
1993లో జెంటిల్‌మేన్ సినిమాతో శంకర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సోషల్ ఇష్యూకి కమర్షియల్ హంగులు అద్ది… సూపర్ హిట్ ఫార్ములాను సృష్టించాడు శంకర్. ఇండియన్ కేమరూన్‌గా సూపర్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అదే పంథాలో 1996లో వచ్చిన భారతీయుడు మరో సంచలనం. లంచం, అవినీతిపై ఓ స్వతంత్ర్య సమరయోధుడు చేసిన ఫైట్ ఆడియన్స్‌కి స్టన్నింగ్. అలాగే 1999లో వచ్చిన ఒకే ఒక్కడు కూడా. ఒక రోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్ యూత్‌పై, పాలటిక్స్‌పై చాలా ప్రభావమే చూపించింది. ఇక అపరిచితుడు మూవీ అయితే ఇప్పటికీ సన్సేషనే. ఇలా శంకర్ తీసినవి తక్కువ సినిమాలే అయినా… వేటికవే స్పెషల్. కానీ… కొన్నేళ్లుగా ఆయన దగ్గర నుంచి ఒక ట్రెండింగ్ హిట్ లేదు. రోబో తర్వాత వరుసగా నిరాశపరిచారు శంకర్. తనకు అచ్చొచ్చిన సోషల్ కాన్సెప్ట్‌ని పక్కన పెట్టి, హీరో వర్షిప్‌తో తీసిన సినిమాలను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. శివాజీ అలాంటిదే, విక్రమ్ హీరోగా భారీ ఎక్స్‌పక్టేషన్‌తో వచ్చిన ఐ సినిమా కూడా బిగ్ డిజాస్టర్. రోబో 2 కూడా నష్టాలే మిగిల్చింది. ఇప్పుడు భారతీయుడు 2లో శంకర్ తన ఓల్డ్ మేజిక్‌ని రిపీట్ చేస్తాడో లేదో చూడాలి. అటు కమల్ పరిస్థితి అంతే.. విశ్వరూపం-2 డిజాస్టర్. శంకర్‌కి, కమల్‌కి ఇద్దరికీ పార్ట్ 2లు అచ్చి రాలేదు. ఎన్నో ఏళ్ల నుంచి నలుగుతున్న ఈ శంకర్–కమల్ కాంబో రకరకాల కారణాలతో స్లో స్లోగా నడుస్తోంది. ఎప్పుడు పూర్తవుతుందో కరెక్ట్ టైం కూడా చెప్పలేకపోతున్నారు. కమల్ రాజకీయాలతో బిజీ అవడం, శంకర్‌కి బడ్జెట్ ప్రాబ్లెమ్స్‌తో… భారతీయుడు-2 కొన్నాళ్లు సందిగ్ధంలో పడింది. మొత్తానికి మళ్లీ పట్టాలెక్కింది. స్పీడ్‌గా షూటింగ్ జరుగుతోందట. భోపాల్‌లో భారీ ఫైట్‌కి ప్లాన్ చేశాడు శంకర్. ఆ ఫైట్‌కి ఏకంగా 40 కోట్లు ఖర్చు పెడతారని టాక్. 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లపై ఈ ఫైట్ సీన్ ఉంటుందని అంటున్నారు. రోబో టూలో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించారు. భారతీయుడు 2లో అనిల్ కపూర్ విలన్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ మూవీ అప్పటి భారతీయుడిలా మళ్లీ సంచలనం సృష్టిస్తుందా లేదా అన్నది… వెయిట్ అండ్ సీ.