May 30, 2023

చిరు… నీకు సాటెవ్వరు…

చిరు… నీకు సాటెవ్వరు…

మెగాస్టార్ మెగా స్టారే. ఆయనకు వయసు లేదు. మేకింగ్‌ వీడియోతోనే గూస్‌బంప్స్‌ తెప్పించాడు. ఎంతమంది స్టార్లను చూపించినా, ఆఖరికి అమితాబ్‌ని చూపించినఅబ్బా.. చిరు ఇంకా రాడేంట్రా బాబూ.. అనిపించింది. ఏంటో.. చిరులో ఉన్న ఆ సమ్మోహన శక్తి అలాంటిది. అసలు మేకింగ్‌ వీడియో స్టన్నింగ్‌. సురేందర్‌ రెడ్డికి హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఎలా ఉంటాం. బీజీఎం అదరగొట్టేశాడు.. అమిత్‌ త్రివేది. అన్నట్టు అమిత్‌ త్రివేది ఏదో సాదా సీదా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనుకునేరు. బాలివుడ్‌ని ఊపేసిన ఎన్నో సినిమాలకు ఆయన మ్యూజిక్‌ సోల్‌. ఇంగ్లీష్‌ వింగ్లీష్‌, క్వీన్‌, ఉడ్తా పంజాబ్‌, సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌, ప్యాడ్‌మాన్‌, రైడ్‌, అంధాదున్‌, కేదారనాథ్లేటెస్ట్‌ సన్సేషనల్‌ మూవీ మంగళ్‌యాన్‌కి కూడా అమిత్‌ త్రీవేదీనే మ్యూజిక్‌ డైరెక్టర్‌. స్టంట్స్‌ గురించి చెప్పేదేముంది.. ఇలాంటి స్టంట్స్‌ మీరెప్పుడూ చూడరు అంటూ హాలివుడ్‌ స్టంట్‌ మాష్టరే చెప్తున్నాడు. ఇక కిచ్చ సుదీప్‌, తమిళ్‌ సన్షేషన్‌ విజయ్‌ సేతుపతి లుక్స్‌ అదుర్స్‌. జగపతిబాబు లుక్‌ వండర్‌ఫుల్‌. నయనతార, తమన్నా లుక్స్‌తో స్క్రీన్‌కి కొత్త కలర్స్‌ వచ్చాయి. ఇక రామ్‌ చరణ్‌ నిర్మాతగా మరో మెట్టు ఎక్కేశాడు. ఇవన్నీ ఎందుకు చిరంజీవి సంగతేంటో చెప్పండంటారాచిరంజీవి గురించి చెప్పేదేముంది. ఆయన జగదేక వీరుడు. జగదేకవీరుడిని వర్ణించడం ఎవరితరం కాదు. చిరంజీవికి మీనింగ్‌ చెప్పాలంటే మళ్లీ చిరంజీవి అనే చెప్పాలి. సరిలేర నీకెవ్వరూ, సరిరారు నీకెవ్వరూ. తెలుగు ఇండస్ట్రీ ఉన్నన్నాళ్లూఆ కుర్చీని ఫిల్‌ చేయడం.. బహుశా ఇక ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆ కుర్చీ ఎప్పుడూ ఖాళీనేబాస్‌. సైరా.. తొందరగా వచ్చేయ్‌. ఇక ఈ టీజర్లు, మేకింగ్ వీడియోలతో ఊరించి చంపకు బాబు.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *