ఎన్టీఆర్ బయోపిక్‌లో కృష్ణగా ఎవరు వేయబోతున్నారో తెలుసా? ఇది నిజంగా అభిమానులకు షాకింగే. అంతా ఓకే అయితే సూపర్ స్టార్ కృష్ణగా ప్రిన్స్ మహేష్ బాబు నటించబోతున్నారని సమాచారం. ఇందుకు మహేష్ సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అఫిషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్, కృష్ణ వీరిద్దరి మధ్య ఎంత పోటాపోటీ ఉండేదో ఆనాటి సినీ ప్రియులకు బాగా తెలుసు. ఎన్టీఆర్ అభిమానిగానే సినిమాల్లోకి వచ్చిన కృష్ణ.. సూపర్ స్టార్‌గా సిల్వర్ స్క్రీన్‌ని ఏలారు. ఎన్టీఆర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఆయన సినిమాలకు ధీటైన పోటీ ఇచ్చి నిలబడ్డారు. ఎన్టీఆర్ చేద్దామనుకున్న అల్లూరి సీతారామరాజు కథను.. ఆయన అనుకునే లోపే షూటింగ్ చేసి విడుదల చేసి ఘన విజయాన్ని సాధించిన వ్యక్తి కృష్ణ. రామారావు ముఖ్యమంత్రి అయ్యాక కూడా సినిమా మాధ్యమంగా ఆయనపై రాజకీయ విమర్శనాస్త్రాలు సంధించిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ. అంతటి టఫ్ కాంపిటేషన్ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ మధ్య ఉన్నది ప్రొఫెషనల్ గ్యాప్ మాత్రమే. బయట ఎప్పటికీ తాను ఎన్టీఆర్ వీరాభిమానినేనని ఇప్పటికీ చెప్తుంటారు. ఇప్పుడలాంటి డేరింగ్ పాత్రలో మహేష్ ఎలా నటిస్తారో నిజంగా వెరీ వెరీ ఇంట్రస్టింగ్. రోజుకో వార్తతో ఎన్టీఆర్ బయోపిక్ హీట్ పెరుగుతోంది.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018