ఉత్తరాది వారి రాముడిని ఆది పురుషుడిగా కొలుస్తారు. ప్రభాస్‌తో ఓం రౌత్ తీస్తున్న ఆది పురుష్ కథ రామాయణంలో ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందోతెలియదు. పోస్టర్‌లో మాత్రం వార్ సీన్సే ఎక్కువగా ఉన్నాయి. బాహుబలి తర్వాత వారియర్ హీరోగా ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా బాహుబలిలో వార్ సీన్స్‌లో ప్రభాస్ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో వనవాస ఘట్టం, సీతాపహరణం నుంచి ఓం రౌత్ కథ రాసుకున్నాడా అన్నది ఓ డౌట్.అలా అయితేనే రామ రావణ యుద్ధాన్ని సెటిల్డ్‌గా ఒక రెండు గంటలు అద్భుతంగా చూపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సైఫ్ అలీఖాన్‌ని రావణుడిగా ఎంచుకున్నారు. సీత క్యారెక్టర్‌కి రీసెంట్‌గా కృతి సనన్ ఎంపికయ్యారు. ఆ మధ్య పానిపట్ సినిమాలో కృతిసనన్ కనిపించింది. మరాఠాల మేకప్‌లో చాలా బాగా సూట్ అయింది. బహుశా ఓం రౌత్ అందుకే ఆమెను ఎంపిక చేసి ఉంటారు. అలాగే కీలకమైన లక్ష్మణుడి క్యారెక్టర్‌లో సన్నీ సింగ్ ఎంపికయ్యారు. క్యాస్టింగ్ అంతా రిచ్‌గానే సెట్ అయింది. అసలైన క్యారెక్టర్ హనుమంతుడు. హనుమంతుడిగా ఎవరు కనిపిస్తారన్న సస్పెన్స్ మాత్రం మిగిలి ఉంది.
రామాయణం భారతీయులకు గొప్ప సెంటిమెంట్. మన తెలుగులో ఎన్టీఅర్ రాముడి పాత్రకు ప్రాణం పోశారు. సీత అనగానే అంజలి దేవి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రారు. హనుమంతుడి పాత్రలో ఆర్జా జనార్ధన రావు పరకాయ ప్రవేశం చేశారు. లక్ష్మణుడు అనగానే కాంతారావు గుర్తొస్తారు. ఇక లవకుశలు సృష్టించిన సంచలనాలు ఇప్పటికీ ఇండస్ట్రీ కథలుగా చెప్పుకుంటూనే ఉంటుంది.బాపూ గారి రామాయణంలో ఆనాడు ఎన్టీఆర్‌కి వీలు చిక్కగా శోభన్ బాబుతో చేస్తే అదీ సూపర్ హిట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ లాంఛిగ్ బాల రామాయణమే. అదీ సూపర్ హిట్టే. రాముడి పేరు మీద సినిమా తీస్తే చాలు కాసులు కురుస్తాయి. రామాయణం, మహా భారతాలను మించిన కథలు లేవు. ఇక పుట్టవు కూడా. ఇప్పుడు ఈ కాలంలో రాముడిగా ప్రభాస్‌ని ఎలా చూపిస్తారు అన్నదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్. తానాజీ సినిమాతో పీరియాడిక్ సినిమాలను దర్శకుడు ఓం రౌత్ బాగా చేస్తారని నమ్మకం ఉంది. మరి ఈ తరం వారికి.. ఈ తరానికి నచ్చేట్టు… రామాయణాన్ని విజువల్ వండర్‌గా చెప్పగలిగితే అంతకన్నా ఏముంది. పైగా ఒకవైపు అయోధ్య ఆలయ నిర్మాణం, మరోవైరు ఆదిపురుష్ రామాయణ కావ్యం. ఇంతకన్నా మంచి రోజులు ఏం కావాలి. ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూద్దాం