May 30, 2023

వచ్చేసింది… మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రెకోనింగ్‌ టీజర్‌ వచ్చేసింది. టామ్‌ క్రూజ్ మిషన్‌ ఇంపాజిబుల్‌ సిరీస్‌లో ఇది ఏడో సినిమా. ఇది రెండు భాగాలు. ఫస్ట్‌ పార్ట్‌ 2023 జూలైలో రిలీజ్‌ అని అనౌన్స్‌ కూడా చేసేశారు. ఎప్పటిలాగే డెడ్లీ రిస్క్‌ షాట్స్‌తో 60 ఏళ్ల వయసులో కూడా రిస్కీ షాట్లు చేయడం అనేదివరల్డ్ సినిమా హిస్టరీలో టామ్‌కి మాత్రమే చెల్లింది. ఇంకో యాక్టర్‌ వల్ల కాలేదు.మిషన్‌ ఇంపాజిబుల్‌ అంటే టామ్‌ క్రూజ్‌. టామ్‌ క్రూజ్‌ అంటే మిషన్‌ ఇంపాజిబుల్‌. అంతే… ఎంతమంది క్యాస్టింగ్‌ అయినా ఉండనివ్వండి. చివరి వరకు స్క్రీన్‌ మీద మన దృష్టి టామ్‌ మీద తప్ప ఇంకెవ్వరి మీద పడనివ్వడు. ప్రపంచ సినిమా చరిత్రలోనే డెడ్‌లీ రిస్క్‌లు తీసుకునే యాక్టర్స్‌లో టామ్‌ రూటే వేరు. టాప్‌ 5 రిస్క్‌ల గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

డెడ్లీ రిస్క్‌ 5- అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ (రోగ్ నేషన్‌ )

మిషన్‌ ఇంపాజిబుల్‌ రోగ్‌నేషన్‌ సినిమాలో ఓ హారిబుల్ సీన్‌ ఉంటుంది. అందులో టామ్‌.. వితవుట్‌ ఆక్సిజన్‌ ఓ డెడ్లీ పూల్‌లో దిగి సెక్యూరిటీ సిస్టమ్‌ని హ్యాక్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సీన్‌ కోసం డైరెక్టర్ మొదట డూప్‌ని పెట్టడమో, లేదా గ్రాఫిక్స్‌లో చేయడమో చేద్దామనుకున్నారు. కానీ టామ్‌ ఒప్పుకోలేదు. షూటింగ్‌ ఇంకా 10 రోజులు ఉందనగా బ్రీత్‌ టెక్నిక్స్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాడు. సాధారణంగా 2 నిమిషాలు మించి ఊపిరి నిలపడం కష్టం. అలాంటిది ఈ సీన్‌ కోసం రియల్‌ షూట్‌లో టామ్‌ 5 నిమిషాల పాటు బ్రీత్‌ని హోల్డ్‌ చేశాడు. ఇది చాలా కష్టమైన పని. తేడా వస్తే ప్రాణాలు పోతాయి. అయినా టామ్‌ రిస్క్‌ చేశాడు.

డెడ్లీ రిస్క్ 4 – బైక్‌ ఛేజ్‌ (ఫాల్‌ అవుట్)

ఫాల్‌ అవుట్‌ సినిమాలో టామ్‌ బైక్ ఛేజ్‌ చూస్తే మనకే భయమేస్తుంది. అంత అద్భుతంగా ఆ సీన్‌ తీశారు. పొడిగా ఉన్న రోడ్ల మీద ఛేజ్‌ సీన్లు మేనేజ్‌ చేయొచ్చు. కానీ ఆ షూట్‌ మొత్తం వెట్‌ రోడ్స్‌ మీద జరిగింది. రియల్‌ టైమ్ షూటింగ్‌లో టామ్‌ గంటకు 100 మైళ్ల వేగంతో దూసుకెళ్లారని డైరెక్టర్‌ స్పెషల్‌ ఇంటర్వూలో చెప్పారు. ఏ మాత్రం స్కిడ్‌ అయినా ప్రాణాలు పోవడమే.

డెడ్లీ రిస్క్ 3- స్కై డైవింగ్‌ (ఫాల్‌ అవుట్)

ఫాల్‌ అవుట్‌ సినిమాలోనే ఎంట్రీ సీన్‌లో స్కై డైవింగ్ ఉంటుంది. ఈ సీన్‌ కోసం టామ్‌ 25 వేల అడుగుల ఎత్తు నుంచి నిజంగానే స్కై డైవ్‌ చేశారు. ఈ సీన్‌ కోసం ఆయన 106 సార్లు స్కై డైవింగ్‌ ప్రాక్టీస్‌ చేశారట. సినిమాలో ఈ సీన్‌ 2 నుంచి 3 నిమిషాలు ఉంటుంది. ఆ సీన్‌ కోసం టామ్ ప్రాణాలు పణంగా పెట్టారని చెప్పొచ్చు. నిజానికి ఈ సీన్‌లో కొంత భాగం గ్రాఫిక్స్‌లో మేనేజ్‌ చేద్దామని డైరెక్టర్‌ ఎంత చెప్పినా టామ్‌ వినలేదు. రియల్‌ షాట్‌కే ఓకే చెప్పారు. దటీజ్‌ టామ్‌. ఈ రిస్కీ షాట్‌ టైమ్‌కి ఆయన ఏజ్‌ 56 ఏళ్లు.

డెడ్లీ రిస్క్‌ 2: రాక్‌ క్లైంబింగ్‌ (MI-2)

యూఎస్‌లో ఉన్న ఉతా రాక్‌ క్లైంబింగ్‌కి ఫేమస్‌. అక్కడ రాక్‌ క్లైంబింగ్‌ అంత ఈజీ కాదు. తేడా వస్తే మనిషి కనిపించడు. అలాంటి చోట టామ్‌ ఓపెనింగ్‌ షాట్‌ ప్లాన్ చేశాడు డైరెక్టర్‌ వూ. రెండు చిన్న వైర్లతో టామ్‌ చేసిన ఆ రాక్‌ క్లైంబింగ్‌ షాట్‌ ఇప్పటికీ మన ఒళ్లు జలదరించేలా ఉంటుంది. ఒకచోట టామ్ జారపడి మళ్లీ రాక్‌ని పట్టుకోవడం ఆడియన్స్‌ని కూడా భయపెడుతుంది. కొసమెరుపుఏంటంటే…ఫస్ట్‌ టైమ్‌ తీసిన షాట్‌లో ఫోకస్‌ బాగాలేదని డైరెక్టర్‌ బాధపడుతుంటే..అది గమనించిన టామ్ డైరెక్టర్‌ దగ్గరికి వెళ్లి.. డోంట్ వరీ.. ఐయామ్‌ రెడీతో సెకండ్‌ టేక్‌ అన్నాడట. ప్రాణాలంటే లెక్కలేకపోవడం కాక ఇంకేమిటి? దటీజ్‌ టామ్‌.

డెడ్లీ రిస్క్‌ 1: హ్యాంగింగ్ ఆఫ్‌ ప్లేన్‌ (రోగ్‌ నేషన్‌)

వరల్డ్‌ సినిమా హిస్టరీలోనే కాదు, రిస్కీ ఫీట్లలో కూడా ఈ షాట్‌ నెంబర్‌ వన్‌. ఇది నిజంగానే లైఫ్‌ రిస్క్‌. తేడా వస్తే కనీసం టామ్‌ బాడీ కూడా దొరకదు. అంతటి లైఫ్‌ రిస్క్‌ షాట్‌. రోగ్‌ నేషన్‌ సినిమాలో టామ్‌ ఎంట్రీ షాట్ నిజంగా అద్భుతం. జస్ట్‌ ఒక చిన్న తాడు సపోర్ట్‌తో విమానం బయట వేలాడాడు టామ్‌.దాదాపు 5 వేల అడుగుల ఎత్తు వరకు అలా వేలాడుతూనే ఉన్నాడు. అంత ఎత్తులో ఏదైన పక్షి టామ్‌ని తాకినా కూడా ప్రాణానికి ప్రమాదమే. ఆ షాట్‌ చేస్తున్నప్పుడు ప్రాణాలు గాల్లోనే పోతాయేమో అని టామ్‌కి కూడా అనిపించిందట. కళ్లలోకి అంత ఫోర్స్‌గా గాలి వెళ్తే చూపుకి ప్రమాదం అని కళ్లు మొత్తం కాంటాక్ట్‌ లెన్స్‌ పెట్టారు. చెవుల్లోకి కూడా అంత మొత్త గాలి వెళ్తే ప్రమాదం కాబట్టి ఇయర్ బడ్స్‌ కూడా పెట్టారు. అలా అంత ఎత్తులో టామ్‌ కళ్లు కనిపించని, వినపించని సిట్యుయేషన్‌లో ఆ షాట్‌ చేశాడు.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *