May 30, 2023

మిషన్‌ ‘ఇంపాజిబుల్‌’ – అవును టామ్‌ అసాధ్యుడే !!

మిషన్‌ ‘ఇంపాజిబుల్‌’ – అవును టామ్‌ అసాధ్యుడే !!

సినిమా అంటే పిచ్చి, కసి ఇలాంటి పదాలు వింటుంటాం. అలాంటి వాటిని చూడాలంటే టామ్‌ క్రూజ్‌ సినిమాలు చూడాలి. “వాడో మెంటలోడు.. సినిమా కోసమని 5 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం బయట ఓ చిన్న తాడు పట్టుకుని రియల్‌గా ఎగిరేస్తాడా..? తాడు తెగితేపిచ్చా వాడికేమైనా..?”. అంటే చాలా సింపుల్‌గా యస్‌ బాస్‌ఐయామ్‌ మ్యాడ్‌అంటాడు టామ్‌. అప్పటికి టామ్‌.. బాలా కుమారుడేం కాదు. 55 ఏళ్లవాడు. ఆ వయసులో ఆ ఫీట్‌ఎవరికి సాధ్యం?

యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం హై స్పీడ్‌ మీద వెళ్తున్న ట్రైన్‌ మీద డూప్‌ లేకుండా వేలాడతారా ఏవరైనా.. జోకులెయ్యకు గురూడూప్‌ అయ్యుంటుంది బాసు…” అన్నారంటే టామ్‌కి మా చెడ్డ కోపం. “మరో సారి చేసి చూపించనాఅంటాడు ఎందుకంటే అది డూప్‌ కాదురియల్లీ రియల్‌.

అమెరికాలో ప్రమాదకరమైన రాక్‌ క్లైంబింగ్‌ హిల్‌ స్టేషన్‌ ఉతాహ్‌ అది. డెడ్‌ హార్స్‌ పాయింట్‌.. శిఖరం కొన కనీసం 2000 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ వేలాడాలి టామ్‌. కనీసం రోప్స్‌ సపోర్ట్‌కి కూడా కుదరటం లేదు. ఏం చేద్దాం.. వదిలేద్దాం అనుకున్నారట డైరెక్టర్‌. “షాట్‌ రెడినా నేను రెడీఅని వాయిస్‌ వినబడింది. నవ్వుతూ టామ్‌. మిషన్‌ ఇంపాజిబుల్‌-2లో హీరో ఎంట్రన్స్‌ షాట్‌.. సినీ చరిత్రలో మోస్ట్‌ డేంజరస్‌ ఫీట్లలో ఇదొకటి. రోప్స్‌ కూడా లేకుండా ఇంత డేంజరస్‌ షాట్‌లో నటించిన హీరో టామ్‌.

ఓ పది అంతస్తుల బిల్డింగ్‌ ఎక్కి కిందకి చూస్తేనే కళ్లు తిరుగుతాయి. అలాంటిది ప్రపంచంలోనే అతి పొడవైన బిల్డింగ్‌… 2,722 అడుగుల ఎత్తుదుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా. ఆ బిల్డింగ్‌ 2 వేల అడుగుల ఎత్తులో.. బిల్డింగ్ బయట నుంచి పాకుతూ మరో ఫ్లోర్‌కి వెళ్లాలి. సాధ్యమేనా? కానీ అక్కడున్నది టామ్‌బయట స్పైడర్‌ మ్యాన్‌లా ఎక్కేస్తూ.. అంతెత్తు నుంచి కేవలం చిన్నచిన్న తాళ్ల సాయంతో గెంతే ఫీట్‌.. ఊహిస్తుంటేనే వణుకొస్తుంది కదా. తేడా వస్తే ఏం జరుగుతుందో టామ్‌కి కూడా తెలుసు. ఎందుకురా బాబు ఇదంతా అంటేఈ సోదంతా ఎందుకు బాస్‌.. నెక్స్ట్‌ షాట్‌ ఏంటి అంటాడుఏదో బస్సెక్కి దిగినట్టు…”

ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన ఫీట్స్‌ చేసిన లిస్ట్‌ తీస్తే టామ్‌ క్రూజ్‌ పేరే ప్రముఖంగా ఉంటుంది. టామ్‌ క్రూజ్‌.. మనిషేం ఆజానుబాహుడు కాదు. అరవింద నేత్రుడూ కాదు. కానీ, హీరో అంటే వీడేరా అనిపించే బాడీ లాంగ్వేజ్‌. ఏజెంట్‌ ఈథన్‌ పాత్రలో జీవించిన మిషన్‌ ఇంపాజిబుల్‌ సిరీస్‌లో ఇప్పటి వరకు 5 సినిమాలొచ్చాయి. వాటిలో హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా దుమ్ముదులిపేశాయి. కారణం ఒక్కటే.. టామ్‌ క్రూజ్‌. కొత్త సినిమా మిషన్‌ ఇంపాజిబుల్‌: ఫాల్‌ అవుట్‌. ఇది ముందరి సినిమా రోగ్‌ నేషన్‌కి సీక్వెల్‌. దాదాపు రెండున్నర గంటలున్న ఈ సినిమా ఆల్రెడీ యూఎస్‌, రష్యాల్లో విడుదలై ఇరగదీస్తోంది. బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. జూలై 27న భారత్‌లో దుమ్ము దులిపేందుకు సిద్ధమైంది. ఇందులో టామ్‌ చేసిన సాహసాలు చూస్తుంటేకసి ఉంటే మనుషులు హీరోలవుతారనిపిస్తుంది. ఒక షాట్‌ కోసం కాలు కూడా విరగొట్టుకున్నాడు. ఆ విరిగిన కాలుతోనే పరిగెత్తి షాట్‌ ఫినిష్‌ చేశాడు కూడా. దటీజ్‌ కమిట్‌మెంట్‌.

56 ఏళ్ల వయసా ఇతనికి..? ముఫ్పై ఐదో, నలభయ్యో అనుకున్నానే.. అని అనిపిస్తే.. “ మనసు, ఆలోచనల బట్టే వయసుఅని టామ్‌ సమాధానం వస్తుంది. హీరోగా హిట్టైతే చాలువేల కోట్ల రెమ్యూనరేషన్‌ హాలివుడ్‌లో. హాయిగా చేసుకోవచ్చు. ఒక్క సినిమాతో సెటిల్‌ అయిపోవచ్చు. బట్‌.. అదేం కిక్కు అనుకున్నాడో ఏమోమిషన్‌ ఇంపాజిల్‌ ఫ్రాంచైజ్‌ సహ నిర్మాతగా బోల్డన్ని డబ్బులు పెట్టాడు టామ్‌. సినిమాయే జీవితామాయే. పోయినా, వచ్చినా అక్కడే.

టామ్ క్రూజ్‌ టేస్టే వేరు. మిషన్‌ ఇంపాజిబుల్‌ లాంటి మూవీసే కాదుమేగ్నోలినా, మైనారిటీ రిపోర్ట్‌, వార్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌, ఎడ్జ్‌ ఆఫ్‌ టుమారో, వాల్కైరీ, టాప్‌ గన్‌, రెయిన్‌ మ్యాన్‌, ది లాస్ట్‌ సమురాయ్‌, కాక్‌టైల్‌, ఏ ఫ్యూ గుడ్‌మెన్‌, కొల్లాటెరెల్‌చూసి తీరాల్సిన సినిమాలు. వీటిలో వాల్కైరీ, మైనారిటీ రిపోర్ట్‌, రెయిన్ మ్యాన్‌, కొల్లాటెరెల్‌లో టామ్‌ నటన అద్భుతం.

మూడు అకాడమీ అవార్డులు, మూడు గొల్డెన్ గ్లోబ్‌ అవార్డులువేవీ ఆయనకు సంతృప్తినిచ్చినట్టు ఆయనెప్పుడూ చెప్పుకోలేదు. ఆయనకు సంతృప్తినిచ్చింది ఒక్కటేరిస్క్‌, రిస్క్‌, రిస్క్‌. మరిఅయ్యబాబోయ్‌ ఏం రిస్కీ సీన్‌రా అనిపించేలా.. వచ్చేస్తోందిమిషన్‌ ఇంపాజిబుల్‌: ఫాల్‌ అవుట్‌. ద మోస్ట్‌ అవైంటింగ్ మూవీలో టామ్‌ ఎలాంటి సహసాలు చేశాడో చూసేద్దామా

సతీష్‌ కొత్తూరి

 

 

 

 

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *