తెలుగు చలన చిత్ర చరిత్రలో వెండి వెన్నెలగా ఎప్పటికీ గుర్తుండిపోయే నటి మహానటి సావిత్రి. సావిత్రి బయోపిక్ మహానటి సినిమా కూడా తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేదు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. నాగ్ అశ్విన్ అద్భుతంగా రూపొందించిన ఆ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు జేజేలు పలికారు. ఇప్పుడా చిత్రం ఆస్ట్రేలియాలో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేయబోతోంది. అంతే కాదు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుల కేటగిరీల్లో నామినేట్ అయింది. ఉత్తమ సహాయ నటి కేటగిరీలో సమంత… సంజూ చిత్రంలో మంచి నటన ప్రదర్శించిన విక్కీ కౌశల్, లవ్ సోనియాలో నటించిన రిచా చిందా, ఫ్రిదా ఫింటోలతో పోటీ పడుతోంది. ఉత్తమ నటి కేటగిరీలో కీర్తీ సురేష్ కి … పద్మావత్ చిత్రానికి గాను దీపిక, రాజీ చిత్రంతో మంచి మార్కులు కొట్టేసిన ఆలియా భట్, హిచ్కీ మూవీ నుంచి రాణీ ముఖర్జి, తుమ్హారీ సులు చిత్రం నుంచి విద్యా బాలన్, సర్ చిత్రం నుంచి తిలోత్తమా షోమ్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఆగస్ట్ 10న మెల్బోర్న్ లో ఈ ఇండియన్ మూవీ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ లోనే ధనుష్ తొలి ఇంటర్నేషనల్ మూవీ Extraordinary journey of the Fakir మూవీ కూడా ప్రదర్శిస్తారు.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018