చినబాబు లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు చంద్రబాబు. ఫస్ట్ టైం పొలిటికల్ ఎక్సామ్ రాయబోతున్న లోకేశ్ పాసవుతాడో లేదో అన్న టెన్షన్ చంద్రబాబుకే ఎక్కువగా ఉంది. మొదట గుడివాడ అనుకుంటే అక్కడ కొడాలని నాని ఉన్నడని భయపడ్డారేమో? విశాఖ, భీమిలి అనుకుంటే ఇప్పటికే అక్కడ గంటా అలక పాన్పు ఎక్కి కూర్చున్నాడు. లోకేశ్ ట్వీట్ చేస్తేనే గాని అలక వీడలేదు. మొత్తానికి టీడీపీ హోప్ కోస్ట్ విశాఖ కూడా చినబాబుకి దక్కలేదు. ఇక పెనమలూరు, హిందూపురం చాలా పేర్లు వినిపించాయి గానీ.. సేఫ్‌గా పాసైపోయే ఎక్సామినేషన్ సెంటర్ అయితే బెటర్ కదా. కానీ మంగళ గిరి సేఫ్ జోన్ కాదన్నది పొలిటికల్ ఎనలిస్టుల మాట. ఇప్పటి వరకు చేతిలో పని కాబట్టి ఎమ్‌ఎల్‌సీగా ఓ పోస్ట్ ఇచ్చేసి… మంత్రి పదవి అప్పణంగా ఇచ్చేశారు గానీ.. ఈ సారి అదే బ్యాక్ డోర్ పాలిటిక్స్ అంటే జనం ఒప్పుకోరు. పోటీ చేసి గెలవాల్సిందే. అందుకే యెల్లోబాబులు సర్వేలు చేసి మంగళ గిరి సేఫ్ అని చెప్పారట. కానీ, మంగళగిరి పొలిటికల్ హిస్టరీ చూస్తే.. అసలు ఏ యాంగిల్‌లో చినబాబు గెలుస్తారని పెదబాబుగారు అనుకున్నారో అర్థం కాని పరిస్థితి. ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి…. టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైసీపీ ఎమ్మెల్యే హయాంలో అభివృద్ధి కూడా పెద్దగా లేదని, ఆయనపై వ్యతిరేకత ఉందని, అందువల్ల ఈ సారి తెలుగుదేశం పార్టీకే స్కోప్ ఉందని యెల్లో క్యాడర్ చంద్రబాబుకి రిపోర్ట్ ఇచ్చింది. నారా లోకేశ్ ఓటు కూడా మంగళగిరిలోనే ఉంది.. అన్ని మంచి శకునములే అని బాబు గారు… మంగళగిరిని ఎంచుకున్నారని తెలుస్తోంది. ఇక చరిత్రలోకి వెళ్తే 1983 నాటి ఎన్టీఆర్ ప్రభంజనంలో మంగళగిరిలో టీడీపీ గెలిచింది. ఆ తర్వాత వెంటనే 1985 నాటి ఉపఎన్నికల్లో మళ్లీ టీడీపీనే గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు అక్కడ టీడీపీ నేరుగా పోటి చేసిందే లేదు. పైగా అక్కడ కాంగ్రెస్‌కి క్లీన్ రికార్డ్ ఉంది. 1999, 2004, 2009లో అక్కడ కాంగ్రెస్ హవా కొనసాగింది. విభజన సమయంలో ఆ కంచుకోట బద్దలైంది. అప్పటికీ గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలకు ఫుల్ మెజారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మంగళ గిరిలో టీడీపీ నేరుగా పోటీ చేస్తున్నది నాలుగో సారి అవుతుంది. టీడీపీకి అసలు అచ్చిరాదనుకున్న మంగళగిరి నియోజకం వర్గాన్ని పోయి పోయి చినబాబుకి ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? పోనీ అక్కడ సామాజిక వర్గం ఓట్లు కలిసొస్తాయా అంటే అదీ లేదు అక్కడ బీసీ ఓటు బ్యాంకు ఎక్కువ. ముఖ్యంగా పద్మశాలీలు ఎక్కువ. తమ సామాజిక వర్గానికి సీటు కావాలని వారంతా ఇప్పటికే ఫైట్ చేస్తున్నారు. అందుకే ఈ సారి వైసీపీ కూడా బీసికి చెందిన వ్యక్తిని బరిలో దించుతోంది. మరి ఎలాంటి ఈక్వేషన్లు బాబుగారి నిర్ణయానికి కారణం అయ్యుంటాయి…? రాజధానిగా అమరావతి వచ్చాక… మంగళగిరి ఇప్పుడు హాట్‌కేక్ లాంటి ఏరియా. రియల్ ఎస్టేట్ మహా జోరుగా నడుస్తోంది. చిన్న చిన్న వ్యక్తులు కూడా రియల్టర్ల అవతారాలెత్తారు. వేల కోట్ల రూపాయల స్థిరాస్తి వ్యాపారం జరుగుతోంది. సాక్షాత్తు సీఎం గారి అబ్బాయి బరిలో దిగుతున్నారంటే ఆ హడావిడి చెప్పేదేముంది. వాళ్ల వాళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగాలంటే చినబాబు చల్లని చూపుంటే చాలు.అందువల్లే రియల్టర్లే దగ్గరుండి బాబుని గెలిపించుకుంటారని, అందుకే మంగళ గిరిని ఎంచుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతా చేసి ఈ మంగళ గిరే కన్ఫర్మ్ అని కూడా చెప్పలేం. ఏమో మళ్లీ మార్చి మార్చి చివరికి పెనమలూరే ఖాయం చేసినా చెయ్యొచ్చు. ఎందుకంటే లోకేశ్ ఓడిపోతే పోయేది చంద్రబాబు పరువే. లేదు మంగళగిరే అంటారా… లోకేశ్‌ని పానకాల స్వామే గెలిపించాలి.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018