June 7, 2023

సరిగ్గా 10 ఏళ్ల క్రితం అంటే 2014 మార్చ్‌ 8న మలేషియాలోని కౌలాలంపూర్‌ నుంచి బోయింగ్‌ 777 విమానం బయలు దేరింది. కౌలాలంపూర్‌ నుంజి ఆ విమానం చైనాలోని బీజింగ్‌కి వెళ్లాలి. ఆ విమానం పేరే MH 370. ఆ విమానంలో 227 మంది పాసింజర్స్‌, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఆ విమానం ఎయిర్ అయిన కొద్ది సేపటికే కమ్యూనికేషన్స్‌ తెగిపోయాయి. ఆ విమానం ఏమైందో ఎవరికీ తెలియలేదు. ఆస్ట్రేలియా, మలేషియా, చైనా ప్రభుత్వాలు ఎంతో కాలం అన్వేషించినా ఆ విమానం మాత్రం దొరకలేదు. అమెరికాకు చెందిన ‘ఓషన్ ఇన్ఫినిటీ’ అనే డైవింగ్‌ ఆర్గనైజేషన్‌ హిందూ మహా సముద్రం లోతులకు వెళ్లి వెదికినా MH370 దొరకలేదు. అలా 2017 వరకు ఆ విమానాన్ని వెతుకుతూనే ఉన్నారు. బట్‌.. చిన్న క్లూ కూడా దొరకలేదు. అప్పటి నుంచీ ఈ విమానం స్టోరీ మిస్టరీగా మారింది. పైలేట్‌ ఉద్దేశ పూర్వకంగా కూల్చేశాడని, లేదూ హైజాక్‌ అయిందని ఈ స్టోరీ చాలా మిస్టరీలు వచ్చాయి. వాటిలో ఏది నిజమో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఒక జాలరికి ఈ విమాన శకలాలు దొరికాయని చెప్తారు. అందులోనూ సరైన క్లారిటీ లేదు.. ఇన్ని కన్ఫ్యూజన్ల మంధ్య ఇప్పుడు ఈ స్టోరీతోనే నెట్‌ఫ్లిక్‌ ఒక సిరీస్‌ చేసింది. విమానం కనపడకుండా పోయిన మార్చ్‌ 8నే ఆ సిరీస్‌ని విడుదల చేస్తోంది. మరి నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌లో MH370 మిస్టరీకి ఒక కంక్లూజన్ ఇస్తారా చూడాలి….

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *