June 7, 2023

ఈ సంవత్సరం జనవరిలో రిలీజైన మమ్మూట్టీ సినిమా నాన్‌పకల్‌ నెరత్తు మయ్యక్కమ్‌సూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమా మమ్మూట్టి ఒన్‌ మేన్‌ షో. అత్యద్భుతమైన నటనతో మమ్మూట్టి అదరగొట్టేశారు. ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఆ సినిమా స్టోరీలైన్‌ ఒక అడ్వర్టైజ్‌మెంట్‌ నుంచి తీసుకున్నారని తెలుసా?

2005లో వచ్చిన గ్రీన్‌ ప్లై ప్లేవుడ్‌ యాడ్‌ ఒకటి వచ్చింది. అందులో ఒక చిన్నబస్సులో ఒక సిక్కు కుటుంబం తమిళనాడు గ్రామాల మీదుగా వెళ్తుంటుంది. ఒక పల్లెలో ఒక పాత ఇంటి ముందు నుంచి బస్సు వెళ్తున్నప్పుడు ఆ సిక్కు పిల్లాడు బస్సుని ఆపమని గోల పెడతాడు. ఆ పిల్లాడు నేరుగా ఆ ఇంటికి వెళ్లగానే అతనికి గత జన్మ స్మృతులు గుర్తొస్తాయి. అక్కడి ఫర్మీచర్‌ని గుర్తు పడతాడు. ఒక పడక కుర్చీలో కూర్చుంటే.. ఆ ఇంటి ముసలామే వచ్చిన తన భర్తేనని గుర్తుపడుతుంది. ఎన్ని జన్మలైనా గ్రీన్‌పై నిలిచే ఉంటుందిఅని యాడ్‌ ముగుస్తుంది. ఆ యాడ్‌ లింక్‌ ఇది

సరదా సరదాగా నడిచే ఆ యాడ్‌ ప్రేరణతోనే ఈ కథ రాసుకున్నాను అని ‘నాన్‌పకల్‌ నెరత్తు మయ్యక్కమ్‌’ దర్శకుడు లిజో జోస్‌ సినిమా ఇంట్రోలో చెప్పి అప్పుడు కథలోకి వెళ్తాడు. ఈ సినిమా ఒక అద్భుతం. ఇందులో మమ్మూట్టీ జేమ్స్‌ పాత్రలో కనిపిస్తాడు. మళయాళీ అయిన జేమ్స్‌, తన ఊరి స్నేహితుల కుటుంబాలు తమిళనాడులో ఉన్న వేలంకణి ఆలయానికి ఒక చిన్న బస్సులో వెళ్తారు. తిరిగి వస్తున్న సమయంలో అందరు అలిసిపోయి బస్సులో పడుకుంటారు. తమిళనాడు బోర్డర్‌లో ఒక గ్రామం మీదుగా బస్సు వెళ్తుంటుంది. అప్పుడు అకస్మాత్తుగా జేమ్స్‌ బస్సుని ఆపమంటాడు. బస్సు దిగి ఎవరికీ చెప్పకుండా పక్కనే ఉన్న గ్రామంలోకి వెళ్లిపోతాడు. ఆ గ్రామంలో ఒక ఇంట్లోకి వెళ్తాడు. అది అతని ఇల్లే అన్నట్టు, ఆ ఇంట్లో ఉన్న వాళ్లు తన వాళ్లే అన్నట్టు ప్రవర్తిస్తాడు. ఆ ఇంట్లో అతని తల్లిదండ్రులు, భార్య, కూతురు ఉంటారు. ఆ ఇంట్లో విడోగా ఉన్న మహిళ భర్త సుందరం కొన్నాళ్ల క్రితం మరణించాడు. జేమ్స్‌ పాత్ర అచ్చం సుందరం లాగే ప్రవర్తించడం చూసి ఆ కుటుంబం, ఆ గ్రామం అంతా ఆశ్చర్యపోతుంది. ఇటు జేమ్స్‌తో పాటు టూర్‌కి వచ్చిన అతని భార్య, బంధువులు ఇతని వెతుక్కుంటూ వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ కథ. ‘నాన్‌పకల్‌ నెరత్తు మయ్యక్కమ్‌’ అంటే మధ్యాహ్నం కల అని అర్థం. సింపుల్‌గా పగటి కలలు అనుకోవచ్చు. పగటి కలలు నిజం కావు అనే మాట మనం అంటుంటాం. ఈ సినిమా కథ కూడా కలే అని చాలా సేపు అనుకుంటాం. కానీ.. ఈ కథను డైరెక్టర్‌ తీసుకెళ్లిన స్టైల్‌, కెమెరా, మమ్మూట్టి యాక్షన్‌ ఈ సినిమాలో లీనమైపోయేలా చేస్తాయి.

ఈ కథలో ఉన్న దమ్ము చూసే ఈ సినిమాని మమ్మూట్టీ ప్రొడ్యూస్‌ చేశారు. మమ్మూట్టి నటన కోసమే ఈ సినిమాను చూసేయొచ్చు. నేచురల్‌ షాట్స్‌, మన కుటుంబాలతో టూర్లకు వెళ్లినప్పుడు మనకు ఎదురయ్యే చిన్న చిన్న అనుభవాలను కూడా డైరెక్టర్ సూపర్‌గా క్యాప్చూర్‌ చేశారు. ఇక ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బస్సులో ఉన్నంత సేపు.. ఆ బస్సులో టీవీ నుంచి వచ్చే పాటలు, సినిమా డైలాగులే బ్యాక్‌గ్రౌండ్‌. ఇక పల్లెలో ఒక ముసలానే అలా టీవీ చూస్తూనే ఉంటుంది. అందులో సీరియల్స్‌ అలాగే పాత సినిమాల మ్యూజిక్‌ అండ్‌ డైలాగ్స్‌ని బ్యాక్‌గ్రౌండ్‌గా ఉపయోగించిన విధానం వండర్‌ఫుల్‌. ప్రత్యేకంగా ఇందులో BGM ఎక్కాడ వినిపించవు. నేచురల్‌గా వచ్చే సౌండ్స్‌, టీవీ, రేడియో అవుట్‌పుట్‌నే BGMగా సినిమా అంతా ఉపయోగించారు.

ఇక డైరెక్టర్ లిజో జోస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన డైరెక్టర్‌ మాత్రమే కాదు. ప్రొడ్యూసర్‌, యాక్టర్‌ కూడా. ముఖ్యంగా టిపికల్‌ సబ్జెక్ట్‌తో, టిపికల్‌ ఎమోషన్స్‌తో మూవీస్‌ తీయడంలో మాష్టర్‌ ఇతను. అంగమలై డైరీస్‌, తండ్రి కోరుకున్న విధంగా అంతిమ సంస్కారాలు జరిపించాలనుకునే కొడుకు కథగా వచ్చిన ఈ.మా.యూ, ఆస్కార్‌ వరకు వెళ్లిన జల్లికట్టు ఈయన తీసినవే. వేటికవే స్పెషల్ మూవీస్‌. ఇప్పుడీ సినిమా కూడా అంతే స్పెషల్‌.

గత జన్మలు, ఆత్మలు ఆవహించడం ఇలాంటివి మనం చాలా సార్లు వింటుంటాం. కొన్ని కథలు నమ్మలేని నిజాలే. అలాంటి కోవకే చెందిన నాన్‌పకల్‌ నెరత్తు మయ్యక్కమ్‌మమ్మూట్టి కెరీర్‌లో ఒక స్పెషల్ మూవి. ముఖ్యంగా 60 ఏళ్లు దాటాక కూడా అటు మమ్మూట్టీ, మోహన్‌ లాల్‌లు క్లాస్‌ టచ్‌ ఉన్న మూవీస్‌తోమన దగ్గర చిరు, బాలయ్యలు మాస్‌ టచ్‌తోతమిళనాడులో రజనీ ఊరమాస్‌తో ఇంకా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు దంచికొడుతున్నారు. ఈ మూవీలో మమ్ముట్టిని చూస్తే అసలు 70 ఏళ్లేనా ఇతనికి అనిపిస్తుంది. ఎంత యాక్టివ్‌గా చేశారంటేసినిమా అంతా ఆయన తిరిగే TVS XL తో పాటు మనమూ తిరుగుతూ ఉంటాం. మస్ట్ వాచ్‌ .

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *