June 3, 2023

ఆదివారం మెట్రో బంద్‌

ఆదివారం మెట్రో బంద్‌

మెట్రో ప్రయాణికుల్లో చాలా రోజుల నుంచి కరోనా భయాలు ఉన్నాయి. అయితే పంజాగుట్ట, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ ఆఫీసులు ఉన్నవారికి మెట్రో ఒక వరం.ఈ మాయదారి కరోనా వచ్చినప్పటి నుంచి మెట్రో ప్రయాణాలు కలవరంగా మారాయి. అయితే ఆదివారం జనతా కర్ఫ్వూలో భాగంగా మెట్రో సేవలు నిలిపివేస్తున్నారు. అలాగే మెట్రో స్టేషన్లలో ఉన్న మాల్స్‌ కూడా బంద్‌. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని మెట్రో సిబ్బంది ప్రయాణికులను కోరారు. కరోనా అనుమానాలు ఉన్నప్పటి నుంచి మెట్రో సిబ్బందిప్రతీ 3 గంటలకు ఓ సారి రైళ్లను శానిటైజ్‌ చేస్తున్నారు.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *