ్‌ సెట్‌ చేశారు పవన్‌. పవన్ కల్యాణ్‌ జోరు పెంచారు. లేటు లేటు అనుకుంటే లేటెస్ట్‌గా వచ్చి ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు. రాజమండ్రిలో జరిగిన ఆవిర్భావ సభ జనసేనకు కీలకమైన మలి అడుగు. ఆ రోజే తొలి జాబితా ప్రకటించి రాజకీయ వర్గాలు పవర్‌ఫుల్‌ స్ట్రోక్‌ ఇచ్చారు. ఆ తొలి జాబితా ఎప్పటి నుంచో పవన్‌ చెప్తున్న మాటను కూడా నిలబెట్టుకున్నారు. 32 శాసన సభ స్థానాలకు, 4 లోక్‌ సభ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థులందరూ క్లీన్‌ ఇమేజ్‌ ఉన్నవారే. ఎవరిపైనా అవినీతి ఆరోపణలు లేవు. ఇలాంటి జాబితా తయారు చేయడానికే పవన్‌ని టైం పట్టింది. వెతికి, వెతికి.. శోధించి శోధించిజనం మెచ్చే నాయకులను ఎంపిక చేసుకున్నారు. ఇక మిగిలిందిప్రజల ఓటు. జాబితా విడుదలలో కూడా కొత్త ఒరవడి సృష్టించారు పవన్‌ కల్యాణ్‌. ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉన్నవారు జనసేన పార్టీకి అప్లై చేయొచ్చనిప్రకటించారు. ఆ ప్రకటనకు భారీ స్పందనే వచ్చింది. ఎన్నో అప్లికేషన్లు వచ్చాయి. వాటిలో స్క్రూటినీ చేసి నాయకత్వ లక్షణాలున్న 8 మందిని ఈ 32 మంది జాబితాలో ఎంపిక చేశారు. ఇండియన్‌ పొలిటికల్‌ హిస్టరీలోనే ఈ విధానం కొత్త ట్రెండ్‌ అని చెప్పొచ్చు. మిగిలిన అభ్యర్థుల జాబితాలోనూ ఇంకా కొత్త నాయకులు ఉంటారని అనుకోవచ్చు. అందుకే పవన్‌ నాయకుల ఎంపికలో ఆచితూచి అడుగేశారు. ఎంతో మంది పెద్ద పెద్ద లీడర్లు జనసేన శిబిరంలో అడుగు పెట్టాలని తహతహలాడారు. కానీ పవన్‌ చాలా మందిని రిజెక్ట్‌ చేశారు. వారిలో గంటా, ఆమంచి, అవంతి, బుట్టా రేణుక లాంటి నేతలు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఎంతో మంది నేతలు పవన్‌ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ సీటు దక్కని వారు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. అవినీతి పరులకు, స్వార్థ రాజకీయ నాయకులకు జనసేనలో ఎంట్రీ లేదని పవన్‌ ముందే చెప్పేశారు. ఆ మాట మీద నిలబడ్డారు. పవన్‌ వ్యూహం కూడా అదిరిపోయింది. తనకు బాగా పట్టున్న గోదావరి జిల్లాలపై గట్టిగా కాన్‌సన్‌ట్రేట్‌ చేశారు. విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో గోదావరి జిల్లాల్లో కచ్చితంగా గెలిచే అభ్యర్థులున్నారు. పవన్‌ జాబితా విడుదల చేశాకటీడీపీ, వైసీపీల్లో కంగారు మొదలైంది. రాత్రికి రాత్రి టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి వచ్చింది. సామాజిక వర్గాల అంచనాల్లో కూడా పవన్‌ఎక్స్‌పీరియన్స్‌డ్‌ పొలిటీషియన్‌లా ఊహించారు. శ్రీకాకుళంలో ఇప్పటి వరకు వైశ్యులకు ఏ పార్టీ సీటివ్వలేదు. పవన్‌ కోరాడ సర్వేశ్వర్రావుకి సీటు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. శ్రీకాకుళంలో కచ్చితంగా ఈ సారి ఓటు బ్యాంకు భారీగా చీలబోతోంది. ఇలా అన్ని చోట్ల పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ పెర్‌ఫెక్ట్‌గా సెట్‌ చేశారు. ముఖ్యంగా తనకు బాగా పట్టున్న ఐదు జిల్లాలపై మేజర్‌ లుక్‌ వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, తూర్పుపశ్చిమ గోదావరి జిల్లాల్లో మంచి అభ్యర్థులను ఎంపిక చేయడంలో సక్సెస్‌ అయ్యారు. అటు లోక్‌సభ స్థానాల్లో నలుగురూ గెలుపు గుర్రాలే. అమలాపురం డీఎంఆర్‌ శేఖర్‌కి స్థానికంగా మంచి పలుకుబడి ఉంది. ఓఎన్‌జీసి అధికారిగా పనిచేసిన ఆయన చేసిన స్వచ్ఛంద సేవలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఈ సారి ఆయన గెలుపు గ్యారంటీ అని అమలాపురం ప్రజలు అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆకుల సత్యనారాయణ కుటుంబానికి ప్రత్యేకమైన గౌరవం ఉంది. బీజేపీ సీనియర్‌ నేతగా, రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యేగా ప్రజల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఆకుల సత్యనారాయణపై ఏనాడు ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. ఈ సారి రాజమండ్రి ప్రజలు ఆకుల సత్యనారాయణ గెలుపు గ్యారెంటీ అంటున్నారు. విశాఖపట్నం గేదెల శ్రీనుబాబుకష్టపడి పైకొచ్చిన వ్యక్తి. మిస్టర్‌ క్లీన్‌గా బరిలో దిగుతున్నారు. సొంత లాభం కొంత మానుకుని.. తిత్లీ తుపాను బాధితులకు భారీగా సాయమందించారు. వందల కోట్ల ఆస్తులున్నా అతి సాధారణంగా కనిపించే శ్రీనుబాబు ఈ సారి కచ్చితంగా గెలిచే ఛాన్సస్‌ ఉన్నాయి. అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతల పార్ధసారధి ఇంకమ్‌ ట్యాక్స్‌ కమిషనర్‌గా పని చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ నాయకుడైతే వారికి సమస్యల మీద అవగాహన ఎక్కువ ఉంటుంది. ఈ కోణంలోనే పవన్‌ అన్ని చోట్ల క్లీన్‌ ఇమేజ్‌ ఉన్నవారినే ఎంచుకున్నారు. అభ్యర్థుల ఎంపికలోనే కాదు, ఆవిర్భావ సభలో ఆయన ప్రకటించిన మేనిఫేస్టో.. మిగిలిన పార్టీలకు మాస్టర్‌ స్ట్రోక్‌. మిగిలిన పార్టీలు ప్రజలకు ఉచితాలతో గాలాలు వేస్తేపవన్‌ నేల విడిచి సాము చేయకుండా ప్రజలకు ఏవి అవసరమో అవే ప్రకటించారు. అవి కూడా ప్రజలకు భారీ స్థాయిలో మేలు చేసే ప్రకటనలు చేశారు. వాటిలో ముఖ్యమైనవిరైతులకు ఏటా ఎకరాకు 8 వేల రూపాయలు పూర్తి సాయం. సేద్యం విలువ తెలిసిన రైతు పవన్‌ కల్యాణ్‌. ఎకరాకు ఎంత పెట్టుబడి ఇస్తే అన్నదాత గట్టెక్కుతాడో ఆయనకు తెలుసు. అందుకే ఈ ప్రకటనను అద్భుతం అంటున్నారు అందరూ. రైతు రక్షక భరోసా పథకం కింద 60 ఏళ్లు పైబడిన సన్న, చిన్నకారు రైతులకు నెలకు 5 వేల పెన్షన్‌. ప్రభుత్వ ఉద్యోగులే రైతులూ ప్రజా సేవకులే. వారు రిటైర్‌ అయ్యాక పెన్షన్‌ వద్దా? అందుకే రైతు పెన్షన్‌ పథకం సంచలనం అనే చెప్పాలి. ప్రాజెక్టులు, రహదారుల కోసం భూములు త్యాగం చేసిన రైతులకు 2013 భూసేకరణ చట్టం కింద పరిహారమిస్తానంటోంది జనసేన. ఉభయ గోదావరి జిల్లాల్లో 5 వేల కోట్లతో గ్లోబల్‌ మార్కెట్‌, ప్రతీ మండలంలో కోల్డ్‌ స్టోరేజెస్‌ ఇవి రైతులకు భారీగా మేలు చేస్తాయి. కార్పొరేట్‌ పాఠశాలల ఫీజుల దందాలో ఎంతో మంది తెలివైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. వారిని దృష్టిలో పెట్టుకునే పైసా కూడా ఫీజు లేకుండావిద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, అలాగే ఈ పాసుల గోల లేకుండా కాలేజీ ఐడీ కార్డు చూపిస్తే చాలు ఉచిత ప్రయాణం.. విద్యార్ధులకు వరాలే. చదువు తర్వాత ప్రధాన సమస్య ఉపాధి. అన్ని పార్టీ ఏవేవో కబుర్లు చెప్పాయి.. కానీ ఆచరణలో అందరూ ఫెయిలయ్యారు. అందుకు కారణం విజన్‌ లేకపోడం. కానీ పవన్‌ విజన్‌ బాగుంది. ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. వీటి వల్ల లక్షల మందికి ఉపాధి లభించే దారి దొరుకుతుంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. ఎవరూ లంచం అడగని వ్యవస్థను తీసుకొస్తామని పవన్‌ స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. ఇంకో ముఖ్యమైన ప్రకటన ఆకట్టుకుంది. డొక్కా సీతమ్మ పేరుతో ఉచిత భోజన క్యాంటీన్లు. ప్రజా ధనంతో ఏర్పాటు చేస్తున్న ఈ క్యాంటీన్లకు ఇప్పుడున్న ప్రభుత్వాలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో పెడుతున్నారు. పవన్‌ మాత్రం ఆంధ్రుల అన్నపూర్ణగా కొన్ని లక్షల మందికి అన్నదానం చేసిన అమ్మ డొక్కా సీతమ్మ పేరు పెట్టడాన్ని అందరూ హర్షిస్తున్నారు. మరో ముఖ్యమైన హామీ.. ఆరోగ్య బీమా. కార్పోరేట్‌ హాస్పటల్స్‌లో కాలు పెట్టలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రతీ కుటుంబాని 10 లక్షల ఆరోగ్య బీమా.. అద్భుతమైన వరం. వీటితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తామన్న మాట రూరల్‌ హెల్త్‌ డెవలప్‌మెంట్‌కి మంచి మలుపు. ఇది ఇంతకు ముందు చాలా ప్రభుత్వాలు చెప్పినా ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోని హామీగానే మిగిలిపోయింది. మహిళా రక్షణకు కఠిన చట్టాలు, వారికి 33 శాతం రిజర్వేషన్లకు కృషి, స్థానిక ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు ప్రాధాన్యం, మహిళలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, సంక్రాంతికి చీరల పంపిణీ ఇవి కామన్‌గానే కనిపించినామహిళా ఉద్యోగుల కోసం శిశు సంరక్షణ కేంద్రాలు మంచి ఆలోచన. ఇలా పవన్‌ ప్రకటించిన మేనిఫేస్టో ఎక్కడా నేల విడిచి సాము చేయలేదు. ఎక్కడా అదిస్తా ఇదిస్తా అని ప్రగల్భాలు లేవు. ఉచిత పథకాలు లేవు. విద్య, వైద్యం, సేద్యం ఈ మూడు అంశాలే ప్రజల జీవన ప్రమాణాలను, తలసరి ఆదాయాలను పెంచే మూలాలు. వాటి మీదే పవన్‌ మేజర్‌ ఫోకస్‌ చేశారు. మంచి పథకాలతో గుడ్‌ మేనిఫేస్టో అన్న పేరు వినిపిస్తోంది. ఇలా అన్నిటిలో ట్రెండ్‌ సెట్‌ చేస్తున్న జనసేన.. ఎన్నికల్లో కూడా ప్రభజనం సృష్టించి ట్రెండ్‌ సెట్‌ చేస్తుందా? రిజల్ట్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *